రాజకీయాల్లో 40ఏళ్లకు పైగా ఉన్న సీనియర్ నేత. ఆయనతో రాజకీయ ప్రస్ధానం మొదలు పెట్టిన నాయకులు సీఎంలై.. మంత్రులై చక్రం తిప్పారు. ఆయనకు మాత్రం మంత్రి పదవి అందని ద్రాక్షగా మారింది. ఆయన గెలిస్తే పార్టీ అధికారంలోకి రాదు.. పార్టీ అధికారంలోకి వస్తే ఆయన గెలవరు. ప్రస్తుతం పార్టీ మారి అధికారపార్టీ పంచన చేరారు. ఈసారైనా మంత్రి పదవి వరిస్తుందా? అసలు ఆయన అలాంటి ఆశలు పెట్టుకున్నారా? ఇంత వరకు మంత్రి కాని కరణం బలరాంకరణం బలరాం.…
TDP MP Rammohan Naidu Made Comments on CM Jagan. ఆర్టికల్ 360 ఉపయోగించాల్సిన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్‌లో దాపురించాయని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. ఆదివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఈ విషయంపై కేంద్రం పరిశీలించి అవసరమైతే ఆర్థిక అత్యవసర పరిస్థితి ప్రకటించి ఏపీ ఆర్థిక పరిస్థితిని సరిదిద్దాలన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుండి ఆంధ్రప్రదేశ్ లో విధ్వంసకర పాలన సాగుతోందని ఆయన ఆరోపించారు. జగన్ ఆంధ్రప్రదేశ్‌కు భవిష్యత్ లేకుండా చేస్తున్నారు…
Rajahmundry MP Margani Bharath Ram Made Comments on TDP. గత మూడేళ్లలో దేశ సగటు కంటే మిన్నగా ఏపీ రాష్ట్ర తలసరి ఆదాయం పెరిగిందని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు హయాంలో సాధారణ పరిస్థితులు ఉన్నప్పటికీ ఏడాదికి సగటున రాష్ట్ర తలసరి ఆదాయం రూ.12,025 పెరిగిందని, కోవిడ్ సంక్షోభంలో వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో రూ.17,913 పెరిగిందని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు వెన్నుపోటు పొడిచి…
ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీ, బీజేపీ నేతల మధ్య ఎప్పుడూ మాటల యుద్ధం నడుస్తూనే ఉంటుంది.. ముఖ్యంగా కేంద్రం.. ఏపీకి కేటాయించిన నిధుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తూ వస్తున్నారు బీజేపీ నేతలు.. తాజాగా, బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఈ వ్యవహారంలో హాట్ కామెంట్లు చేశారు.. దేశంలోని అన్ని రాష్ట్రాలకన్నా ఏపీకి కేంద్రం ఎక్కువ నిధులు కేటాయించిందన్న ఆయన.. వైసీపీ ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన నిధులతో పథకాలకు తమపేర్లు పెట్టుకుని సొంత డబ్బాలు కొట్టుకుంటున్నారని మండిపడ్డారు.. కేంద్రం…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు టీడీపీ సీనియర్ నేత, మాజీ ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు.. రూ. 48 వేల కోట్లు వైసీపీ నేతల జేబుల్లోకి వెళ్లాయంటూ తీవ్ర ఆరోపణలు గుప్పించిన ఆయన.. రూ. 48 వేల కోట్ల దుర్వినియోగంపై సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు.. వైసీపీ అధికారంలోకి వచ్చాక అప్పులు – అవివీతి తప్ప మరేం జరగలేదన్న ఆయన.. ప్రభుత్వం చెప్పుకున్న స్థాయిలో సంక్షేమానికి పెద్దగా ఖర్చు పెడుతోందేంలేదన్నారు.. కోర్టుల తీర్పులపై సభలో చర్చలు…
ఆంధ్రప్రదేశ్‌లో కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై ఈ మధ్య చర్చ హాట్‌హాట్‌గా సాగుతోంది.. దాదాపు మూడేళ్ల తర్వాత ఈ మధ్యే జరిగిన శాసనసభాపక్ష సమావేశంలో వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన వ్యాఖ్యల తర్వాత ఇక కేబినెట్లో మార్పులు, చేర్పులు ఉంటాయనేది మరింత స్పష్టం అయ్యింది.. వైఎస్ జగన్ అధికాంరలోకి వచ్చాక తొలి కేబినెట్ ఏర్పాటు చేసిన తర్వాత.. ఐదేళ్లు పదవులు ఉండబోవని.. మధ్యలోనే మార్పులు చేర్పులు ఉంటాయని కూడా చెప్పారు.. అయితే, ఇప్పుడు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై హైకమాండ్…
ఏపీ అసెంబ్లీలో పరిపాలన వికేంద్రీకరణపై జరిగిన చర్చ సందర్భంగా సీఎం జగన్ ప్రసంగించారు. రాజధాని అమరావతిపై తనకు ప్రేమ ఉందని.. ప్రేమ ఉంది కాబట్టే అమరావతిలో తాను ఇల్లు కట్టుకున్నానని.. న్యాయరాజధానిగా అమరావతి కొనసాగాలని తాను నిర్ణయం తీసుకున్నట్లు సీఎం జగన్ వ్యాఖ్యానించారు. రాజ్యాంగం ప్రకారం శాసన, కార్యనిర్వహక, న్యాయ వ్యవస్థలు దేనికవే ప్రత్యేకమైనవని జగన్ అభిప్రాయపడ్డారు. రాజ్యాంగం ప్రకారం చట్టం చేసే అధికారం శాసనవ్యవస్థకు ఉంటుందన్నారు. నెల రోజుల్లో రూ.లక్ష కోట్లతో రాజధాని కట్టేయాలని కోర్టులెలా…
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోనే కాదు.. మండలిలోనూ సస్పెన్షన్ల పర్వం కొనసాగుతూనే ఉంది.. మద్యం ఎపిసోడుపై వరుసగా ఎనిమిదో రోజూ టీడీపీ ఎమ్మెల్సీల నిరసన వ్యక్తం చేశారు.. మద్య నిషేధంపై మహిళలకు జగన్ ఇచ్చిన హామీ గోవిందా గోవిందా అంటూ ఎమ్మెల్సీల నినాదాలు చేశారు.. 42 మంది మరణాలపై చర్చ జరగాలని డిమాండ్ చేస్తూ శాసన మండలి వరకు నిరసనగా ర్యాలీ చేపట్టిన ఎమ్మెల్సీలు.. మృతుల ఫోటోలకు నివాళులర్పిస్తూ నల్ల కండువాలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు.. కల్తీ సారా బాధిత…
ప్రముఖ సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళి మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ సినిమా టిక్కెట్ రేట్లను ప్రస్తావించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌పై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. జగన్ గురించి తాను ఒకే ఒక్క మాట చెబుతానని.. మీడియా వాళ్లు రెండో ప్రశ్న అడగడానికి వీల్లేదు అంటూ కామెంట్ చేశారు. సినిమా టికెట్ల ఒక్క విషయమే కాదు అది ఏ…