వైసీఎల్పీ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం వైఎస్ జగన్.. మూడేళ్ల తర్వాత ఈ సమావేశం అసెంబ్లీ కమిటీ హాలులో వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగింది.. సమావేశానికి హాజరైన వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు జగన్.. ఈ సమావేశానికి పిలవడానికి ప్రధాన కారణాలు, ఉద్దేశాలు ఉన్నాయన్న ఆయన.. ప్రభుత్వం ఏర్పాటై 34 నెలలు కావొస్తోంది.. మరో 2 నెలల్లో మూడు సంవత్సరాలు కూడా పూర్తి కావొస్తోంది.. ఇక పార్టీ…
CPI State Secretary Ramakrishna Fired On YSRCP and Janasena Party Leaders. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సీఎం జగన్ అదాని ప్రదేశ్ రాష్ట్రంగా మారుస్తున్నాడు అంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శలు గుప్పించారు. అమిత్ షా డైరెక్షన్ లో ఆస్థులు అదానికి అప్పగిస్తున్నారని, మోడీ, అమిత్ షా, జగన్, అదాని కలిసి మాట్లాడుకుని రాష్ట్రంలో సంపద కొల్లగొడుతున్నారని ఆయన మండిపడ్డారు. మోడీ, అమిత్ షా డైరెక్షన్లో సీఎం జగన్ నడుస్తుంటే…ఇప్పుడు పవన్ కళ్యాణ్ రోడ్…
సినీ నటుడు, అలనాటి హీరో సుమన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో మరో రెండుసార్లు జగన్ సీఎంగా కొనసాగితే రాష్ట్రం స్వర్ణాంధ్రగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. విజయవాడ జవహర్‌నగర్‌లో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ప్రజలకు ఏమీ చేయలేదని తెలిపారు. మూడు దఫాలు ముఖ్యమంత్రిగా ఒకే వ్యక్తికి అవకాశం ఇస్తే రాష్ట్రం అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుందన్నారు. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం నవరత్నాలతో పేదల్లో చిరునవ్వును నింపిందని సుమన్ అన్నారు. మరోవైపు…
జనసేన పవన్ కల్యాణ్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మంత్రి పేర్నినాని.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తానన్న పవన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.. బీజేపీ, టీడీపీలను కలిపేందుకు పవన్ ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డ ఆయన.. చంద్రబాబుని మళ్లీ అధికారంలోకి తేవడమే పవన్ కల్యాణ్ లక్ష్యం.. పవన్ రాజకీయ ఊసరవెల్లి అన్నారు.. ఇక, అందరికీ నమస్కారం పెట్టిన పవన్ కల్యాణ్.. తనకు జీవితాన్ని ప్రసాదించిన సొంత అన్న చిరంజీవినే మర్చిపోయారని.. చిరంజీవి లేకుంటే అసలు పవన్ కల్యాణ్ ఉండేవాడా? అంటూ…
గుంటూరు జిల్లా ఇప్పటం వేదికగా నిర్వహించిన జనసేన పార్టీ ఆవిర్భావ సభ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్… అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లో చీలనివ్వబోమని ప్రకటించిన ఆయన.. బీజేపీ రోడ్ మ్యాప్ ఇస్తామంది.. దానికోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు. ఇక, రాజకీయ ప్రయోజనాలు వదిలి రాష్ట్ర ప్రయోజనాల కోసం ముందుకొచ్చే పార్టీలతో పొత్తులపై ఆలోచిస్తామని వెల్లడించారు.. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడమే జనసేన పార్టీ టార్గెట్ అన్నారు…
Former CM Chandrababu about jangareddygudem death mysterys. పశ్చిమ గోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెంలో వరుస మరణాలు చోటు చేసుకున్న విషయం తెలిసింది. ఈ ఘటన రాష్ట్రా వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అంతేకాకుండా అసెంబ్లీ సమావేశాలను కూడా ఈ ఘటన కుదిపేస్తోంది. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ.. నాటు సారా వల్లనే జంగారెడ్డిగూడెం వరుస మరణాలు చోటు చేసుకున్నాయన్నారు. అంతేకాకుండా సహజ మరణాలు అంటూ ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందని, అసెంబ్లీలో…
ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం కొనసాగనున్నాయి. ఈరోజు బడ్జెట్‌పై ఉభయసభల్లో చర్చ జరగనుంది. అటు అసెంబ్లీలో ప్రభుత్వం మూడు బిల్లులను ప్రవేశపెట్టనుంది. టీటీడీ ప్రత్యేక ఆహ్వానితుల బిల్లుతో పాటు ఉద్యోగుల పదవీ విరమణ పెంపు బిల్లు, మద్యం అమ్మకాల చట్ట సవరణ బిల్లులను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. మరోవైపు మండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యావాదాల తీర్మానంపై జరిగే చర్చలో సీఎం జగన్ పాల్గొననున్నారు. కాగా అసెంబ్లీలో నేడు జంగారెడ్డిగూడెంలో వరుస మరణాలపై సభలో టీడీపీ వాయిదా తీర్మానం…
జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గుంటూరు జిల్లా ఇప్పటం దగ్గర ఈనెల 14వ తేదీన భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది.. ఇప్పటం వేదికగా.. పార్టీ కార్యాచరణను ప్రకటించబోతున్నారు పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. అయితే, సీఎం వైఎస్ జగన్ అహంకారానికి ప్రజల ఆత్మాభిమానానికి మధ్య జరుగుతున్న పోరాటమే ఈ సభగా అభివర్ణించారు జనసేన నేత నాదెండ్ల మనోహర్… జనసేన ఆవిర్భావ దినోత్సవం పండుగ వాతావరణంలో జరగనుంది అని వెల్లడించిన ఆయన.. దామోదరం సంజీవయ్య పేరుతో సభ ప్రాంగణం…
పశ్చిమ గోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెంలో మరణాలు ఇప్పుడు ఆందోళనకు కలిగిస్తున్నాయి.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇప్పటి వరకు 18 మంది మృతి చెందారు. జంగారెడ్డిగూడెంలో వరుసగా జరుగుతున్న మరణాలపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మిస్టరీగా మారిన మరణాలపై అధికారులు విచారణ చేపట్టారు. ఇక, జంగారెడ్డి గూడెంలో చోటు చేసుకుంటున్న మరణాలపై టీడీపీ తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించింది. మరణాలపై ప్రభుత్వం స్పందించాలని టీడీపీ చీఫ్ చంద్రబాబు డిమాండ్ చేశారు. ఇంత మంది చనిపోతే కూడా ప్రభుత్వం కదలడం లేదని…