షర్మిల నేతృత్వంలోని వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ క్రమంగా ప్రజల్లోకి వెళ్తోంది. ఈ మేరకు పార్టీని బలోపేతం చేయడంపై షర్మిల దృష్టి సారించారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ టీమ్ వైఎస్‌ఎస్‌ఆర్ స్టేట్ కో ఆర్డినేటర్‌గా మల్లాది సందీప్‌కుమార్‌ను ఆమె నియమించారు. ఈ విషయాన్ని ఓ ప్రకటన ద్వారా వైఎస్ షర్మిల మీడియాకు వెల్లడించారు.
ఈ సందర్భంగా తనను టీమ్ వైఎస్ఎస్ఆర్ కో ఆర్డినేటర్‌గా నియమించడం పట్ల వైఎస్ షర్మిలకు సందీప్‌కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని సందీప్ కుమార్ తెలిపారు. తనకు పార్టీలో కీలక బాధ్యతలను అప్పగించిన వైఎస్ షర్మిల నమ్మకాన్ని వమ్ము చేయకుండా చిత్తశుద్ధితో పనిచేస్తానని పేర్కొన్నారు. షర్మిల ఆశయ సాధన కోసం పాటుపడతానని స్పష్టం చేశారు. కాగా మల్లాది సందీప్ కుమార్ దశాబ్ద కాలంగా వైఎస్ఆర్ కుటుంబానికి నమ్మకంగా పని చేస్తున్నారు.