ఆ నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి అయోమయం గందరగోళంగా ఉందా? మరీ… నోట్లో నాలుక లేని వ్యక్తిని ఇన్ఛార్జ్గా పెట్టి పార్టీ అధిష్టానం చేతులు కాల్చుకుంటోందా? మేటర్ ఏదైనా సరే… పలాయనమే ఆ ఇన్ఛార్జ్కు తెలిసిన ఏకైక పరిష్కారమా? ఎవరా నాయకుడు? ఏంటా ఫెయిల్యూర్ స్టోరీ? ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైసీపీ రాజకీయాలు మూడడుగులు ముందుకు.. ఆరడుగులు వెనక్కు అన్నట్లుగా మారాయని సొంతపార్టీ నేతలే చెవులు కొరుక్కుంటున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన దద్దాల నారాయణ…
Minister Satya kumar: ఉద్దానం విషయంలో రాద్దాంతం చేస్తున్నారు అని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఇలా చేస్తే 11 సీట్లు కూడా ఈసారి రావు.. ప్రజలు చిత్తుగా ఓడించారని జగన్ కక్ష కట్టాడు అని పేర్కొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం జరగకుండా అడ్టు పడుతున్నారు.
వైసీపీలో నిశ్శబ్దం పూర్తి స్థాయిలో బద్దలైపోయినట్టేనా? ఇన్నాళ్ళు అనుమానాలతో చూద్దాం, చేద్దాం అనుకున్న సీనియర్స్ కూడా ఇక యాక్టివ్ బటన్ ఆన్ చేసినట్టేనా? ఇప్పుడే ఎందుకు గేర్ మారుస్తున్నారు అంతా? ఇప్పటికీ గడప దాటకుంటే మీ కుర్చీల కిందికి నీళ్ళొస్తాయన్న వార్నింగ్స్ బలంగా పని చేశాయా? ఫ్యాన్ పార్టీలో అసలేం జరుగుతోంది? ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 17 నెలలు కావస్తోంది. వైసీపీ కనీవినీ ఎరుగని ఘోర ఫలితాలను చూడటం, అధికార మార్పిడి జరిగాక మాజీ…
Rachamallu Sivaprasad Reddy: కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో అసాంఘిక కార్యకలాపాలు పెరిగిపోతున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.
JC Prabhakar Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి.. చంద్రబాబు నాయుడు మంచి వ్యక్తి.. ఆయన అడ్డుపడుతున్నాడు కాబట్టి.. మీరు ఇలా ఉన్నారంటూ హెచ్చరించారు.. వైసీపీ నేత, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి.. ఇదే మీకు లాస్ట్ దీపావళి అంటున్నాడు.. అంటే.. ఇదే లాస్ట్ దీపావళి అంటే మేము చూస్తూ ఊరుకోవాలా..? మేము మొదలు పెడితే మీరు…
TDP: ఏపీ సీఎం చంద్రబాబు అటు మంత్రులకు ఇటు నేతలకు వైసీపీ ని ధీటుగా ఎదుర్కోవాలని చెప్తున్నారు.. కేబినెట్ సమావేశాలు జరిగిన ప్రతిసారి మంత్రులకు రకరకాల సూచనలు ఇస్తున్నారు… వైసీపీకి సరైన కౌంటర్లు ఇవ్వడం లేదని అదే విధంగా వైసీపీపై ధీటుగా స్పందించట్లేదని… ఇలా చేయకపోవడం వల్ల తప్పుడు సంకేతాలు జనంలోకి వెళ్లే అవకాశం ఉందని సీఎం చంద్రబాబు చెబుతున్నారు.. దీంతోపాటు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టి కౌంటర్లు ఇవ్వాలని సీఎం చంద్రబాబు చెబుతూ ఉన్నారు.. Read…
Seediri Appalaraju: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 10 రోజులుగా అతలాకుతలం అయిపోతుందని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆరోపించారు. ఓ పక్కా రాష్ట్రంలో నకిలీ మద్యం అమ్మకాలు భారీగా జరుగుతున్నాయి.. మరో వైపు వైసీపీ హయాంలోని వచ్చిన మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తున్నారు.. గూగుల్ డేటా సెంటర్ తో నకిలీ మద్యం, మెడికల్ కాలేజీల అంశాన్ని డైవర్ట్ చేస్తున్నారు.
Minister Nimmala: నెల్లూరు జిల్లాలో జరిగిన ఘటనకు కులం రంగు పులిమి వైసీపీ విష ప్రచారం చేయడం ఆ పార్టీ రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. శవ రాజకీయాలు సృష్టించి ఆ మంటల్లో చలి కాచుకోవాలని చూస్తుందని అన్నారు.
ప్రమాదం అని ఒక చిన్న కేసు నమోదు చేసినట్లు తెలిసింది.. కాబట్టి, బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు వైసీపీ పోరాడుతుంది అని ఆయన చెప్పుకొచ్చారు. ఈ రోజు నేను పరామర్శించడానికి వస్తే పోలీసులు ఎందుకు ఉన్నారు?.. వారి ఉద్దేశం ఏమిటి? అని ప్రశ్నించారు. బాధితులకు మేము అండగా ఉంటామని మాజీ మంత్రి అంబటి రాంబాబు వెల్లడించారు.
అద్దెపల్లి జనార్థన్, జయ చంద్రారెడ్డి స్నేహితులని మీరే చెప్పారు అని గుర్తు చేశారు. ఇక, జనార్థన్ కు రెడ్ కార్పెట్ వేసి మీరే రప్పించారు అన్నారు. ఆయనతో నా పేరు చెప్పించారు.. కస్టడీలో ఉన్న వ్యక్తి వీడియో ఎలా బయటకు వచ్చింది అని మాజీ మంత్రి ప్రశ్నించారు. అయితే, నకిలీ మద్యం కేసులో ఏ విచారణకు అయినా నేను సిద్ధంగా ఉన్నాను, లై డిటెక్టర్ పరీక్షకు కూడా సిద్ధం, ఎక్కడికైనా వస్తాను అని జోగి రమేశ్ సవాల్…