ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం వెలువడిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది… ఇక, మంగళవారం పోలింగ్ జరిగిన 10 జెడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించిన ఓట్లను ఇవాళ లెక్కించనున్నారు.. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం వెల్లడించింది.. ఎంపీటీసీ స్థానాల ఫలితాలు ఉదయం 10 గంటల కల్లా తేలిపోనుండగా.. జెడ్పీటీసీ స్థానాల్లో మధ్యాహ్నం 12 గంటలకల్లా తుది ఫలితం వెలువడే అవకాశాలున్నాయి.. అయితే, నిన్నటి…
గురువారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అయితే ఎన్ని రోజులు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయన్న విషయంపై స్పష్టత లేదు. ఆరునెలల విరామం తర్వాత అసెంబ్లీ జరగనుండటంతో పలు కీలక ఆర్డినెన్సులను ఆమోదించాలని సభ ముందుకు ప్రభుత్వం తీసుకురానుంది. ఈ ఏడాది జులై నుంచి ఇప్పటివరకు వివిధ శాఖలకు సంబంధించి ప్రభుత్వం 14 ఆర్డినెన్సులను జారీ చేసింది. ఒకేరోజున 14 ఆర్డినెన్స్‌లను శాసనసభ, శాసన మండలి ఆమోదించేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. Read Also: అసెంబ్లీ సమావేశాల్లో…
ఏపీలో ఏ ఎన్నిక జరిగినా టీడీపీకి పరాభవం మాములు విషయంగా మారిపోయింది. రాజకీయాలు అన్న తర్వాత గెలుపోటములు మాములే. అయితే ఓ ఎన్నికలో పరాభవం ఎదురైతే.. తరువాత జరిగే ఎన్నికల్లో పుంజుకోవాలని ఏ రాజకీయ పార్టీ అయినా భావిస్తుంది. ఈ మేరకు వ్యూహాలకు పదును పెట్టి ప్రత్యర్థిపై పోటీకి సై అంటుంది. కానీ ఏపీలో ప్రతిపక్ష టీడీపీ మాత్రం ఓటములను సీరియస్‌గా తీసుకున్న దాఖలాలు కనిపించడంలేదు. 2019 అసెంబ్లీ ఎన్నికలు మొదలు.. ఇప్పటి లోకల్ బాడీ ఎన్నికల…
కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో వైసీపీ సాధించిన గెలుపుపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన రోజు నుంచి అధికార పార్టీ కుప్పంలో ఏం చేసిందో ప్రజలందరూ చూశారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. కుప్పంలో గెలిచామని సీఎం, మంత్రులు జబ్బలు చరుచుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారని… అది కూడా ఓ గెలుపేనా అంటూ ఎద్దేవా చేశారు. దొంగ ఓట్లతో గెలిచి సిగ్గు, శరం లేకుండా సంబరాలు చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమాయకులైన మహిళలను…
ఏపీలో జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీ ఘనవిజయం సాధించింది. ప్రకాశం జిల్లాలోని దర్శి మున్సిపాలిటీని మినహాయిస్తే మిగతా అన్ని చోట్ల వైసీపీ విజయఢంకా మోగించింది. నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలు జరిగిన 54 స్థానాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఈ సందర్భంగా ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ సోషల్ మీడియా ద్వారా ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. Read Also: వైఎస్ వివేకా కేసులో మరో నిందితుడు అరెస్ట్ ప్రజలు ప్రభుత్వానికి 100కు 97…
నేడు ఏపీలో నెల్లూరు కార్పోరేషన్‌తో పాటు పెండింగ్‌లో మరో 12 మున్సిపాలిటీలు, నగరపంచాయతీలకు ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వైసీపీ జెండా ఎగరవేసింది. అంతేకాకుండా టీడీపీ అధినేత చంద్రబాబు కంచుకోట కుప్పంలో కూడా వైసీపీ తన సత్తా చాటింది. ఈ నేపథ్యంలో మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. చంద్రబాబు స్వీయ తప్పిదాలే టీడీపీ పతనానికి కారణమని ఆరోపించారు. చంద్రబాబు అమరావతి ఒక్కటే తన ఎజెండా అనుకున్నారని, అందుకే మిగతా ప్రాంతాల ప్రజలు తగిన బుద్ధి…
ఏపీలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ సత్తా చాటింది.. టీడీపీ డీలాపడిపోగా.. వైసీపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి… ఈ ఫలితాలపై స్పందించిన వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా.. ఏ ఎన్నికలు వచ్చినా వార్ వన్‌సైడే అన్నారు.. ఈ ఎన్నికల్లో నలబై ఏళ్ల ఇండ్రస్టీ అయినా చంద్రబాబుని తరిమి కొట్టారని సెటైర్లు వేసిన ఆమె.. కుప్పంలోనే ఇల్లు లేని చంద్రబాబును… హైదరాబాదు ఇంటికి పరిమితం చేశారని వ్యాఖ్యానించారు… ఇకనైనా చంద్రబాబు, లోకేష్ నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని…
ఏపీలో నెల్లూరు కార్పోరేషన్‌తో పాటు పెండింగ్‌లో మరో 12 మున్సిపాలిటీలు, నగరపంచాయతీలకు పోలింగ్ జరిగిన విషయం తెలసిందే. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. అయితే తాజాగా ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీ ని టీడీపీ కైవసం చేసుకుంది. వైసీపీ-టీడీపీ మధ్య హోరాహోరీగా ఎన్నికల పోరు సాగింది. మొత్తం 20 వార్డులకు గాను టీడీపీ 13 వార్డులు గెలుచుకొని దర్శి నగర పంచాయతీ చైర్మన్…
స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ హవా కొనసాగుతోంది.. మెజార్టీ మున్సిపాలిటీలు కైవసం చేసుకుంది అధికార పార్టీ.. దీంతో పార్టీ శ్రేణుల్లో జోష్ మరింత పెరిగింది.. సంబరాల్లో మునిగిపోయాయి వైసీపీ శ్రేణులు.. అయితే, ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పంపై ప్రత్యేకంగా దృష్టిసారించింది.. ఇక, కుప్పంలో కూడా వైసీపీ తిరుగులేని విజయాన్ని అందుకుంది.. ఈ ఎన్నికలపై ఫలితాలపై మీడియాతో మాట్లాడిన మంత్రి పెద్దిరెడ్డి.. రాష్ట్రంలో…
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థలకు జరుగుతోన్న ఉప ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది.. టీడీపీ అధినేత నియోజకవర్గంలోని కుప్పంలో కూడా వైపీపీ ఘన విజయాన్ని అందుకుంది.. ఈ ఫలితాలపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.. సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఇది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభంజనం.. చంద్రబాబు కుప్పం కోట బద్దలు అయ్యిందన్నారు.. ఇక, టీడీపీ ఆఫీసును అద్దెకు ఇచ్చుకోవాల్సిందేనంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు హైదరాబాద్ వెళ్లి మనవడితో ఆడుకుంటే…