Botsa Satyanarayana: శ్రీకాకుళంలో మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బొత్స సత్యనారాయణ రాష్ట్ర ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై తీవ్ర స్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల లోపంతో పాటు పాలనా వ్యవహారాలపై ఆయన తన ఆవేదనతో పాటు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతిన్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఏం లేదు. హత్యలు, మానభంగాలు, అక్రమ కేసులు మాములు అయ్యాయి అని…
అచ్చెన్నాయుడికి ధైర్యం ఉంటే సమస్యలపై చర్చించేందుకు ప్రజల్లోకి వెళ్దామని మాజీ మంత్రి కాకాణి అన్నారు. నష్టపోయిన పంటల గురించి చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదు..? అని ప్రశ్నించారు.
Off The Record: తానొకటి తలిస్తే… సెక్రటేరియెట్‌లోని ఉన్నతాధికారి మరొకటి తలిచాడన్నట్టుగా ఉందట చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ పరిస్థితి. తాను అనుకున్నది జరిగీ జరగనట్టుగా ఉండటం ఒక ఎత్తయితే… దాన్ని బేస్ చేసుకుని ప్రత్యర్థి ఫైర్‌బ్రాండ్ లీడర్ చెలరేగిపోతుండటంతో… సార్ పరిస్థితి రోట్లో తలపెట్టి రోకటి పోటుకు వెరిస్తే ఎలాగన్నట్టు ఉందట. గత అసెంబ్లీ ఎన్నికల్లో… నగరి చరిత్రలోనే అత్యంత ఎక్కువగా 45 వేలకు పైగా మెజార్టీతో మాజీ మంత్రి రోజా మీద…
Off The Record: ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసీపీ పరిస్థితి దారుణంగా ఉందంటున్నారు. బలం ఉన్న చోట కూడా దాన్ని చాటుకోలేకపోతున్నామంటూ జిల్లా నేతల మీద కేడర్‌లో అసహనం పెరిగిపోతోందట. ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం మున్సిపాలిటీలతోపాటు గుంటూరు కార్పొరేషన్‌ను తన ఖాతాలో వేసుకుంది. అటు ఎంపీటీసీ, జడ్పీటీసీలదీ అదే పరిస్థితి. కార్పొరేషన్ పరిధిలో 57 డివిజన్లు ఉంటే… అందులో 46 డివిజన్స్‌ని దక్కించుకుంది వైసీపీ. ఇక ఉమ్మడి జిల్లా…
Jogi Ramesh : వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను బద్నాం చేసి వైసీపీని డ్యామేజ్ చేయాలనే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. నారా వారి సారా ఎపిసోడ్‌ను బయటపెట్టిన తర్వాతే తమపై కుట్రలు మొదలయ్యాయని ఆయన అన్నారు. జోగి రమేష్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో నారా వారి సారా ఎపిసోడ్ గురించి అందరికీ వివరించా. ఇబ్రహీంపట్నం తయారీ కేంద్రం వద్దకు వెళ్లి నిజాలు బయటపెట్టా. అక్కడ తయారైన సారా…
Off The Record: పెనమలూరు పేచీలు కృష్ణా జిల్లా వైసీపీని కుదిపేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధినాయకత్వం తీసుకున్న ఓ నిర్ణయం నియోజకవర్గంలో వర్గపోరుకు బీజం వేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ఎన్నికల నాటికి ఎవరో వస్తారని అంచనా వేస్తున్న ఓ వర్గం… ఇప్పుడున్న ఇన్ఛార్జ్కి సహాయ నిరాకరణ మొదలుపెట్టేసిందట. దీంతో కొత్త గొడవలు మొదలవుతున్నట్టు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో ఇక్కడి నుంచి ప్రస్తుత మంత్రి పార్థసారధి వైసీపీ తరఫున పోటీ చేసి గెలిచారు. కానీ…2024 ఎన్నికలకు ముందు వైసీపీని వదిలేసి…
Rayachoti: అన్నమయ్య జిల్లా రాయచోటిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలినట్టు అయ్యింది.. వైసీపీకి గుడ్‌బై చెప్పిన పార్టీ నేతలు, కార్యకర్తలు.. పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీలో చేరారు.. సంబేపల్లి, లక్కిరెడ్డిపల్లి మండలాలకు చెందిన వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆ పార్టీకి బైబై చెప్పేసి.. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. గురిగింజకుంట, దప్పేపల్లి గ్రామాలకు చెందిన వైసీపీ సర్పంచ్ లు రఘునాథ రెడ్డి, కేశవప్ప ఆధ్వర్యంలో…
Shyamala: ఆంధ్రప్రదేశ్‌లో ‘బాబు గారి మాటలకు అర్థాలే వేరులే’ అనే కొత్త సినిమా విడుదలైంది అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శ్యామల సెటైర్లు వేశారు.. ఎన్నికల ముందు బాబు గారు ఒక మాట మాట్లాడారు అంటే చాలా అర్థాలు ఉంటాయి.. గత ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధిని నిర్వీర్యం చేశారు.. మద్యం మాఫియాతో అనాగరిక పాలన సాగుతోంది.. నకిలీ లిక్కర్ ఫ్యాక్టరీలు అనేకం పుట్టుకొస్తున్నాయి.. రాష్ట్రంలో అర్ధరాత్రి సమయంలో కూడా మద్యం దొరుకుతుంది.. మద్యం…
Off The Record: ఉన్నట్టుండి ఉలిక్కిపడి నిద్ర లేచినట్టు… తెగ హడావిడి చేసేస్తున్నారు ఆ మాజీ ఎంపీ. గత ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత అసలు ఎక్కడున్నాడో కూడా తెలియని సదరు నేత.. ఇప్పుడు మాత్రం పిలవకుండానే పలుకుతూ… ఇక్కడెవరన్నా నన్ను పిలిచారా అంటూ డైరెక్ట్‌గా సీన్లోకి వచ్చేస్తున్నారట. ఇంతలోనే అంత మార్పు ఏంటి? ఎవరా లీడర్? పార్టీ అధిష్టానం నుంచి ఆయనకు పే…ద్ద భరోసా వచ్చిందన్నది నిజమేనా? మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి ఉన్నట్టుండి యాక్టివ్…
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ఎస్పీడీసీఎల్లో వేలకోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు చేశారు. ఇది రెండు పార్టీల అవినీతి ప్రేమ కథ అని, దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని కోరారు. ప్రస్తుతం విచారించేంత పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. వైసీపీ హయాంలో అప్పటి సంతోష్ రావు లాంటి అధికారుల వల్లే ఇప్పుడు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. కందుకూరు హత్య కేసులో లక్ష్మి నాయుడు కుటుంబానికి ప్రభుత్వ సాయంపై ఏబీ వెంకటేశ్వరరావు…