ఇటీవల ఏపీ హైకోర్టు కోర్టు ధిక్కరణ కేసులో పలువురు ఐఏఎస్ అధికారులకు జైలు శిక్ష విధించింది. దీంతో అక్కడికక్కడే బేషరతుగా ఐఏఎస్ అధికారులు కోర్టుకు క్షమాపణలు చెప్పడంతో సేవాల కార్యక్రమాలు చేయాలని తీర్పును సవరించింది. అయితే ప్రస్తుతం ఏపీలో ఈ ఘటన హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై వివిధ రాజకీయ పార్టీల నేతలు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య మాట్లాడుతూ.. ఐఏఎస్ అధికారులకు కోర్టు శిక్ష విధించడం దేశ చరిత్రలోనే లేదని ఆయన మండిపడ్డారు.
సీఎం జగన్‌కు న్యాయ వ్యవస్థపై ఉన్న వ్యతిరేకతతోనే ఐఏఎస్‌లకు శిక్షలు తప్పడం లేదన్నారు. అయితే న్యాయ వ్యవస్థ దయతో అధికారులు జైలు శిక్ష నుంచి తప్పించుకున్నా, సేవా కార్యక్రమాల చేయాలని సూచించిందన్నారు. జగన్ అసమర్థత వల్లే ఐఏఎస్ అధికారులకు శిక్ష పడిందని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా సీఎం స్థానంలో జగన్ కాకుండా మరెవరైనా ఉంటే.. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ.. సీఎం పదవి రాజీనామా చేసేవారిని ఆయన వ్యాఖ్యానించారు.