ఇటీవల ఏపీలో కురిసిన భారీ వర్షాలతో పలు జిల్లాల్లో వరదలు సంభవించాయి. అయితే వర్షాల కారణంగా భారీ వరద రావడంతో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయింది. దీంతో వరదలు సంభవించి ప్రాణ, ఆస్తి నష్టం చోటు చేసుకుంది. అయితే వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటించి వరద బాధితులకు అండగా ప్రభుత్వం ఉంటుందని అలాగే పలు వరాల జల్లులను కురిపించారు. ఆ తరువాత టీడీపీ నేతలు జగన్ పర్యటపై పలు విమర్శలు చేశారు. దీనిపై స్పందించిన వైసీపీ…
భారీ వర్షాలతో మునుపెన్నడూ చూడనివిధంగా ఏపీలో వరదలు పోటేత్తాయి. భారీ వరదలో అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోయింది. దీంతో విపక్షాలతో పాటు కేంద మంత్రులు సైతం వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోయిందని ఆరోపణలు చేశారు. దీంతో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విపక్షాలకు కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబును ఉద్దేశించి మంత్రి అనిల్ మాట్లాడుతూ.. నీ ప్రచారం పిచ్చి వల్ల పుష్కరాల్లో చనిపోయిన కుటుంబాలకు ఎంత నష్టపరిహారం ఇచ్చావ్? అని ప్రశ్నించారు. రాయల్ చెరువు తెగి…
ఏపీ రాజకీయాల్లో కొన్ని రోజులుగా జూనియర్ ఎన్టీఆర్ పేరు ప్రముఖంగా వినపడుతోంది. ఇటీవల చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ నేతలు తీవ్రంగా ఆరోపించగా… నందమూరి కుటుంబసభ్యులు కూడా ఈ అంశంపై స్పందించారు. అయితే హీరో జూనియర్ ఎన్టీఆర్ స్పందన తమకు నచ్చలేదని కొందరు టీడీపీ సీనియర్ నేతలు బాహాటంగా తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. దీంతో చిత్తూరు జిల్లా కుప్పంలో ఎన్టీఆర్ అభిమానులు నిరసన వ్యక్తం చేసిన విషయం సోషల్…
ఏపీ సీఎం జగన్పై టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లింది ఎందుకంటూ ఆయన సూటిగా ప్రశ్నించారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఓ ఫోటోను షేర్ చేశారు. ‘ముఖ్యమంత్రి గారూ… మీరు వెళ్లింది మీ ఇసుక మాఫియాల కోసం జలసమాధి అయిపోయిన 60 మంది కుటుంబసభ్యులను పరామర్శించడానికి. మీ వంధిమాగదులతో సెల్ఫీలు తీసుకోవడానికి కాదు’ అని లోకేష్ ఆరోపించారు. ‘మీరు వెళ్లింది..…
ఆంధ్రప్రదేశ్లో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి పట్టాగా ఉన్న ఇంటి ఆస్తిని ఈ పథకంతో స్థిరాస్తిగా మారుతుంది. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం రాష్ట్రంలోని లక్షలాది మందికి ఉపయోగపడుతుందని, అయితే, ఈపథకాన్ని టీడీపీ నేతలు తప్పుదోవ పట్టించాలని చూస్తుందని ద్వారంపూడి విమర్శించారు. ప్రభుత్వాన్ని విమర్శించడానికి మాజీ ఎమ్మెల్యే కొండబాబు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గోతికాడ నక్కల్లా కాచుకు కూర్చున్నారని విమర్శించారు. Read:…
మొన్నటి వరకు కురిసిన భారీ వర్షాలతో ఏపీలోని పలు జిల్లాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చి సహాయక చర్యలు అందించారు. వాగులు, వంకలు పొంగిపొర్లి వరద నీరు గ్రామాల్లోకి చేరింది. అంతేకాకుండా చెరువులకు గండ్లు పడడంతో కట్ట కింద ఉన్న పంటపొలాలు కొట్టుకుపోయాయి. పశువులు కూడా కొట్టుకుపోయి తీవ్ర ఆస్తినష్ట, ప్రాణ నష్టం కూడా సంభవించింది. దీంతో సీఎం జగన్ వరద ప్రభావిత ప్రాంతాల్లో నేడు,…
ఏపీ సీఎం వైఎస్ జగన్కు మరోసారి లేఖ రాశారు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. ఈసారి గ్రామపంచాయతీల నుంచి మళ్లించిన నిధులు రూ.1,309 కోట్లు తక్షణమే పంచాయతీ ఖాతాలలో జమ చేయాలని లేఖలో పేర్కొన్నారు. జగన్ సీఎం అయినప్పటి నుంచి అప్పులు తేవడం, ఆస్తులు అమ్మేయడం, కనిపించిన చోటునల్లా తాకట్టు పెట్టడం ఈ మూడు మార్గాల ద్వారానే పాలన సాగిస్తున్నారని విమర్శించారు. గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం 14, 15వ ఆర్థిక సంఘాల ద్వారా కేటాయించిన…
ఏపీ సీఎం జగన్పై టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ మరోసారి తీవ్రంగా మండిపడ్డారు. అనంతపురం జిల్లా కేంద్రంలో ఆదివారం ఓ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి బొత్స సత్యనారాయణ కాన్వాయ్ను తమ సమస్యల పరిష్కారం కోసం అడ్డుకునేందుకు ప్రయత్నించిన విద్యార్థి సంఘాలను అరెస్ట్ చేయడాన్ని లోకేష్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన ఓ ట్వీట్ చేశారు. ప్రజా సమస్యలను పట్టించుకోని ప్రభుత్వం ఎందుకంటూ ఏపీ సర్కారుపై లోకేష్ అసహనం వ్యక్తం చేశారు. సమస్యలపై…
అమరావతి రైతుల మహాపాదయాత్రకు అనూహ్యంగా సంఘీభావం తెలిపారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి.. న్యాయస్థానం టూ దేవస్థానం అంటూ నవంబర్ 1వ తేదీన మహా పాదయాత్రను ప్రారంభించారు రైతులు.. 45 రోజుల పాటు నిర్వహించాలని.. డిసెంబర్ 15వ తేదీకి తిరుమలకు చేరుకోవాలని నిర్ణయించుకున్నారు.. రాజధాని రైతుల మహా పాదయాత్రకు ప్రజాసంఘాలు, ప్రతిపక్ష పార్టీలు మద్దతు తెలుపుతూ వస్తున్నాయి.. అయితే, ఈ పాదయాత్రకు వైసీపీ నేతలు రాజకీయాలను అంటగడుతూ వచ్చారు.. కానీ, ఇవాళ వైసీపీ…