ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తుండటంపై బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ స్పందించారు. గత ప్రభుత్వం టీడీపీ హయాంలో విద్యుత్ ఛార్జీలను పెంచలేదా అని ఆయన ప్రశ్నించారు. ఎన్టీఆర్ ప్రవేశ పెట్టిన ఉచిత విద్యుత్ పథకాలను చంద్రబాబు తీసివేయలేదా అని నిలదీశారు. గతంలో విద్యుత్ ఛార్జీలను పెంచి ప్రజలపై భారం వేసింది తెలుగుదేశంపార్టీనే అని మంత్రి వేణుగోపాలకృష్ణ స్పష్టం చేశారు. ప్రజలను ఏదో విధంగా దృష్టి మరల్చడమే టీడీపీ లక్ష్యంగా కనిపిస్తోందన్నారు.…
కాంగ్రెస్ పార్టీపై రాజ్యసభ వేదికగా సెటైర్లు వేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి… 2 నెలల్లో పదవీ విరమణ చేయనున్న 72 మంది రాజ్యసభ సభ్యులకు వీడ్కోలు పలికేందుకు ప్రత్యేకంగా సమావేశమైన రాజ్యసభలో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ పార్టీ మా మీద తప్పుడు కేసులు బనాయించడం వల్లనే నేను రాజ్యసభకు రాగలిగానంటూ ఛలోక్తులు విసిరారు. ఇక, తనను రాజ్యసభకు ఎంపిక చేసి పంపించినందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు ధన్యవాదాలు తెలిపిన ఆయన.. రాజ్యసభ చైర్మన్‌గా క్రమశిక్షణ, విలువలను,…
సీఎం వైఎస్ జగన్‌పై మరోసారి ఫైర్ అయ్యారు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. జగన్ రెడ్డికి పిచ్చి బాగా ముదిరింది… ఉగాది కానుకగా పేద, మధ్య తరగతిపై విద్యుత్ ఛార్జీల మోత మోగించారని.. ఇది పెను భారంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి వస్తే ఛార్జీలు పెంచనని హామీ ఇచ్చి ఇప్పటి వరకు ఏడు సార్లు పెంచిన ఘనత సీఎం జగన్‌కే దక్కిందన్న ఆయన.. ఎమ్మెల్యేలు గానీ,…
చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా విద్యుత్ ఛార్జీలు పెంచిన ఘనత జగనుదేనని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మరోసారి విమర్శలు గుప్పించారు. జగన్ అసమర్ధ పాలనకు విద్యుత్ ఛార్జీల పెంపు నిదర్శనమని, స్విచ్ వేయకుండానే జగన్ ప్రజలను విద్యుత్ షాక్ లకు గురి చేస్తున్నారని ఆరోపించారు. జగన్ ఇప్పటికీ ఐదు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై రూ.11,600 కోట్ల భారం మోపారని, ప్రస్తుత ఛార్జీల పెంపుతో ప్రజలపై ఏడాదికి మరో రూ.4,400 కోట్ల భారం పడనుందని…
నేడు ఏపీ వ్యాప్తంగా నిరసనలకు వామపక్షాలు పిలుపునిచ్చాయి. పెంచిన విద్యుత్ చార్జీలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసనలకు సిద్ధమయ్యాయి. ఇళ్ల స్థలాలు క్రమబద్ధీకరణకు తెలంగాణలో నేటితో గడువు ముగియనుంది. క్రమబద్ధీకరణ కోసం ఇప్పటివరకు 1.47 లక్షల దరఖాస్తులు వచ్చాయి. శ్రీశైలంలో రెండోరోజు ఉగాది మహోత్సవాలు జరుగనున్నాయి. సాయంత్రం మహాదుర్గ అలంకారంలో భ్రమరాంబికాదేవి భక్తులకు దర్శనం ఇవ్వనుంది. కైలాసవాహనంపై ఆశీనులై ఆది దంపతులు ప్రత్యేక పూజలందుకోనున్నారు. నేడు భారత్‌కు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ రానున్నారు. ప్రస్తుత…
ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉంది… అసెంబ్లీ లోపల, బయట అనే తేడాలేదు.. విషయం ఏదైనా.. రెండు పార్టీల మధ్య తీవ్రస్థాయిలో విమర్శలు, ఆరోపణల పర్వం కొనసాగుతోంది.. ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబుపై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి… పెట్రోల్, డీజిల్ ధరలపై మాట్లాడని టీడీపీ నేతలు కరెంట్ ఛార్జీల పెంపుపై మాట్లాడుతారా? అంటూ నిలదీసిన ఆయన.. చంద్రబాబు…
Andhra Pradesh Deputy CM Amzath Basha about AP Cabinet Expansion. ఏపీ మంత్రి వర్గాన్ని పునర్‌వ్యవస్తీకరించనున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ పై డిప్యూటీ సీఎం అంజాద్ బాష ఎన్టీవితో మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం నాకు శిరోధార్యం అని ఆయన వ్యాఖ్యానించారు. ఒక మైనారిటీ ఎమ్మెల్యేకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడమే గొప్ప అదృష్టం గా భావిస్తున్నాని ఆయన అన్నారు. సీఎం…