జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్‌పై పంచ్‌లు వేశారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను కేంద్రం పెంచితే లోకేష్ నోరు విప్పడే… భయమా? పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ కదా.. మరి పవర్ చూపించడే..? అని ప్రశ్నించారు. ఇక, రేపు ఉగాది పర్వదినం.. చంద్రబాబుకు గత మూడు ఉగాదుల నుంచి ఉగాది పచ్చడిలోని చేదు మాత్రమే తగులుతోందని వ్యాఖ్యానించిన ఆయన.. వైఎస్ జగన్.. సీఎం అయినప్పటి నుంచి మంచి పేర్లతో ఉగాది పండుగ వస్తుందని.. ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు ఇంటికే అందుతున్నాయన్నారు.. లంచాలకు అవకాశం లేకుండా డీబీటీ పద్ధతిలో నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే నగదు జమ అవుతోందన్న ఆయన.. దీంతో చంద్రబాబు, లోకేష్ లకు ఏం చేయాలో అర్ధం కాని పరిస్థితి నెలకొంది అంటూ ఎద్దేవా చేశారు.
Read Also: AP: మాజీలు కానున్న మంత్రులతో సీఎం జగన్ భేటీ.. వన్ టు వన్ సమావేశం..
ఇక, ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన పరిణామాలతో విద్యుత్ ఛార్జీలు పెంచటం అనివార్యం అయ్యిందన్నారు అంబటి రాంబాబు… 1400 కోట్ల భారం మాత్రమే ప్రజల పై పడితే టీడీపీ మాత్రం 42 వేల కోట్ల భారం వేశారని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డ ఆయన.. పక్కనున్న తెలంగాణ కంటే ఏపీలోనే విద్యుత్ ఛార్జీలు తక్కువే అన్నారు.. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను కేంద్రం పెంచితే లోకేష్ నోరు విప్పడే… భయమా? పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ కదా… మరి పవర్ చూపించడే..? అంటూ సెటైర్లు వేసిన అంబటి.. కేంద్రం పెంచుతున్న రేట్ల పై ఎందుకు మాట్లాడరు..? అని నిలదీశారు.. టీడీపీ వాళ్లు ఇంటింటికీ కొవ్వొత్తి, అగ్గి పెట్టె పంపిస్తారట.. పంపించండి… దాంతో పాటు పచ్చజెండా కూడా పంపించండి.. శుభ్రంగా కాల్చి బూడిద చేస్తారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. నాలుగు సార్లు కరెంటు ఛార్జీలు, మూడు సార్లు బస్సు టికెట్లు పెంచిన చంద్రబాబుకు అసలు మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు అంబటి రాంబాబు.