చట్టాన్ని ఉల్లంఘించి వైఎస్ జగన్‌కు ప్రతిపక్ష హోదా ఇవ్వాలా అని మంత్రి నారా లోకేశ్ ప్రశ్నించారు. రూల్స్ అతిక్రమించడం జగన్‌కు అలవాటు.. అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా వ్యవహరించారు.. ఇప్పుడు, బెంగళూరులో ఉంటూ ఇక్కడి ఎన్నికల గురించి మాట్లాడితే ఎలా అని అడిగారు.
మన్యం జిల్లా... పార్వతీపురం టీడీపీ ఎమ్మెల్యే బోనెల విజయ చందర్. వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు. మామూలుగా అయితే... ఉప్పు నిప్పులా ఉండాల్సిన రాజకీయం ఇద్దరిదీ. అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు అలాగే ఉందట కూడా. కానీ... ఎలక్షన్స్ తర్వాత సీన్ కంప్లీట్‌గా మారిపోయిందట. మనం మనం పార్వతీపురం అనుకుంటూ..
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువగా రెడ్‌బుక్‌పైనే చర్చ సాగుతోంది.. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది అంటూ వైసీపీని విమర్శిస్తోంది.. అయితే, రెడ్‌బుక్‌పై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి నారా లోకేష్..
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై జనసేన నేతలు ఫైర్ అవుతున్నారు.. జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై దువ్వాడ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఆ పార్టీ శ్రేణులు.. ఓవైపు దువ్వాడకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూనే.. మరోవైపు.. వరుసగా పోలీస్ స్టేషన్లలో వైసీపీ ఎమ్మెల్సీపై ఫిర్యాదులు చేస్తున్నారు..
రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు రాజకీయాల్లో వివాదాస్పద వ్యక్తిగా మారుతున్న టాక్ పెరుగుతోంది లోకల్‌గా. ప్రత్యేకించి సెల్ఫ్ గోల్స్ వేసుకుంటున్నారన్నది స్థానికంగా ఉన్న విస్తృతాభిప్రాయం. ఇప్పటికే మద్యం సిండికేట్, ఇసుక మాఫియా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేపై తాజాగా భూ దందాలపై అలిగేషన్స్ రావడమే అందుకు నిదర్శనం అంటున్నారు. రాజమండ్రి దేవీ చౌక్ సమీపంలో ఉన్న గౌతమి సూపర్ బజార్‌కు సంబంధించిన 300 గజాలు స్థలం లీజు వ్యవహారంలో గత ప్రభుత్వ హయాంలో వైసిపి నేతలు ఐదు…
మూడు రాజధానుల విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తాజాగా చేసిన వ్యాఖ్యలపై కౌంటర్ ఎటాక్‌కు దిగారు మంత్రి అచ్చెన్నాయుడు.. మూడు రాజధానుల విషయంలో వైఎస్ఆర్సీపీ యూ టర్న్ తీసుకుందన్న ఆయన.. యూ టర్న్ తీసుకుందంటేనే వాళ్ల తలాతోకలేని విధానాలకు నిదర్శనమని దుయ్యబట్టారు..
కుటుంబ సభ్యులతో కలిసి ఈ రోజు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో సమావేశం అయ్యారు దొరబాబు.. ఇక, దొరబాబు చేరికకు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. ఈ నెల 9వ తేదీన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్ లతో కలిసి విజయవాడలో పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీ కండువా కప్పుకోవడానికి సిద్ధం అయ్యారు మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు..
పోసాని కృష్ణమురళిపై 14 కేసులు నమోదు చేశారని ఫైర్ అయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి.. టీడీపీ నాయకుడు ఇచ్చిన ఫిర్యాదు ఇచ్చారని అరెస్ట్ చేశారు.. 41 ఏ నోటీస్ ఇచ్చి వదిలే కేసులో నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు.. ఈ విషయంలో చంద్రబాబు, లోకేష్ ఒప్పుకోవడం లేదని తెలుస్తుందన్నారు. ఇప్పుడు నరసరావుపేట తీసుకొచ్చారు.. బాపట్ల పోలీసులు పీటీ వారెంట్ వేయడానికి సిద్ధంగా ఉన్నారు.. అసలు భారత రాజ్యాంగం నడుస్తుందా? లోకేష్…
కూటమి ప్రభుత్వానికి, టీడీపీ నేతలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు మాజీ మంత్రి ఆర్కే రోజా.. ఆరేళ్ల క్రితం మాట్లాడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతున్నాయని పోసాని కృష్ణ మురళిని అరెస్ట్ చేయడం దారుణమైన విషయమన్న ఆమె.. అక్రమంగా 111 కేసు పెట్టి , పోసానిని అక్రమ కేసులో ఇరికించారని ఆరోపించారు.. గతంలో ప్రధాని నరేంద్ర మోడీపై చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ దారుణంగా మాట్లాడలేదా...? వాళ్లపై ఇదే దేశద్రోహం సెక్షన్ల కింద కేసు నమోదు చేయగలరా? అని…
వైసీపీ నేత బొత్స సత్యనారాయణ రాజధాని అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు రాజధానిపై చర్చనీయాంశంగా మారాయి. బొత్స మాట్లాడుతూ.. అప్పటి పరిస్థితి, ప్రభుత్వ స్టాండ్ ప్రకారం 3 రాజధానులు అని అన్నామని బొత్స తెలిపారు. ఇప్పుడు రాజధానిపై తమ విధానం ఏంటనేది పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని శాసన మండలిలో విపక్షనేత బొత్స సత్యనారాయణ ప్రకటించారు. రాజధాని కోసం లక్షల కోట్లు ఖర్చు అవుతుంది. మేము అధికారంలో ఉన్నప్పుడు అంత ఖర్చుపెట్టే స్థోమత…