ఆ రాజకీయ కురువృద్ధుడు టీఆర్‌ఎస్‌ను వీడేందుకు సిద్ధమయ్యారా? కండువా మార్చేయడమే మిగిలిందా? గులాబీ గూటిలో ఆయనకు ఎక్కడ చెడింది? ఆయన పార్టీ మారితే లాభమెవరికి? నష్టమెవరికి? ఇంతకీ ఎవరా పెద్దాయన? మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి పార్టీ మారతారా? గురునాథ్‌రెడ్డి. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే. ప్రస్తుతం టీఆర్ఎస్‌లో ఉన్న ఆయన.. కారులో ఇమడ లేకపోతున్నారట. టీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పే యోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అధికారపార్టీలో ఆయన సీనియారిటీకి తగిన గుర్తింపు, ప్రాధాన్యం…
ఖమ్మం జిల్లా వైరా మండలం గన్నవరం ఖానాపురం గ్రామాల్లో 89 వ రోజు వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థాన పాదయాత్రకు స్థానిక ప్రజలు వైఎస్సార్ అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా పాదయాత్రలో గ్రామంలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి షర్మిల నివాళులర్పించారు. గ్రామంలోని ప్రజలు రైతుల కోరిక మేరకు షర్మిల తలపాగా చుట్టి రైతు అవతారంలో ట్రాక్టర్ నడిపి వైఎస్సార్ అభిమానులను రైతులను ఆనందపరిచారు. గన్నవరం నుంచి ఖానాపూర్ వరకు ట్రాక్టర్ నడిపారు.…
ఖమ్మం జిల్లాలో పర్యటనలో ఉన్న వైఎస్సార్టీపీ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ పార్టీపై, సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. ఖమ్మం నాయకులను టీఆర్ఎస్ పార్టీ డబ్బులతో కొనుక్కుందని..వ్యాపార లావాదేవీలు ఉన్నాయి కాబట్టే టీఆర్ఎస్ కు అమ్ముడు పోయారని విమర్శించారు. పశువుల లెక్క లైన్లో నిలబడి మేము రెడీ అన్నట్లు టీఆర్ఎస్ కు అమ్ముడు పోయారని అన్నారు. ప్రజల సమస్యలపై పోరాటం కోసమే వైఎస్సార్టీపీ పార్టీ పుట్టిందని షర్మిళ అన్నారు. కేసీఆర్…
కేంద్ర మంత్రి అమిత్ షాపై వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల తీవ్ర విమర్శలు గుప్పించారు. అమిత్ షా గారి మాటలకు ఊదు కాలదు.. పీరు లేవదని షర్మిల ఎద్దేవ చేశారు. అవినీతి చేస్తున్నారని తెలిసికూడా మీ పాతమిత్రుడు KCR ని అరెస్ట్ చెయ్యరు! ఎందుకని ఆమె నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతీ పథకంలో వాటా ఉందన్న మీరు.. KCR అవినీతిలో మీకువాటాలేదంటే మేము నమ్మాలా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 8 ఏండ్లుగా ఏటా 2 కోట్ల ఉద్యోగాలిచ్చారని,…
తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన మైన సమస్య వడ్లు కొనుగోళ్లని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. పంట పండించడం కంటే వాటిని అమ్మడం పెద్ద సమస్యగా మారిందని పేర్కొన్నారు. రైతులు తాము వడ్లు అమ్ముకోగలం అన్న నమ్మకం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వరి వేసిన రైతులు ఈ 6 నెలలు బిక్కు బిక్కుమంటూ బతికారని అన్నారు. రైతుల పక్షాన పోరాటం చేయడానికి నెల రోజులుగా ”రైతుగోస” పేరుతో సమస్యలను ప్రస్తావించినా సీఎం స్పందిచలేదని…
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. వైఎస్ షర్మిల స్థాపించిన వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీపై ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు.. తెలంగాణలో పాదయాత్రలు, దీక్షలు, ధర్నాలతో దూసుకెళ్తున్నారు వైఎస్ షర్మిల.. ఏ అవకాశం దొరికినా ప్రభుత్వంపై ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు.. ప్రభుత్వ విధానాలను ఎండగడుతున్నారు. పాదయాత్రలో వివిధ వర్గాల ప్రజలను కలుస్తూ.. తెలంగాణలో రాజన్న రాజ్యం రాబోతోంది.. అందరికీ న్యాయం జరుగుతుందంటూ ముందుకు సాగుతున్నారు. అయితే, రాబోయే…
షర్మిల నేతృత్వంలోని వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ క్రమంగా ప్రజల్లోకి వెళ్తోంది. ఈ మేరకు పార్టీని బలోపేతం చేయడంపై షర్మిల దృష్టి సారించారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ టీమ్ వైఎస్‌ఎస్‌ఆర్ స్టేట్ కో ఆర్డినేటర్‌గా మల్లాది సందీప్‌కుమార్‌ను ఆమె నియమించారు. ఈ విషయాన్ని ఓ ప్రకటన ద్వారా వైఎస్ షర్మిల మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా తనను టీమ్ వైఎస్ఎస్ఆర్ కో ఆర్డినేటర్‌గా నియమించడం పట్ల వైఎస్ షర్మిలకు సందీప్‌కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అభివృద్ధికి…
మరోసారి తెలంగాణ సర్కార్, సీఎం కేసీఆర్‌తో పాటు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డిపై ఫైర్ అయ్యారు వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. కొత్తగూడెం నియోజకవర్గం సుజాతానగర్‌లో రైతుగోస ధర్నాలో పాల్గొన్న ఆమె.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పల్లా రాజేశ్వర్ రెడ్డిఅనే ఒక ఎమ్మెల్సీ ఉన్నారు.. వరి ధాన్యం కొంటున్నాం కదా ఎవరు మాట్లాడకూడదు అంటున్నాడట.. టీఆర్‌ఎస్‌ని ఏమైనా అంటే వరి కంకులతో కొట్టమని చెప్పాడట అంటూ మండిపడ్డారు. ఇక, తప్పులు చేస్తున్న కేసీఆర్‌ని దేంతో కొట్టాలి అని ప్రశ్నించారు…
భద్రాద్రి జిల్లా ఇల్లందు మండలం చర్చ్ రాం పెడ్ గ్రామంలో రైతు గోస మహా ధర్నా లో పాల్గొన్నారు వైయస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. వైఎస్సార్ హయాంలో 3లక్షల 30 వేల ఎకరాలకు పట్టాలు ఇచ్చారన్నారు. వైఎస్సార్ బ్రతికి ఉంటే పేదలకు ఇంకా 8 లక్షల ఎకరాలకు పట్టాలు ఇచ్చే వారన్నారు. వైఎస్సార్ తర్వాత తెలంగాణలో ఒక్క ఎకరాకి పట్టా ఇవ్వలేదు. కుర్చీలేసుకొని కూర్చొని పట్టాలు ఇస్తామని కేసీఆర్ మోసం చేశాడంటూ రైతు గోస సభలో…