జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గుంటూరు జిల్లా ఇప్పటం దగ్గర ఈనెల 14వ తేదీన భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది.. ఇప్పటం వేదికగా.. పార్టీ కార్యాచరణను ప్రకటించబోతున్నారు పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. అయితే, సీఎం వైఎస్ జగన్ అహంకారానికి ప్రజల ఆత్మాభిమానానికి మధ్య జరుగుతున్న పోరాటమే ఈ సభగా అభివర్ణించారు జనసేన నేత నాదెండ్ల మనోహర్… జనసేన ఆవిర్భావ దినోత్సవం పండుగ వాతావరణంలో జరగనుంది అని వెల్లడించిన ఆయన.. దామోదరం సంజీవయ్య పేరుతో సభ ప్రాంగణం నిర్వహణ ఉంటుందని.. పవన్ కల్యాణ్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ లో ఒక దిశ నిర్దేశ సభ జరుగుతుంది తెలిపారు.
Read Also: Pawan Kalyan: జనసేన ఆవిర్భావ సభ ద్వారా బలమైన సందేశం పంపిస్తా
ప్రజా సమస్యల కోసం పోరాడే పార్టీ జనసేన అని స్పష్టం చేశారు నాదెండ్ల మనోహర్.. మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం అధికారులు చేయొద్దు అని సూచించిన ఆయన.. సీఎం అహంకారానికి ప్రజల ఆత్మాభిమానానికి మధ్య జరుగుతున్న పోరాటం ఈ సభ.. పోలీసులు పెట్టే ఆంక్షలకు బెదిరేదిలేదన్నారు. వారదిపై వైసీపీ ఫ్లెక్సీలు పెట్టుకోవచ్చు.. కానీ, జనసేనవి పెట్టకూడదు అని పోలీసులు చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు.. ఈ ప్రభుత్వాన్ని సాగనంపే రోజులు దగ్గర లోనే ఉన్నాయన్న ఆయన.. ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో పవన్ కల్యాణ్ ఉన్నారు.. జనసేన భవిష్యత్ ఎలా ఉండబోతుందో ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలకు పవన్ కల్యాణ్ దిశా నిర్దేశం చేస్తారు అని వెల్లడించారు.. ఖచ్చితంగా మధ్యాహ్నం 3 గంటలకు సభ ప్రారంభం అవుతుందని.. సభకు వచ్చే ప్రజలకు, జన సైనికులకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు తెలిపారు నాదెండ్ల మనోహర్.