కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది… జనసేనపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా.. బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ దగ్గర గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేనిని అడ్డుకునేందుకు యత్నించాయి జనసేన పార్టీ శ్రేణులు.. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొనగా.. రంగంలోకి దిగిన పోలీసులు.. జనసేన నేతలు, కార్యకర్తలను అరెస్ట్ చేవారు.. ఈ నేపథ్యంలో.. జనసేన శ్రేణులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది.. Read Also: Congress:…
సీఎం వైఎస్ జగన్, వైసీపీ ప్రభుత్వంపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. అనకాపల్లి పార్లమెంట్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో పరిపాలన పిచ్చోడి చేతిలో రాయిలా ఉందన్నారు.. రాష్ట్రాన్ని కాపాడు కోవాలి అంటే క్విట్ జగన్, సేవ్ ఆంధ్రప్రదేశ్ నినాదంతో పని చేయాలని పిలుపునిచ్చారు.. 3 ఏళ్ల జగన్ రివర్స్ పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి పోయిందని ఆరోపించిన చంద్రబాబు..…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. వరుసగా రాష్ట్రాన్ని చుట్టూస్తున్నారు.. జిల్లాల్లో పర్యటిస్తూ.. అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం, శంకుస్థాపనలను చేయడంపై దృష్టిసారించారు.. ఇక, సొంత జిల్లాలో మరోసారి పర్యటించానున్నారు ఏపీ సీఎం.. తన పర్యటనలో ప్రొద్దుటూరులో డీసీసీబీ మాజీ ఛైర్మన్ ఇరగంరెడ్డి తిరుపాల్ రెడ్డి మనవడి వివాహానికి హాజరుకాబోతున్నారు.. అనంతరం పులివెందులలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్‌లో నియోజకవర్గానికి చెందిన ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. Read Also: Minister Kakani: బాబుకు సవాల్.. దమ్ముంటే రైతుల…
దమ్ముంటే రైతుల కోసం ఏం చేశారో చెప్పాలి అంటూ టీడీపీ అధినేత చంద్రబాబుకు సవాల్ విసిరారు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి.. నెల్లూరు జిల్లాలో మీడియాతో మాట్లాడిన ఆయన.. దిగుబడి, వాతావరణ పరిస్థితుల ఆధారంగా పంట నష్టపోతే రైతులకు కూడా నష్టపరిహారం ఇస్తున్నాం, రైతులకు మేలు జరుగుతుంటే కొందరు తట్టుకోలేక పోతున్నారని ఫైర్ అయ్యారు. టీడీపీ హయాంలో ఎప్పుడైనా ఇంత పరిహారం ఇచ్చారా..? అని ప్రశ్నించిన ఆయన.. దమ్ముంటే వివరాలు చెప్పండి అని చాలెంజ్ విసిరారు. చంద్రబాబు హయాంలో…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మరోసారి సెటైర్లు వేశారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. అభివృద్ధి కార్యక్రామాలు, ఓట్లకు లింకు పెట్టిన ఆయన.. అభివృద్ధి కార్యక్రమాలు చేసినా ఓట్లు రావని.. వాటిని లైట్‌గా తీసుకుంటున్నారని మండిపడ్డారు. ఈ ప్రభుత్వానికి కాల్వల్లో పూడిక కనిపించడం లేదా..? అని ప్రశ్నించారు.. పంట కాల్వల, డ్రెయిన్ల నిర్వహణ ఒక నిరంతర ప్రక్రియలా సాగాలని.. గత ప్రభుత్వం గానీ ఈ ప్రభుత్వం గానీ పూడికతీత అంశాన్ని నిర్లక్ష్యం చేశాయని ఆరోపించారు. పొలాల నుంచి డ్రెయిన్లలో…
* మరోసారి రాహుల్ గాంధీకి ఈడీ నోటీసులు, రేపు విచారణకు రావాలని పేర్కొన్న ఈడీ, నేషనల్ హెరాల్డ్ కేసులో ఇప్పటికే వరుసగా మూడు రోజుల పాటు రాహుల్‌ను ప్రశ్నించిన ఈడీ అధికారులు. * నేడు చలో రాజ్‌భవన్‌కు కాంగ్రెస్ పిలుపు, సోమాజిగూడ నుంచి రాజ్‌భవన్ వరకు కాంగ్రెస్ నేతల ర్యాలీ * అనకాపల్లి జిల్లాలో రెండు రోజు చంద్రబాబు పర్యటన, అనకాపల్లిలో జిల్లా టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభించనున్న చంద్రబాబు, నియోజకవర్గాల వారీగా పార్టీ కార్యకలాపాలపై సమీక్ష *…
కర్నూలు జిల్లా వైసీపీలో వర్గపోరు బహిర్గతమైంది. దీంతో కర్నూలు మండలం గార్గేపురంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యే సుధాకర్, ఇంఛార్జ్ కోట్ల హర్ష వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. గార్గేపురంలో కొంత కాలంగా ఎస్సీలు, అగ్రవర్ణాల మధ్య ఆధిపత్య గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల ఓ ఫంక్షన్ విషయంలో వైసీపీ ఎస్సీ వర్గం ప్రశాంత్ కుటుంబంపై వినయ్‌రెడ్డి వర్గం చేయిచేసుకుంది. దీంతో వినయ్ రెడ్డి ఇంటిపై ఎస్సీలు రాళ్లు, కర్రలు, రాడ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో కారు,…
ఆయన అధికారపార్టీ ఎమ్మెల్యే. రాజకీయంగా పదోన్నతి దక్కుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నా అవేమీ వర్కవుట్ కాలేదు. కానీ.. తనకంటే జూనియర్లు మాత్రం పదవులు చేపడుతుంటే.. ఎమ్మెల్యేకు నిద్ర పట్టడం లేదట. అనుచరులు స్వరం పెంచుతుంటే.. ఆయన మాత్రం లోలోపలే తెగ కుమిలిపోతున్నారట. ఎవరా ఎమ్మెల్యే? లెట్స్ వాచ్..! ఆవేదనలో ఎమ్మెల్యే చింతల చింతల రామచంద్రారెడ్డి. ఉమ్మడి చిత్తూరు జిల్లా పీలేరు ఎమ్మెల్యే. గత రెండు ఎన్నికల్లో వరసగా వైసీపీ నుంచి గెలిచారు. అంతకుముందు వాయల్పాడు ఎమ్మెల్యేగానూ పనిచేశారు…
శ్రీసత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లిలో రైతులకు పంటల బీమా పరిహారం నిధులను ఏపీ సీఎం జగన్ విడుదల చేశారు. 2021 ఖరీఫ్‌లో వైపరీత్యాలు, చీడపీడల వల్ల పంట నష్టపోయిన చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 15.61 లక్షల మంది రైతన్నలకు రూ.2,977.82 కోట్ల బీమా పరిహారాన్ని వారి ఖాతాల్లో నేరుగా జమ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. మోసం చేయడంలో చంద్రబాబు,…
ఏపీలో రెండు నెలల కిందట జరిగిన కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో వైసీపీ ఎమ్మెల్యే రోజాకు కేబినెట్ బెర్త్ దక్కింది. దీంతో ఆమె పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే రోజాకు మంత్రి పదవి రాకూడదని ఓ సీనియర్ హీరోయిన్ కోరుకున్నట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. కట్ చేస్తే.. ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే క్రమంగా జబర్దస్త్‌లోని కమెడియన్లు ఈ షోను…