చంద్రబాబు పోలవరం బ్యారేజీ కడదామనే భ్రమలో ఉన్నారంటూ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ సెటైర్లు వేశారు. అందుకే పోలవరం బ్యారేజీ అంటున్నారని, మేము కడుతుంది పోలవరం ప్రాజెక్టేనని ఆయన అన్నారు. అంతేకాకుండా దీనిపై ఎవరితోనైనా ఓపెన్ డిబెట్ కు సిద్ధమని ఆయన సవాల్ విసిరారు. ఒక్క క్యూసెక్కు నీరు చుక్క తగ్గకుండా నీరు స్టోరేజ్ చేస్తామని, చంద్రబాబు తప్పిదాలు కారణంగా డయాఫ్రం వాల్ పునఃనిర్మాణం చేయాల్సి వస్తుందన్నారు. రాజమండ్రి నగరంలో 35 కోట్ల…
రాజధానిపై మరో చట్టం తీసుకురావటానికి వీల్లేదని హైకోర్టు ఇచ్చిన తీర్పులో స్పష్టంగా ఉందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విభజన చట్టం ప్రకారం రాజధానిపై చట్టం చేసే హక్కు పార్లమెంటుకు ఉందిగానీ శాసనసభకు లేదని తీర్పులో స్పష్టంగా పేర్కొన్నారు. శాసన సభ రాజ్యాంగానికి లోబడి చట్టాలు చేయాలి తప్ప రాజ్యాంగానికి వ్యతిరేకంగా చట్టం చేసే అధికారం లేదని ఆయన వెల్లడించారు. రాజధానిపై మూర్ఖంగా మరో చట్టం చేసినా…
పోలవరం నిర్వాసితులకు అంతా బాగుందని కేంద్రమంత్రికి జగన్ చెప్పించే ప్రయత్నం చేశారని టీడీపీ నేత, మాజీమంత్రి దేవినేని ఉమా అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పునరావసం కింద ఎన్ని ఇళ్లు, ఎప్పుడు పూర్తి చేస్తారో కూడా చెప్పలేని పరిస్థితిలో సీఎం ఉన్నారని, దాదాపు లక్ష కుటుంబాలకు కట్టాల్సిన ఇళ్లపై జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి పోలవరం పరిశీలనకు వస్తే రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి అడ్రస్ లేడని, జరిగిన పనులు…
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అసెంబ్లీకి సైకిల్‌పై బయల్దేరారు. పేదల సొంతింటి కలను నెరవేర్చడానికి టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు ఉచితంగా అందజేయాలని డిమాండ్ చేస్తూ రామానాయుడు సైకిల్ యాత్ర ప్రారంభించారు. నిమ్మల రామానాయుడు చేపట్టిన సైకిల్ యాత్ర పాలకొల్లు నుంచి అమరావతి సాగనుంది. ఆయనకు టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. పాలకొల్లులో తెలుగు మహిళ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రోజారమణి హారతిచ్చి ఎమ్మెల్యే నిమ్మల సైకిల్ యాత్రకు ఎదురు…
సీఎం జగన్ పోలవరం పర్యటనలో పోలీసులు ఓవరాక్షన్ చేసినట్లు కనిపించారు. ఏకంగా మంత్రుల వాహనాలను పోలీసులు ఆపడం వివాదానికి దారి తీసింది. వివరాల్లోకి వెళ్తే.. సీఎం జగన్ పోలవరం పర్యటన సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా ఇంఛార్జి మంత్రి హోదాలో మంత్రి పేర్ని నాని కూడా సీఎంతో కలిసి వెళ్లారు. అయితే పోలీసులు మంత్రి కారు అడ్డంగా ఉందని.. దానిని పక్కకు తీయాలని చెప్పడంతో మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. ‘నేను ఎవరో తెలుసా? నా డిసిగ్నేషన్…
ఏపీ రాజధాని అమరావతిపై హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. అమరావతి పేరుతో గత ప్రభుత్వం టీడీపీ అరచేతిలో స్వర్గం చూపించిందని ఆయన ఆరోపించారు. అమరావతిలో టీడీపీ నేతలు ఇన్సైడ్ ట్రేడింగ్ చేసుకున్నారని విమర్శలు చేశారు. రైతు ఉద్యమం పేరుతో చంద్రబాబు గ్యాంగ్ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. రాజధాని పేరుతో లక్ష కోట్ల భారాన్ని ఏ రాష్టం కూడా మోయలేదన్నారు. అమరావతి నిర్మాణానికి లక్ష కోట్లు ఖర్చుపెట్టడం అసాధ్యమని అభిప్రాయపడ్డారు. అన్ని…
నేడు సీఎం జగన్, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌తో కలిసి తూర్పు ఏజెన్సీలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పోలవరం నిర్వాసితుల కోసం నిర్మించిన పునరావాస కాలనీల సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించేందుకు క్రింద ఇచ్చిన లింక్‌ను క్లిక్ చేయండి.
గత అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు భార్య నారా భువనేశ్వరీపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ అసెంబ్లీ సమావేశాల నుంచి వాకౌట్ చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి హోదాలోనే అసెంబ్లీలో అడుగుపెడుతానని శపథం చేశారు. ఈ నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 7 నుంచి మొదలు కానున్నాయి. ఈ క్రమంలో అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలా? వద్దా? అన్న విషయంపై టీడీపీలో పెద్ద చర్చే నడుస్తోంది. ఇప్పటికే గురువారం మధ్యాహ్నం…
ధర్మం, న్యాయం ఎప్పటికైనా గెలుస్తుందని, రాజధాని అమరావతి విషయంలో అదే జరిగిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దుర్మార్గులు పెట్రేగిపోవటం తాత్కాలికమేనని, ఎస్సీలు, ముస్లింలు ఎక్కువగా ఉన్న ప్రాంతాన్ని రాజధానిగా ఎంచుకుంటే జగన్‌కి కులం అడ్డొచ్చిందని ఆయన విమర్శించారు. శ్రీకాకుళం-అనంతపురానికి మధ్యలో ఉన్న అమరావతిని రాజధాని గా ఎంపిక చేస్తే జగన్ మద్దతు తెలిపారని, అమరావతితో పాటు అన్ని ప్రాంతాల అభివృద్ధి కి శ్రీకారం చుట్టామన్నారు. ఆరోజు అడ్డం రాని కుల-మతాలు…
మాజీ మంత్రి, వైసీపీ నేత వైఎస్ వివేకా హత్య కేసు మరోసారి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారింది.. అయితే, ఈ కేసుపై చంద్రబాబు వ్యంగ్యాస్త్రాలు సంధించారు.. వివేకా హత్యపై ఎన్నో నాటకాలాడి కట్టు కథలు అల్లారని మండిపడ్డ ఆయన.. నేనే అవినాష్ రెడ్డిని పిలిపించి రక్తం మరకలు తుడిపించానట అంటూ సెటైర్లు వేశారు.. వివేకాను హత్య చేసిన అవినాష్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, ఎర్రగంగి రెడ్డి సహా చివరికి జగన్ కూడా మన మనిషేనట అంటూ…