Former CM Chandrababu about jangareddygudem death mysterys.
పశ్చిమ గోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెంలో వరుస మరణాలు చోటు చేసుకున్న విషయం తెలిసింది. ఈ ఘటన రాష్ట్రా వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అంతేకాకుండా అసెంబ్లీ సమావేశాలను కూడా ఈ ఘటన కుదిపేస్తోంది. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ.. నాటు సారా వల్లనే జంగారెడ్డిగూడెం వరుస మరణాలు చోటు చేసుకున్నాయన్నారు. అంతేకాకుండా సహజ మరణాలు అంటూ ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందని, అసెంబ్లీలో అసత్య ప్రచారం చేస్తున్నా ముఖ్యమంత్రి జగన్ ను ప్రజలు డిస్మిస్ చేయాలన్నారు.
టీడీపీ తరఫున మృతుల కుటుంబాలకు లక్ష రూపాయలు చొప్పున నష్ట పరిహారాన్ని చంద్రబాబు ప్రకటించించారు. ప్రభుత్వం 25 లక్షల రూపాయలు వంతున నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత 25 లక్షల నష్ట పరిహారం ఇస్తామని, ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మృతుల పిల్లలను చదివిస్తామని హామీ ఇచ్చారు.