Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Krishnamachari Srikkanth’s Wife on Vaibhav Sooryavanshi Dropped: ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని తుది జట్టులో అండించలేదు. బుడ్డోడికి బదులుగా సీనియర్ ప్లేయర్ సంజు శాంసన్ బరిలోకి దిగాడు. వైభవ్‌ను ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకోకపోవడంపై మాజీ భారత క్రికెటర్, బీసీసీఐ మాజీ చీఫ్ సెలెక్టర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గత టీ20 సిరీస్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచిన వైభవ్‌ను పక్కన పెట్టి సంజును ఆడించడాన్ని ప్రశ్నించారు. బాగా ఆడుతున్న వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు? అని తన సతీమణి ప్రశ్నించిందని శ్రీకాంత్ చెప్పారు.
నేను క్రికెట్ మ్యాచ్ చూడను:
తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడిన క్రిస్ శ్రీకాంత్.. వైభవ్ సూర్యవంశీని ఆడించకపోవడంతో తన భార్య కూడా ఆశ్చర్యపోయిందని చెప్పుకొచ్చారు. ‘ఆఫ్ఘనిస్తాన్‌తో తొలి టీ20లో వైభవ్ ఆడలేదు. ప్లేయింగ్ 11 చూసి నా భార్య షాక్ అయింది. నేను మ్యాచ్ చూడనని చెప్పింది. మ్యాచ్‌కు బదులుగా ఇంట్లో సినిమా చూశాం. వైభవ్ ఎందుకు ఆడటం లేదని నా భార్య ప్రశ్నిస్తూ వాదించింది. గత మ్యాచ్‌లో అద్భుతంగా ఆడిన ఆటగాడిని వెంటనే పక్కన పెట్టడం సరికాదని ఆమె కూడా అభిప్రాయపడింది’ అని శ్రీకాంత్ వెల్లడించారు.
Also Read
- Mohsin Naqvi: హమ్మయ్య.. భారత్-పాక్ ఫైనల్ ఫైట్‌కు పాకిస్థాన్ ట్రోఫీ దొంగ డుమ్మా..!
- India Cricket: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ఈరోజు 3 బిగ్ మ్యాచ్‌లు.. కోహ్లీ, రోహిత్ నుంచి యువరాజ్ వరకు..
- India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
- Abhishek Sharma: షాకింగ్ డెసిషన్.. సన్ రైజర్స్ హైదరాబాద్‌ను వీడనున్న అభిషేక్ శర్మ..?
మళ్లీ నన్ను తప్పిస్తారా?:
వైభవ్‌ను టీమ్ మేనేజ్మెంట్ సరిగ్గా ప్రోత్సహించడం లేదని శ్రీకాంత్ విమర్శించారు. ‘ఒక మ్యాచ్‌లో ఆడించి, ఆ తర్వాత పక్కన పెట్టడం వల్ల యువ ఆటగాడిలో అనవసరమైన సందేహాలు ఏర్పడతాయి. తదుపరి మ్యాచ్‌లో అవకాశం వచ్చినప్పుడు కూడా ఈ మ్యాచ్‌లో విఫలమైతే మళ్లీ నన్ను తప్పిస్తారా? అనే ఆలోచన అతడిలో కలిగే అవకాశం ఉంది. దులీప్ ట్రోఫీ నుంచి టీ20 క్రికెట్, ఇండియా-ఏ, ఐపీఎల్ వరకు వైభవ్ తన ప్రతిభను చాటుకున్నాడు. ఇలాంటి ఆటగాడిని మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అతడికి వరుసగా కొన్ని మ్యాచ్‌లు ఆడే అవకాశం కల్పించాలి. ఇలా తరచూ జట్టులోకి తీసుకోవడం, తప్పించడం ద్వారా ఆటగాళ్లకు తప్పుడు సంకేతాలు వెళ్తాయి’ అని పేర్కొన్నారు.
సంజును చూస్తే జాలేస్తోంది:
సంజు శాంసన్ విషయంలోనూ టీమ్ మేనేజ్మెంట్ తీరును క్రిస్ శ్రీకాంత్ తప్పుబట్టారు. ‘2026 టీ20 ప్రపంచ కప్‌లో ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్‌గా నిలిచిన సంజు ప్రస్తుతం ఫామ్‌లో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాడు. జట్టులోకి వస్తూ, వెళ్తూ ఉన్నాడు. టీమ్ మేనేజ్మెంట్ సంజుతో ఆడుకుంటోంది. అతడిని చూస్తే జాలేస్తోంది. ఒకవేళ సంజుపై నమ్మకం ఉంటే అతడికి వరుసగా కొన్ని మ్యాచ్‌లు ఆడే అవకాశం ఇవ్వాలి. లేదంటే వైభవ్ సూర్యవంశీకి కూడా వరుసగా అవకాశాలు ఇవ్వాలి. ఇద్దరిని రెండు మ్యాచ్‌లు ఆడించి, మళ్లీ పక్కన పెట్టడం మంచిది కాదు’ అని శ్రీకాంత్ అభిప్రాయపడ్డారు. ఆఫ్ఘనిస్తాన్‌తో తొలి టీ20లో సంజు కేవలం 10 పరుగులకే ఔటయ్యాడు. దీంతో ఈరోజు జరగనున్న రెండో టీ20లో టీమ్ మేనేజ్మెంట్ ఎవరికి అవకాశం ఇస్తుందనే దానిపై ఆసక్తి నెలకొంది.
తాజావార్తలు
-
BYD Denza D9: BYD Denza D9 భారత్‌లోకి.. 800KM రేంజ్, మసాజ్ సీట్లతో లగ్జరీ MPV!
-
Mohsin Naqvi: హమ్మయ్య.. భారత్-పాక్ ఫైనల్ ఫైట్‌కు పాకిస్థాన్ ట్రోఫీ దొంగ డుమ్మా..!
-
EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
-
Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
-
Acerpure Nitro QLED TV: 100 ఇంచెస్ స్క్రీన్‌తో Acerpure Nitro TV లాంచ్.. 120Hz డిస్ప్లే, Dolby Vision, 65W సౌండ్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!