పశ్చిమ గోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెంలో మరణాలు ఇప్పుడు ఆందోళనకు కలిగిస్తున్నాయి.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇప్పటి వరకు 18 మంది మృతి చెందారు. జంగారెడ్డిగూడెంలో వరుసగా జరుగుతున్న మరణాలపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మిస్టరీగా మారిన మరణాలపై అధికారులు విచారణ చేపట్టారు. ఇక, జంగారెడ్డి గూడెంలో చోటు చేసుకుంటున్న మరణాలపై టీడీపీ తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించింది. మరణాలపై ప్రభుత్వం స్పందించాలని టీడీపీ చీఫ్ చంద్రబాబు డిమాండ్ చేశారు. ఇంత మంది చనిపోతే కూడా ప్రభుత్వం కదలడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.. అయితే, ఈ పరిణామాలపై స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి.. చంద్రబాబుపై మండిపడ్డారు.. చంద్రబాబు చాలించు నీ కపట నాటకాలు అంటూ ఫైర్ అయ్యారు.
Read Also: Avanthi: పవన్ కల్యాణ్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది..!
జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో మరణించిన 18 మందిలో పోస్ట్ కోవిడ్ లక్షణాలు , హైబీపీ, గుండె సంబందిత సమస్యలు, షుగర్, మూత్రపిండాల వ్యాధి, లివర్ వ్యాధి లక్షణాలతో బాధపడ్డారని తెలిపారు డిప్యూటీ సీఎం నారాయణస్వామి.. వీరిలో ముగ్గురుకి పోస్ట్ మార్టం కూడా చేసి ఫోరెన్సిక్ ల్యాబ్‌కి శాంపిల్స్ పంపించామని తెలిపారు.. పోస్ట్ మార్టం రిపోర్ట్స్ రావాల్సి ఉంది.. వీరి మరణాలను కూడా చంద్రబాబు తన స్వార్థ రాజకీయల కోసం వాడుకోవటం బాధాకరం అన్నారు.. 13 మంది వారి ఇంటి వద్దనే మరణించారని తెలిపిన ఆయన.. ఐదుగురు ఆసుపత్రిలో వైద్యం తీసుకుంటూ మరణించారని తెలిపారు.. అనారోగ్య సమస్యలతో ఇంటి వద్ద చనిపోయిన వారిని కూడా చంద్రబాబు తన రాజకీయ అవసరాల కోసం వాడుకోవడం దురదృష్టకరమని విమర్శించారు డిప్యూటీ సీఎం నారాయణస్వామి.