ఉద్యోగాల విషయంలో ప్రతిపక్షాలు విమర్శలు పెంచాయి.. దీంతో.. అదే స్థాయిలో ఎదురుదాడికి దిగుతోంది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ… ఇవాళ మీడియాతో మాట్లాడిన వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి… విపక్షాల కామెంట్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. చంద్రబాబు హయాంలో కేవలం 8 వేల మందికే ఉద్యోగాలిచ్చారన్న ఆయన.. వైసీపీ ప్రభుత్వం 1.84 లక్షల ఉద్యోగాలిచ్చిందని.. గ్రామ సచివాలయాల్లోనే 1.30 లక్షల మందికి ఉద్యోగాలిచ్చామని.. ఇవి కాకుండా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు కల్పించామని తెలిపారు.. ప్రభుత్వ…
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన రోజే రాజ్యసభలో ప్రత్యేక హోదాపై ఆందోళనకు దిగారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు.. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై తక్షణమే సభలో చర్చ చేపట్టాలని కోరుతూ వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ఇవాళ రాజ్యసభలో వెల్లోకి దూసుకెళ్లారు.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అంశాన్ని ఆమోదిస్తూ మార్చి 11, 2014న కేంద్ర కేబినెట్ చేసిన తీర్మానం ఏడేళ్లు కావస్తున్నా అమలుకు నోచుకోనందున ఈ రోజు ఇతర కార్యకలాపాలను సస్పెండ్…
రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈరోజు అఖిలపక్షసమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏయే అంశాలపై చర్చించాలి అనే దానిపై సుమాలోచనలు జరిపారు. అదేవిధంగా సభను సజావుగా జరిగేలా సహకరించాలని ప్రభుత్వం సభ్యులను కోరింది. ఈ సమావేశం అనంతరం వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీపై కేంద్రం ఉద్దేశపూర్వకంగానే కాలయాపన చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. పోలవరం అథారిటీ కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి…
ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి తీవ్ర అనారోగ్యం పాలయ్యారు.. దీంతో.. హైదరాబాద్కు తరిలించి సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.. కాగా, ఎమ్మెల్సీగా ఉన్న చల్లా రామకృష్ణారెడ్డి ఈ ఏడాది జనవరిలో మృతి చెందారు.. ఆ తర్వాత చల్లా రామకృష్ణా రెడ్డి ఇంటికి వెళ్లిన సీఎం వైఎస్ జగన్.. చల్లా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.. అనంతరం ఆయన భార్యా, కుమారులు, కుమార్తెలను పరామర్శించారు. చల్లా కుటుంబానికి పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా…
సుదీర్ఘ కసరత్తు తర్వాత ఏపీలో నామినేటెడ్ పోస్టులు ప్రకటించారు.. గతంలో ఉన్న జోడు పదవులు విధానానికి గుడ్బై చెప్పింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్కార్… నామినేటెడ్ పదవుల్లో మహిళలు, వెనకబడిన వర్గాలు, దళితులకు పెద్దపీట వేశారు.. పోస్టుల భర్తీలో సామాజిక న్యాయం పాటించారు.. మొత్తం 135 పోస్టుల్లో మహిళలకు 68 పోస్టులు, పురుషులకు 67 పదవులు కేటాయించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 56 శాతం పదవులు కట్టబెట్టారు.. పదవులు అలంకార ప్రాయం కాదని.. సామాజిక న్యాయానికి…
నామినేటెడ్ పోస్టులు ఇవాళ ప్రకటించాల్సి ఉన్నా… రేపటికి వాయిదా పడింది… అయితే, కసరత్తు పూర్తి కాకపోవడంతో.. పోస్టుల ప్రకటన వాయిదా వేశామని.. రేపు ఉదయం వెల్లడిస్తామని తెలిపారు సజ్జల రామకృష్ణారెడ్డి… నామినేటెడ్ పదవుల్లో సామాజిక న్యాయం చేయాల్సి ఉందన్న ఆయన.. మహిళలకు కూడా 50 శాతం పదవులు ఇస్తున్నాం.. కసరత్తులో కొంత అలస్యం అయ్యిందన్నారు.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన సజ్జల.. పార్టీకోసం ముందు నుంచి పని చేస్తున్న వారు, సామాజిక న్యాయం అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని నామినేటెడ్…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించిన తర్వాత.. నిరుద్యోగులు రోడ్డెక్కి ఆందోళనకు దిగుతున్నారు.. వారి ఆందోళనకు పలు ప్రజాసంఘాలు మద్దతుగా నిలుస్తుండగా.. ఇప్పుడు జనసేన పార్టీ కూడా రంగంలోకి దిగింది.. నిరుద్యోగులకు అండగా జనసేన పోరాటం చేస్తుందని ప్రకటించారు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. ఈ నెల 20న అన్ని జిల్లాల్లోని ఎంప్లాయ్మెంట్ అధికారులకు వినతిపత్రాలు ఇవ్వాలని సూచించారు.. అన్ని ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను జాబ్ క్యాలెండర్లో చేర్చాలని డిమాండ్ చేసిన జనసేనాని… లక్షల్లో ఉద్యోగాలు…
ముల్లును ముల్లుతోనే తీయాలని చూస్తున్నారు ఆ నాయకుడు. ఇప్పటికీ వెంటాడుతున్న సమస్య తన రాజకీయ భవిష్యత్కు అడ్డుపడకూడదని రివర్స్ ప్లాన్ వేశారట. తనకు వ్యతిరేకమని ప్రచారం జరుగుతున్న వర్గంతోనే ఘన సన్మానం చేయించుకుని శత్రు శిబిరానికి షాక్ ఇచ్చారట. ఇంతకీ ఇవన్నీ వర్కవుట్ అవుతాయా? కేసు విచారణలో ఉండగానే ఎమ్మెల్యేగా గెలిచారు.. ఇప్పుడు ఎమ్మెల్సీ! తోట త్రిమూర్తులను శిరోముండనం కేసు నీడలా వెంటాడుతోంది. తాజాగా ఎమ్మెల్సీ అయినా ఆయన్ను శిరోముండనం కేసుకు బాధ్యుడిగా చేస్తూ బర్తరఫ్ చేయాలని…
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజుకు నోటీసులు జారీ చేసింది లోక్సభ సచివాలయం… ఆయనతో పాటు తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు సిసిర్ అధికారి, సునీల్ కుమార్లకు కూడా నోటీజులు జారీ అయ్యాయి.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ అందిన ఫిర్యాదులపై స్పందించిన లోక్సభ సచివాలయం… ఆ ముగ్గురు ఎంపీలకు నోటీసులు జారీ చేసింది. కాగా, రఘురామ కృష్ణరాజుపై ఇప్పటికే పలుసార్లు ఫిర్యాదు చేశారు వైసీపీ ఎంపీలు.. లోక్సభ స్పీకర్ను కలవడం…