కనీస మద్దతు ధర చట్టం తీసుకురావాలని కోరినట్టు వెల్లడించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి… ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కనీస మద్దతు ధరను 24 పంటలకు మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కల్పిస్తున్నారని గుర్తుచేశారు.. అదే పద్ధతిలో దేశవ్యాప్తంగా అన్ని పంటలకు మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు.. ఇక, ఆహార భద్రతా చట్టం అమలులో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని.. దానిని సరిదిద్దాలని సూచించారు. అణగారిన బీసీలను గుర్తించేందుకు సామాజిక ఆర్థిక కుల…
పార్లమెంట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. నేడు ఉదయం 11 గంటలకు పార్లమెంటు లైబ్రరీ భవనంలో అఖిలపక్ష సమావేశం జరగనుంది. తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు గల్లా జయదేవ్, రాజ్యసభలో టీడీపీ నాయకుడు కనకమేడల రవీంద్ర కుమార్, వై.ఎస్.ఆర్ కాంగ్రెసు పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయ సాయిరెడ్డి హాజరవుతారు. టి.ఆర్.ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కే.కేశవరావు, లోకసభ పక్ష నాయకుడు నామా నాగేశ్వరరావు అఖిలపక్షానికి హాజరవుతారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు అన్ని పక్షాల…
వరదల్లో ప్రభుత్వ వైఫల్యంపై న్యాయ విచారణ చేయాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ సీఎస్ సమీర్ శర్మకు లేఖ రాసారు. ప్రభుత్వ అంచనాల ప్రకారం రూ. 6054 కోట్ల నష్టం వాటిల్లితే.. కేవలం రూ. 35 కోట్ల నిధులను మాత్రమే విడుదల చేయడం సరైవ పద్దతి కాదని, ప్రకృతి వైపరీత్యాల కోసం ఖర్చు పెట్టాల్సిన రూ. 1100 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం మళ్లించిందని కాగ్ తప్పు పట్టిందన్నారు. జాతీయ ప్రకృతి విపత్తుల నిర్వహాణ నిబంధనలకు విరుద్దంగా…
మంత్రి కొడాలి నానిపై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు టీడీపీ పొలిట్బ్యూరో సభ్యులు వర్ల రామయ్య… కొడాలి నానికి తెలుగు నేర్పిన మాస్టర్ వస్తే కాళ్లకు దండం పెట్టాలని ఉందంటూ సెటైర్లు వేసిన ఆయన.. అలిపిరి బాంబ్ బ్లాస్ట్ తర్వాత కేంద్రం చంద్రబాబుకి ఎన్ఎస్జీ సెక్యూరిటీ ఇచ్చింది.. చంద్రబాబు దేశ సంపద కాబట్టి కేంద్రం ఎన్ఎస్జీతో రక్షణ కల్పించిందన్నారు.. కానీ, కొడాలి నానిని ఆడవాళ్లు కొట్టకుండా సీఎం జగన్ సెక్యూరిటీ ఇచ్చారంటూ ఎద్దేవా చేశారు.. నారా భువనేశ్వరిపై…
వరదల సమయంలోనూ అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.. వరద సహాయక చర్యల్లో పాల్గొనడంలేదంటూ.. ఓవైపు అధికార పక్షాన్ని ప్రతిపక్షం విమర్శిస్తే.. మరోవైపు ప్రతిపక్షాన్ని టార్గెట్ చేస్తోంది అధికార పార్టీ.. ఇక, టీడీపీ నేతలపై హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాఫిక్గా మారాయి.. వరదల్లో టీడీపీ నేతలు ఎక్కడా కనపడలేదు… తిండికి తిమ్మరాజు పనికి పోతురాజు అన్నట్టుగా టీడీపీ పరిస్థితి ఉందంటూ ఎద్దేవా చేశారు గోరంట్ల మాధవ్… అయిపోయిన పెళ్లికి…
ఏపీ రాజకీయాలపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రిలో మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీలో ప్రతిపక్ష లేకపోతే ప్రజాస్వామ్యం లేనట్లేనని అన్నారు. అంతేకాకుండా కేంద్రం షరతులకు అనుగుణంగా పన్నులు పెంచి అప్పులు తీసుకున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక్కటేనన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులపై నియంత్రణ లోపించిందని, అప్పులు తగ్గించి ఆదాయం పెంచుకోనే మార్గాలను అన్వేషించాలని హితవు పలికారు. రాష్ట్రానికి 6 లక్షల 22 కోట్ల రూపాయలకు…
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం అవుతోన్న తరుణంలో లోక్సభ, రాజ్యసభలో అనుసరించాల్సిన వ్యూహం, లేవనెత్తాల్సిన అంశాలపై పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్.. సచివాలయంలో పార్టీ ఎంపీలతో సమావేశమైన ఆయన.. పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలకు మార్గ నిర్దేశం చేశారు.. ఎంపీలకు సీఎం వైఎస్ జగన్ సూచనలు: పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాల రూ. 55,657 కోట్ల ఆమోదానికి కృషి చేయాలి. జాతీయ హోదా ప్రాజెక్టు అంటే విద్యుత్తు,…
ముఖ్యమంత్రి అయ్యేవరకూ అసెంబ్లీకి రాను అంటూ శాసనసభ నుండి వాకౌట్ చేసి వెళ్లిపోయారు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు.. అయితే, దీనిపై అధికార పార్టీ నేతలు సెటైర్లు వేస్తూనే ఉన్నారు.. తాజాగా ఈ వ్యవహారంపై స్పందించిన ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి.. కుప్పం ఓటమిని డైవర్ట్ చేయడం కోసమే అయన అసెంబ్లీ నుంచి పారిపోయాడని ఎద్దేవా చేశారు.. వ్యక్తిత్వం ఇప్పటికే దిగజార్చుకున్న చంద్రబాబు ఇప్పటికైనా మారాలని సూచించిన ఆయన.. భారీ వర్షాలు, వరదలతో జరిగిన…
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని నిర్వహించేందుకు సిద్ధం అయ్యారు పార్టీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్… రేపు వైసీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ జరగనుంది… రేపు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో వైసీపీ లోక్సభ, రాజ్యసభ ఎంపీలతో సమావేశం కానున్నారు సీఎం వైఎస్ జగన్.. ఈ నెల 29వ తేదీ నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. జరుగుతోన్న ఈ భేటీలో.. పార్లమెంట్లో లేవనెత్తాల్సిన…