ఏపీలో ఇప్పుడంతా కేబినెట్ మార్పుల గురించే చర్చించుకుంటున్నారు. మంత్రివర్గ విస్తరణపై ఎన్టీవీతో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. మంత్రివర్గ విస్తరణ సీఎం జగన్ ఆలోచన ప్రకారం జరుగుతుంది. సీఎం జగన్ నిర్ణయాన్ని ప్రతీ ఒక్కరూ గౌరవించాల్సిందే అన్నారు. మంత్రివర్గ మార్పులు.. చేర్పులపై ఎవరికీ క్లారిటీ లేదు.
సీఎం జగన్ ఏ రోజు చెబితే ఆ రోజు రాజీనామాలు చేసేందుకు మంత్రులందరూ సిద్ధంగా వున్నామన్నారు. సీఎం జగన్ నూతన మంత్రివర్గంలో మంత్రులుగా ఎవరుండాలని నిర్ణయిస్తే వారే ఉంటారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాటల్లోనే క్లారిటీ లేదు. పల్లకీలు మోయను అంటారు.. వాళ్ళనే వెనుకేసుకొస్తారు.
పవన్ ముఖ్యమంత్రి అభ్యర్దిగా ఉండను అంటారు. మరి ప్రజలకు ఇచ్చిన హామీలు ఎలా నెరవేరుస్తారని ఆయన అన్నారు. మంత్రివర్గ మార్పులపై ఇప్పటికే పేర్ని నాని, ధర్మాన కృష్ణదాస్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రేపు ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. ఇదే చివరి భేటీ అంటున్నారు. మంత్రివర్గ సమావేశం అనంతరం ఒక క్లారిటీ వచ్చే అవకాశం వుంది.
స్వాగతిస్తున్నాం.. కోలగట్ల వీరభద్రస్వామి
ముఖ్యమంత్రి జగన్ చేపట్టిన మంత్రివర్గ విస్తరణ స్వాగతిస్తున్నాం. నేను మంత్రిపదవి రేసులో లేను. దయజేసి నా పేరును మంత్రిపదవి రేసులో ఉన్నాననే ప్రచారం చేయద్దు. జిల్లాలో బీసీ వ్యక్తికి కాకుండా అగ్రకులంలో ఉన్న నాకు మంత్రి పదవి ఇవ్వడం కరెక్ట్ కాదని యోచన. బొత్స సత్యనారాయణను మంత్రిగా కొనసాగించాలని కోరుతున్నాం. నేను నియోజకవర్గ అభివృద్ధికి మాత్రమే కట్టుబడి ఉన్నాను. జిల్లాలో పార్టీ బలోపేతంపై దృష్టి పెడతానన్నారు.