సింహం సింగిల్‌గానే వస్తుంది.. పందులే గుంపులుగా వస్తాయంటూ విపక్షాలపై సెటైర్లు వేశారు డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్.. శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం మబుగాంలో సచివాలయాన్ని ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. టీడీపీ పొత్తు లేకుండా ఎన్నికల్లో గెలవగలదా? అని ప్రశ్నించారు.. తెలుగుదేశం పార్టీని సింగిల్‌గా పోటీచేయమని చెప్పండి.. చంద్రబాబు, లోకేష్, అచ్చెంనాయుడు.. తాము ఒంటరిగా పోటీచేస్తామని చెప్పమనండి అంటూ సవాల్ విసిరారు.. ఇక, వారు పొత్తు ఉండదని చెప్పలేరన్న ఆయన.. అంతా కలసి మాపై పోటీ చేయడానికి చూస్తున్నారని.. ఎంతమంది కలసి వచ్చినా మేం రెడీగా ఉన్నామన్నారు.. సింహం సింగిల్‌గా వస్తుంది, పది జంతువులు వచ్చినా.. ఒక్క గ్రాండిపుతో అన్ని పారిపోతాయన్నారు. మరోవైపు, బీసీ వ్యక్తి అయిన తనను డిప్యూటీ సీఎంను చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డిదేనన్న ధర్మాన కృష్ణదాస్.. కచ్చితంగా ఈ రాష్ర్టానికి మళ్లీ సీఎంగా జగనే అవుతారన్నారు.
Read Also: AP: జేసీ సంచలన వ్యాఖ్యలు.. వారిని సంతకాలకు మాత్రమే వాడేస్తున్నారు..!