ఏపీ అసెంబ్లీలో మంగళవారం కూడా గందరగోళం చోటుచేసుకుంది. సభ ప్రారంభమైన వెంటనే జంగారెడ్డి గూడెం సంఘటనకు సంబంధించి న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు వచ్చి నినాదాలు చేశారు. పోడియం వద్దకు వస్తే చర్యలు తీసుకుంటామని స్పీకర్ ముందే హెచ్చరించినా టీడీపీ సభ్యులు మాత్రం వెనక్కి తగ్గలేదు. దీంతో స్పీకర్ పలువురు టీడీపీ నేతలను సభ నుంచి సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు టీడీపీ…
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఆందోళనల మధ్య కొనసాగుతూనే ఉన్నాయి.. ప్రతీ రోజు శాసన సభలో టీడీపీ సభ్యులు ఆందోళన చేయడం… వారిని సభ నుంచి సస్పెండ్ చేయడం నిత్యం కొనసాగుతోంది.. అయితే, ఈ మధ్య త్వరలోనే తెలుగు దేశం పార్టీ బండారం బయట పెడతా? అంటూ అసెంబ్లీలో ప్రకటించారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి.. ఇక, ఇవాళ ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. ఇవాళే టీడీపీ బండారం బయటపెడతానని ప్రకటించారు.. ఎన్టీఆర్ తీసుకుని వచ్చిన మద్యపాన నిషేదాన్ని…
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ఇవాళ కీలక బిల్లులకు ఆమోదం తెలపనున్నారు.. మూడు రోజుల గ్యాప్ అనంతరం ఇవాళ ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్నాయి ఏపీ అసెంబ్లీ సమావేశాలు… ప్రశ్నోత్తరాలు, దేవదాయ, ఎక్సైజ్ శాఖలకు చెందిన బిల్లులను ఆమోదించనుంది సభ.. అసెంబ్లీలో వివిధ పద్ధులపై చర్చించి ఆమోదం తెలపనున్నారు.. ఇక, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న పోలవరం ప్రాజెక్టు ప్రగతిపై స్వల్ప కాలిక చర్చ సాగనుంది.. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో చర్చకు వచ్చే అంశాల విషయానికి వస్తే.. సీఎంఆర్ఎఫ్, మత్స్యకారులకు…
ఏపీలో ప్రస్తుతం కల్తీ మద్యం, కల్తీ సారాపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలపై మంత్రి అప్పలరాజు తీవ్ర విమర్శలు చేశారు. పచ్చపార్టీ వాళ్లు లిక్కర్ బ్రాండ్లపై ఆరోపించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రెసిడెంట్ మెడల్ విస్కీ, గవర్నర్స్ రిజర్వ్ విస్కీ వంటి మద్యం బ్రాండ్లకు 2018 ఫిబ్రవరి 6న అప్పటి సీఎం చంద్రబాబే అనుమతులు ఇచ్చారని మంత్రి అప్పలరాజు గుర్తుచేశారు. భూమ్.. భూమ్ బీర్ కంపెనీకి 2019…
కృష్ణా జిల్లా వైసీపీలో విభేదాలు బయటపడ్డాయి. టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై గన్నవరంలోని వైసీపీ నేతలు అసంతృప్తిగా ఉన్నారు. దీంతో గన్నవరం వైసీపీ క్యాడర్ వైసీపీ కీలక నేత, పార్టీ వ్యవహారాల శాఖ ఇంఛార్జి విజయసాయిరెడ్డికి లేఖ రాసింది. ఈ లేఖ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. గన్నవరం నియోజకవర్గ బాధ్యతలు వల్లభనేని వంశీకి అప్పగించొద్దని వైసీపీ కార్యకర్తలు లేఖలో విజయసాయిరెడ్డిని కోరారు. తాము 9 సంవత్సరాల నుంచి కోట్ల రూపాయలు…
ఏపీ రాజకీయాల్లో వైసీపీ నేత కొడాలి నాని, టీడీపీ నేత వంగవీటి రాధా ఇద్దరూ క్రేజ్ ఉన్న నేతలే. వేర్వేరు పార్టీలకు చెందిన వారైనా వీరిద్దరూ తమ స్నేహాన్ని కొనసాగిస్తుంటారు. సాధారణంగా వైసీపీ, టీడీపీ నేతలు అనేక అంశాలపై ఆరోపణలు చేసుకోవడం మాములే. కొడాలి నాని నిత్యం చంద్రబాబుపై ఘాటు విమర్శలు చేస్తూనే ఉంటారు కూడా. ప్రతిగా టీడీపీ నేతలు కూడా కొడాలి నానిని టార్గెట్ చేస్తుంటారు. కానీ కొడాలి నాని, రాధా అనుబంధంపై ఈ మాటల…
కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డికి జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కౌంటర్ ఇచ్చారు. ఏపీలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడ నుంచి పోటీ చేసినా ఓడిస్తానని సవాల్ చేయడంపై నాదెండ్ల మనోహర్ స్పందించారు. ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి వ్యాఖ్యలు విని తనకు చాలా ఆశ్చర్యం కలిగిందన్నారు. ఆయనకు అంత అహంకారం ఎక్కడి నుంచి వచ్చిందో అర్ధం కావడం లేదని వ్యాఖ్యానించారు. వైసీపీ నేతలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను…
బెజవాడ కార్పోరేషన్ పనితీరుపై విపక్ష టీడీపీ నిరసన తెలుపుతోంది. విజయవాడ నగర పాలక సంస్థ బడ్జెట్ సమావేశం సందర్భంగా కౌన్సిల్ హాల్ కి నిరసన తెలుపుతూ వెళ్లారు టీడీపీ కార్పొరేటర్లు. విజయవాడ నగర పాలక సంస్థ మున్సిపల్ చట్టానికి వ్యతిరేకంగా బడ్జెట్ ప్రవేశపెట్టిన వైసీపీ పాలకపక్షంపై కార్పోరేటర్ కేశినేని శ్వేత మండిపడ్డారు. ఈ బడ్జెట్ నగర ప్రజలకు గుదిబండగా మారబోతుందన్నారు. గత మూడు సంవత్సరాలు నుండి నగరంలో వైసీపీ చేసిన అభివృద్ధి శూన్యం. గత సంవత్సర కాలం…
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ ఆవిర్భావ సభా వేదికగా చేసిన వ్యాఖ్యలపై ఇతర పార్టీల నుంచి విమర్శలు వస్తూనే ఉన్నాయి.. అధికార, ప్రతిపక్ష నేతలు ఇలా అంతా పవన్‌ను టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు.. ఇక, ఇవాళ పవన్ వ్యాఖ్యలపై స్పందించిన సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. పవన్ కళ్యాణ్ ఎటూకాకుండా తలతిక్కతనంగా మాట్లాడారని ఎద్దేవా చేశారు.. బీజేపీ, వైసీపీ భార్య భర్తలు పెళ్లి చేసుకోకుండా ఎలా కాపురం చేస్తారో ఆ విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డ…
జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఆ పార్టీ శ్రేణులపై సంచలన వ్యాఖ్యలు చేశారు.. కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి… తూర్పు గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ఎక్కనుండి పోటీ చేసినా నేను ఓడిస్తానని ప్రకటించారు.. కాకినాడలో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. పవన్ కళ్యాణ్.. కాకినాడలో కొందరు చెంచాలు చెప్పే మాటలు నమ్మి నాపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.. వాస్తవాలు తెలుసుకుని నా గురించి మాట్లాడు అంటూ కౌంటర్ ఇచ్చిన ఆయన.. జనసేన నాయకులు, కార్యకర్తలకు పవన్…