OTT Releases: ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. అదిరిపోయే హాలీవుడ్ కంటెంట్ సిద్దం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OTT Releases: ఈ వారం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో సరికొత్త హాలీవుడ్ కంటెంట్ డిజిటల్ స్క్రీన్లపై అలరించడానికి సిద్ధమైంది. ప్రతిష్టాత్మక అవార్డుల వేడుకలతో పాటు సస్పెన్స్ థ్రిల్లర్స్, రివేంజ్ డ్రామాలు, యానిమేషన్స్, సెప్టెంబర్ 15 నుండి 18 మధ్య ప్రేక్షకులకు కావాల్సిన వినోదాన్ని పంచబోతున్నాయి. మరి ఆ టాప్ కంటెంట్ ను ఎక్కడ, ఎప్పుడు చూడవచ్చో తెలుసుకుందాం పదండి.
లీ క్రోనిన్స్ ది మమ్మీ (Lee Cronin’s The Mummy)
హారర్ థ్రిల్లర్ ఆడియన్స్ ను భయపెట్టడానికి వస్తున్న సరికొత్త సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ ఇది. ఈజిప్ట్ పురాతన శతాబ్దాల నాటి ఒక శపించబడిన మమ్మీ సమాధిని కొందరు పురావస్తు శాస్త్రజ్ఞులు పొరపాటున తెరుస్తారు. ఆ తర్వాత విముక్తి పొందిన ఆ దుష్టశక్తి నగరంలో ఎలాంటి భీభత్సాన్ని సృష్టించింది, దాని బారి నుండి వారు ఎలా తప్పించుకున్నారనేది ఊపిరిసలపని గ్రాఫిక్స్ తో దర్శకుడు లీ క్రోనిన్ దీనిని చూపించారు. ఈ ఏడాది థియేటర్లలో కూడా ఈ సినిమాను చూసి ఆడియన్స్ వనికిపోయారని టాక్. హాలీవుడ్ ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషించిన ఈ మూవీ సెప్టెంబర్ 17 నుండి JioHotstar లో స్ట్రీమింగ్ కానుంది.
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
స్ట్రేంజర్ థింగ్స్: టేల్స్ ఫ్రమ్ ’85 సీజన్ 2 (Stranger Things: Tales from ’85)
ఇది ప్రపంచవ్యాప్తంగా కల్ట్ క్రేజ్ ఉన్న ‘స్ట్రేంజర్ థింగ్స్’ సిరీస్ యానిమేటెడ్ స్పిన్-ఆఫ్ వెర్షన్ చివరి సీజన్. 1985 కాలం నాటి హాకిన్స్ నగర బ్యాక్‌డ్రాప్‌లో, తెరవెనుక జరిగే కొన్ని వింత పరిణామాలు, పిల్లల అడ్వెంచర్ల చుట్టూ ఈ యానిమేషన్ డ్రామా తిరుగుతుంది. ప్రముఖ వాయిస్ ఓవర్ ఆర్టిస్టులు ఈ యానిమేటెడ్ క్యారెక్టర్లకు ప్రాణం పోసిన ఈ క్రేజీ సిరీస్ సెప్టెంబర్ 17 న Netflix లో ప్రీమియర్ కానుంది.
నీగ్లీ (Neagley)
‘రీచర్’ (Reacher) సిరీస్ విశ్వం నుండి వస్తున్న మొట్టమొదటి స్పిన్-ఆఫ్ సిరీస్ ఇది. ఆర్మీలోని 110వ స్పెషల్ ఇన్వెస్టిగేషన్స్ యూనిట్లో జాక్ రీచర్తో కలిసి పనిచేసిన మాజీ సహోద్యోగి, ప్రైవేట్ డిటెక్టివ్ ఫ్రాన్సెస్ నీగ్లీ చుట్టూ ఈ కథ నడుస్తుంది. తన ప్రాణస్నేహితుడు అనుమానాస్పద స్థితిలో మరణించడంతో, నీగ్లీ ఆ మిస్టరీని ఛేదించే క్రమంలో ఒక ప్రమాదకరమైన అంతర్జాతీయ సంస్థ వెనుక ఉన్న కుట్రను బయటపెడుతుంది. మరియా స్టెన్, గ్రేస్టన్ హోల్ట్, అడిలైన్ రుడాల్ఫ్, గెస్ట్ అప్పీయరెన్స్‌లో అలన్ రిచ్‌సన్ నటించిన ఈ యాక్షన్ సిరీస్ సెప్టెంబర్ 16 న Amazon Prime Video లో స్ట్రీమింగ్ కాబోతోంది.
78వ ప్రైమ్‌టైమ్ ఎమ్మీ అవార్డ్స్ (78th Primetime Emmy Awards)
ఇది టెలివిజన్ రంగంలో ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే లైవ్ అవార్డుల వేడుక. హాలీవుడ్ బుల్లితెరపై గడిచిన ఏడాది కాలంలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన బెస్ట్ షోలు, నటీనటులు, సాంకేతిక నిపుణులకు ఈ వేడుకలో పురస్కారాలు అందజేస్తారు. టెలివిజన్ రంగానికి చెందిన అంతర్జాతీయ సూపర్ స్టార్స్, పాపులర్ హోస్ట్‌లు, పలువురు హాలీవుడ్ ప్రముఖులు పాల్గొనే ఈ లగ్జరీ రెడ్ కార్పెట్ ఈవెంట్ సెప్టెంబర్ 15 నుండి JioHotstar లో ప్రసారం కానుంది.
- Tags
- cinema
- ott releases
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!