Perni Nani : తప్పుడు రాజకీయాలు చేయడంలో చంద్రబాబు దిట్ట
- తప్పుడు రాజకీయాలు చేయడంలో చంద్రబాబు దిట్ట
- ప్రజాస్వామ్యాన్ని తప్పుడు దారిలో నడిపించడంలో చంద్రబాబు వింతపోకడలు పోతున్నారు
- ఓ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను మంత్రులుగా ప్రమాణం చేయించారు
- వ్యక్తులను ప్రలోభాలకు గురిచేయటంలో ఆయనకు ఆయనే సాటి
- చంద్రబాబు రాజకీయ అనైతిక క్రీడలో భాగమే మా పార్టీ ఎమ్మెల్సీల రాజీనామాలు. -పేర్ని నాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Perni Nani : కూటమి ప్రభుత్వంపై మరోసారి వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తప్పుడు రాజకీయాలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు గతంలో ఒక పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను మంత్రులుగా ప్రమాణం చేయించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఆయన అన్నారు. మనుషులను ప్రలోభాలకు గురి చేయడంలో చంద్రబాబుకు సరితూగే వ్యక్తి లేరని విమర్శించారు. కొనుగోలుదారులను సిద్ధం చేసి, బయానాలు ఇప్పించి, నేతలను రాజీనామా చేయించేందుకు ఒత్తిడి తెస్తారని ఆరోపించారు.
రాజీనామా చేసిన వారిని ఆమోదించమని సంబంధిత పార్టీలు అడగాలి, కానీ ఇక్కడ పరిస్థితి రివర్స్‌గా ఉందని అన్నారు. మా పార్టీ ఎమ్మెల్సీల రాజీనామాలు కూడా చంద్రబాబు రాజకీయ అనైతిక క్రీడలో భాగమేనని పేర్ని నాని ఆరోపించారు. చంద్రబాబు చట్టాలను పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. గతంలో ఆరోగ్య కారణాలతో బెయిల్‌పై వచ్చారని, కానీ వెంటనే 18 గంటల ర్యాలీ నిర్వహించి, అప్పటి నుంచి ఆస్పత్రికి కూడా వెళ్లలేదని అన్నారు.
Also Read
- CM Chandrababu: డబుల్ ఇంజన్ సర్కార్ జోష్‌లో వెళ్తుంది.. పంచాయతి ఎన్నికల్లో ఇదే ఉత్సాహం చూపించాలి..
- Tirupati Crane Accident: తిరుపతిలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి, ఇద్దరికి గాయాలు
- AP Liquor Case: లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. సిట్ విచారణకు మాజీ ఐఏఎస్
- TRAI New Recharge Rules: TRAI కొత్త నిబంధనలు.. Jio, Airtel, Vi రీఛార్జ్ ప్లాన్లలో కీలక మార్పులు..
ఈ అవకాశాన్ని ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు ఉపయోగించకుండా, వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టేందుకే ఉపయోగిస్తున్నారని పేర్కొన్నారు. అమరావతి అంశంపై కూడా ఆయన చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. అమరావతి విషయంలో రైతులను నట్టేట ముంచే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. గతంలో జగన్ శాసన రాజధాని ఇదేనని స్పష్టంగా చెప్పారు, కాని చంద్రబాబు మాత్రం అమరావతి అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
ఈ శీతాకాలంలో టూర్ ఎక్కడికి వెళ్లాలి? ఇండియాలోని బెస్ట్ వింటర్ స్పాట్స్ ఇవే !
తాజావార్తలు
-
Balochistan: పాక్ సైనికులపై BLA మహిళా యూనిట్ దాడి.. 9 మంది హతం..
-
Virat Kohli Hundred Centuries: విరాట్ కోహ్లీ 100 శతకాలు సాధిస్తాడా.. ఇదిగో సాధ్యసాధ్యాలు..
-
TGSPDCL : విద్యుత్ డిమాండ్‌లో కొత్త రికార్డు.. 12,044 మెగావాట్లు.!
-
Dhanush: ‘‘ధనుష్ రాజకీయాల్లోకి వచ్చేశాడు’’.. విజయ్‌పై కనిమొళి సెటైర్లు.!
-
UP Elections: ‘‘అభ్యర్థి పేరు చెప్పండి.. సీటు తీసుకోండి’’.. కాంగ్రెస్‌కు ఎస్పీ కొత్త కండిషన్
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!