ఏపీలో ఇటీవల ఎన్నికైన 11 మంది కొత్త ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం కార్యక్రమం మండలిలో జరుగుతోంది. ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. మండలిలో బలం ఉందని ప్రతిపక్షం ఎలా వ్యవహారించిందో చూశామని, ఈ రోజు శుభదినమన్నారు. పార్టీని నమ్ముకున్న వారికి జగన్ తప్పక న్యాయం చేస్తారనడానికి ఇదే నిదర్శనమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ప్రతి ఎన్నికల్లో విజయం సాధిస్తున్నామని, నేతల మధ్య విభేదాలున్నా కలిసి కట్టుగా పని చేసి, ప్రజల వద్దకు అభివృద్ధి, సంక్షేమం తీసుకువెళ్లాలని ఆయన కోరారు. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నాయన్నారు.