CPI State Secretary Ramakrishna Fired On YSRCP and Janasena Party Leaders.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సీఎం జగన్ అదాని ప్రదేశ్ రాష్ట్రంగా మారుస్తున్నాడు అంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శలు గుప్పించారు. అమిత్ షా డైరెక్షన్ లో ఆస్థులు అదానికి అప్పగిస్తున్నారని, మోడీ, అమిత్ షా, జగన్, అదాని కలిసి మాట్లాడుకుని రాష్ట్రంలో సంపద కొల్లగొడుతున్నారని ఆయన మండిపడ్డారు. మోడీ, అమిత్ షా డైరెక్షన్‌లో సీఎం జగన్ నడుస్తుంటే…ఇప్పుడు పవన్ కళ్యాణ్ రోడ్ మ్యాప్ ఇవ్వమని బీజేపీ నాయకుల్ని అడుగుతున్నాడని ఆయన వ్యాఖ్యానించారు.
బీజేపి నాయకుల డైరెక్షన్‌లో పని చేస్తున్న జగన్ ని దించి నాకు రోడ్డు మ్యాప్ ఇవ్వమని పవన్ అడుగడం ఆశ్చర్యమన్నారు. గతంలో బీజేపీ పాచిపోయిన లడ్డు ఇచ్చిందని చెప్పిన పవన్ కి ఇప్పుడు లడ్డూల టేస్ట్ మారిందా అంటూ ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో చేవచచ్చిన నాయకులు ముందుకు వస్తున్నారని, కేంద్రం రాష్ట్రానికి చేస్తున్న అన్యాయంపై పోరాటం చేసేందుకు అన్ని పార్టీలు ముందుకు రావాలన్నారు. జగన్ అప్రజాస్వామిక పోకడలపై మేం పోరాడుతున్నామన్నారు.