టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. సీబీఐపై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి.. ప్రతీ అంశంపై సోషల్ మీడియా వేదికగా కౌంటర్లు ఇచ్చే సాయిరెడ్డి.. ఇవాళ చంద్రబాబు సీబీఐ కామెంట్స్ పై సెటైర్లు వేశారు.. అధికారంలో ఉన్నప్పడు రాష్ట్రంలోకి సీబీఐ రావొద్దంటూ ఆంక్షలు పెట్టి, ఇప్పుడు సీబీఐ లేకపోతే దేశాన్ని ఎవరు రక్షిస్తారు అంటాడు..! అని మండిపడ్డ ఆయన.. రెండు నాలుకల నాసిరకం రాజకీయ నాయకుడు (నారా) నాయుడు బాబు..…
మచిలీపట్నంలో అధికార పార్టీ వైసీపీలో వర్గవిభేదాలు చోటుచేసుకున్నాయి. ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే పేర్ని నాని మధ్య విభేదాలు రోడ్డుకెక్కాయి. ఎంపీ బాలశౌరి మచిలీపట్నం పర్యటనను పేర్ని నాని వర్గం అడ్డుకుంది. దీంతో ఎంపీ బాలశౌరి వర్గం భగ్గుమంటోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే పేర్ని నాని వైఖరిపై ఎంపీ బాలశౌరి ఫైర్ అయ్యారు. మచిలీపట్నం పేర్ని నాని జాగీరా అని ప్రశ్నించారు. మూడేళ్ళ నుంచి సొంత పార్టీ ఎంపీ అయిన తననే మచిలీపట్నం రానివ్వకుండా అడ్డుకుంటున్నారని ఎంపీ బాలశౌరి…
ఏపీలో అటవీ భూముల ఆక్రమణలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం నాడు విజయవాడలో క్యాంప్ కార్యాలయలో అటవీ, రెవెన్యూ, సర్వే, సెటిల్ మెంట్ అధికారులతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో సమగ్ర భూ సర్వే జగనన్న భూహక్కు-భూరక్ష కింద సర్వే జరుగుతోందని.. సర్వే చేసే క్రమంలో ఆక్రమణకు గురైన అటవీభూములను నిర్ధిష్టంగా గుర్తించాలని అధికారులకు సూచించారు. చట్టప్రకారం అటవీ భూములకు సర్వే…
వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 175 సీట్లు వస్తే టీడీపీ కార్యాలయానికి తాళం వేస్తామని సవాల్ చేసిన ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చె్న్నాయుడికి వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. ‘పార్టీ లేదు బొక్కా లేదన్న మీ మాటల దెబ్బకు ఆల్రెడీ టీడీపీ ఆఫీసుకి తాళాలు పడ్డాయి అచ్చన్న.. తోలు మందం వల్ల మీకు తెలియడం లేదు.. రెఫరెండం కోరాలనుకుంటే టీడీపీ ఎమ్మెల్యేలందరితో రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలకు వెళ్లొచ్చుగా’ అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. పార్టీ…
పమిడిముక్కలలో కానిస్టేబుల్ పై దాడి ఘటన దారుణమని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మర్రు అసెంబ్లీ పమిడి ముక్కల మండలంలో మట్టి మాఫియా ఆగడాలను ఫోటో తీసినందుకు కానిస్టేబుల్ బాలకృష్ణ తల పగలగొడతారా..? అంటూ ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. మట్టి మాఫియాకు ప్రభుత్వం అండగా ఉండడం వల్లే కానిస్టేబులుకు రక్తమోడేలా గాయాలయ్యాయని ఆయన ఆరోపించారు. ఈ ప్రభుత్వం ఎవ్వరినీ ఉద్యోగం సజావుగా చేయనివ్వడం లేదని ఆయన ధ్వజమెత్తారు.…
ఇటీవల ఏపీ విద్యాశాఖ విడుదల చేసిన పదో తరగతి ఫలితాలపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పదో తరగతి విద్యార్థులో జూమ్ మీటింగ్ నిర్వహిస్తున్నారు. అయితే.. ఉన్నట్టుండి ఈ జూమ్ మీటింగ్‌లో వైసీపీ నేతలు ప్రత్యక్షమయ్యారు. మాజీ మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీలు విద్యార్థుల లాగిన్ ఐడీలో నారా లోకేశ్ నిర్వహిస్తున్న జూమ్ మీటింగ్‌లోకి వచ్చినట్లు టీడీపీ నేతలు భావిస్తున్నారు. అయితే…
కోనసీమ జిల్లా పేరు మార్పుపై అమలాపురంలో అల్లర్లు చెలరేగిన సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో తాజాగా మాజీ హోంమంత్రి చినరాజప్ప మాట్లాడుతూ.. అమలాపురం అల్లర్ల సంఘటనలో పోలీసులు, ఇంటిలిజెన్స్ వైఫల్యం ఉందని ఆయన ఆరోపించారు. ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అల్లర్ల ఘటనలో వైసీపీ వారు చెప్పారని అమాయకులను బలిచేస్తే చూస్తూ ఊరుకోమంటూ ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. కోనసీమలో రైతులు క్రాప్ హాలిడే ప్రకటిస్తే టీడీపీ వారు చేస్తున్నారని మంత్రి విశ్వరూప్…
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మాజీ మంత్రి పేర్ని నాని సెటైర్లు వేశారు. పదో తరగతి ఫలితాలపై పవన్ కళ్యాణ్ తమను విమర్శించడం విడ్డూరంగా ఉందని పేర్ని నాని వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ పదో తరగతి ఫెయిల్ అయ్యారని.. అందుకే ఆయన ఫెయిల్ అయిన విద్యార్థులంటే అభిమానం చూపిస్తున్నారని.. వాళ్లను చూస్తే ఆయనకు స్వజాతి పక్షులం అన్న ఫీలింగ్ కలుగుతుందేమో అంటూ చురకలు అంటించారు. చదువుకుంటే ఎవరైనా పాస్ అవుతారనే విషయాన్ని పవన్ గుర్తుంచుకోవాలన్నారు. పదో తరగతి…
ఏపీలో వైసీపీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై బుధవారం నాడు సీఎం జగన్ వర్క్ షాప్ నిర్వహించారు. ఇప్పటిదాకా జరిగిన కార్యక్రమంలో పార్టీ నేతలకు ఎదురైన అనుభవాలు, ప్రజలు ప్రధానంగా ప్రస్తావించిన అంశాలు, కార్యక్రమాన్ని మరింత మెరుగ్గా నిర్వహించడం ఎలా అన్న అంశాలపై చర్చించేందుకే సీఎం జగన్ ఈ సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఈ వర్క్ షాప్‌లో ఎమ్మెల్యేలకు సీఎం జగన్ షాకిచ్చారు. ఎమ్మెల్యేల పని తీరుపై ఆయన పవర్ పాయింట్…
ఏపీలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సీఎం జగన్ వర్క్ షాప్ నిర్వహించారు. ఈ వర్క్ షాప్‌కు మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు, పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రభుత్వ పనితీరు ఎలా మెరుగుపరుచుకోవాలో చర్చించామని తెలిపారు. ప్రజల నుంచి స్పందన ఎలా ఉందో సీఎం జగన్ అడిగారని.. ప్రజల్లో సంతృప్త స్థాయి ఎలా ఉందో చర్చించామని వెల్లడించారు. కోటి 40 లక్షల…