తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌గా మరోసారి వైవీ సుబ్బారెడ్డి నియమితులయ్యారు. వైసీపీ ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి వచ్చిన తరువాత 2019లో వైవీ సుబ్బారెడ్డిని టీటీడీ ఛైర్మన్‌గా నియమించింది. ఛైర్మన్ పదవీకాలం రెండేళ్లు. రెండేళ్ల తరువాత వైవీ సుబ్బారెడ్డిని మారుస్తారనే ఊహాగానాలు వచ్చాయి. అయితే, వాటిక్ చెక్ పెడుతూ ఏపీ ప్రభుత్వం మరోసారి వైవీని టీటీడీ ఛైర్మన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెండోసారి అవకాశం ఇవ్వడం పట్ల వైవీ సుబ్బారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం అభివృద్ధికి అనేక చర్యలు తీసుకున్నామని, స్వామివారి కైంకర్యాలకు, ఛైర్మన్ పదవికి ఎలాంటి మచ్చ తీసుకురాకుండా పరిపాలన సాగించామని, ఇకపై కూడా తిరుమల అభివృద్ధికి కృషిచేస్తామని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. త్వరలోనే టీటీడీ బోర్డు సభ్యులను నియమించనున్నారు.
Read: టీఆర్ఎస్ ప్రభుత్వంపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు !