మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమపై రాళ్లదాడి జరిగింది. కొండపల్లి అటవీప్రాంతంలో మైనింగ్ పనులను పరిశీలించి వస్తున్న సమయంలో జి కొండూరు మండలం, గడ్డమణుగ వద్ద దేవినేని ఉమ వాహనంపై వైసీపీ కార్యకర్తలు రాళ్లదాడి చేశారు. ఈ దాడిలో దేవినేని ఉమ కారు అద్ధాలు ధ్వంసం అయ్యాయి. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తకరమైన పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ అనుచరులే ఈ దాడికి పాల్పడ్డారని దేవినేని ఉమా ఆరోపించారు. దేవినేని ఉమ కారుపై దాడికి పాల్పడ్డారని…
ఏలూరు కార్పోరేషన్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. మొత్తం 50 డివిజన్లలో 46 చోట్ల వైసీపీ విజయం సాధించిగా, మూడు చోట్ల టీడీపీ విజయం సొంతం చేసుకుంది. అత్యధిక డివిజన్లు సొంతం చేసుకుంటామని వైసీపీ నేతలు ముందునుంచే చెప్తూ వస్తున్నారు. చెప్పిన విధంగానే వైసీపీ 46 చోట్ల విజయం సాధించడం విశేషం. గెలుపొందిన 46 డివిజన్లలో మూడు ఏకగ్రీవాలు ఉన్నాయి. ఇకపోతే, ఏలూరులో వీలైనన్ని స్థానాలు గెలుపొంది పట్టును నిరూపించుకోవాలని చూసిన టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. కేవలం మూడు…
ఆంధ్రప్రదేశ్లో మరోసారి రాజీనామాల వ్యవహారం తెరపైకి వచ్చింది.. రాజీనామాలు చేసేందుకు మేం సిద్ధం.. వైసీపీ ఎంపీలు సిద్ధమా? అంటూ టీడీపీ ఎంపీలు సవాల్ చేస్తున్నారు.. దీనిపై సెటైర్లు వేశారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి… చంద్రబాబు, తన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తామంటే ఎవరు అడ్డుకుంటారు..? మమ్మల్ని అడగటం ఎందుకు ? అని ప్రశ్నించారు సజ్జల.. మేం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజీనామాలు చేసినప్పుడు టీడీపీ వాళ్ళను అడిగామా? అని నిలదీసిన ఆయన.. ఇక, టీడీపీ…
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు సవాల్ విసిరారు టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు.. వైసీపీ ఎంపీలు గుంపులో గోవిందలాగా పార్లమెంట్ లో వ్యవహరిస్తున్నారని విమర్శించిన ఆయన.. ప్రజలను మభ్య పెట్టడానికి పార్లమెంట్ లో హడావిడి చేస్తున్నారని మండిపడ్డారు.. కేంద్రం పై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నం చేయడం లేదని ఆరోపించిన ఆయన.. వైసీపీ ఎంపీలకు చిత్తశుద్ధి లేదు.. ఎవరు ఎప్పుడే ఏం చేస్తున్నారో తెలియడం లేదన్నారు.. నాలుగు ఫోటోలు తీసుకోవడానికే హడావిడి చేస్తున్నట్లు కనిపిస్తోందని దుయ్యబట్టిన రామ్మోహన్నాయుడు.. విశాఖ…
ఆంధ్రప్రదేశ్లో భారీగా ఐఏఎస్లను బదిలీ చేసింది ప్రభుత్వం.. ఏపీఎంఎస్ఐడీసీ ఎండీగా మురళీధర్రెడ్డి, కడప జిల్లా కలెక్టర్గా విజయరామరాజు, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్గా చెవ్వూరి హరికిరణ్ ను బదిలీ చేశారు.. ఇక, ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈవోగా వాడరేవు విజయచంద్ను నియమించారు. విశాఖపట్నం జిల్లా కలెక్టర్గా డాక్టర్ మల్లికార్జున్, ఆర్ అండ్ ఆర్ కమిషనర్గా ఎం హరిజవహర్లాల్ను బదిలీ చేసిన ఏపీ సర్కార్.. విజయనగరం జిల్లా కలెక్టర్గా సూర్యకుమారి, ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్…
కేంద్ర ప్రభుత్వం గెజిట్లు విడుదల చేసినా.. తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి… జల జగడంపై స్పందించిన ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి… చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే నీటి కేటాయింపులు జరిగేవన్న ఆయన.. తెలుగు రాష్ట్రాల్లో సాగు నీటి ప్రాజక్టులపై మాట్లాడే నైతిక హక్కు ఏ పార్టీకి లేదన్నారు.. బ్రిజేష్ ట్రిబ్యునల్ అనేక సార్లు నీటిని కేటాయిస్తామన్నా ప్రాజక్టులను పూర్తి చేసిన పాపాన…
అక్కడ సైకిల్ పార్టీ గతమెంతో ఘనం.. వర్తమానం అయోమయం. దశాబ్దాల చరిత్ర కలిగిన పార్టీకి ఓ ఆఫీస్ లేదు… ఆఖరికి నగర అధ్యక్షుడు కూడా లేడు. ఇద్దరు నేతలు పట్టుకోసం చేసే ప్రయత్నాల్లో సైకిల్ దారి తప్పుతోందట. మేయర్ ఎన్నికలో హ్యాట్రిక్ కొట్టిన చరిత్ర నుండి ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారుతోందట. గతమంతా ఘనం. వర్తమానం ప్రశ్నార్థకం అన్నట్టు మారింది..రాజమండ్రిలో టిడిపి పరిస్థితి. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వరుసగా మూడు సార్లు మేయర్ పీఠాన్ని దక్కించుకుని హ్యాట్రిక్ సాధించిన…
అధికార పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఆళ్లగడ్డలో ఇష్టం వచ్చినట్టుగా పన్నుల వసూళ్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత భూమా అఖిలప్రియ.. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆమె.. అకౌంట్లలో నగదు వేస్తే ప్రజలు నోరు మూసుకుని ఉంటారని ప్రభుత్వం నీచమైన ఆలోచన చేస్తోందంటూ ఆరోపించారు.. ప్రభుత్వం మున్సిపాలిటీలను అ భివృద్ధి చేయకుండా పన్నులు మాత్రం విపరీతంగా పెంచుతోందని, ప్రజలపై భారం మోపి ఇబ్బందులకు గురిచేస్తోందని మండిపడ్డారు. ఆళ్లగడ్డ మున్సిపాలిటీలోని షాపులకు ప్రభుత్వం మూడేళ్లకు…