Honor Play 11 5G: వాటర్‌ప్రూఫ్ ఫోన్ లాంచ్.. 8,300mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Honor Play 11
- Honor కొత్త 5G ఫోన్ లాంచ్
- IP69K రేటింగ్, 50MP కెమెరా, భారీ బ్యాటరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Honor Play 11 5G: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Honor మరో కొత్త ఫోన్‌ను దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. Honor Play 11 పేరుతో వచ్చిన ఈ ఫోన్ భారీ 8,300mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, Snapdragon చిప్సెట్ వంటి ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. అంతేకాదు, ఈ ఫోన్‌కు IP69K రేటింగ్ ఉండటం మరో ప్రత్యేకత. అంటే నీరు, దుమ్ము వంటి వాటి నుంచి ఫోన్‌కు మంచి రక్షణ లభిస్తుంది. Honor ఇప్పటికే Play సిరీస్‌లో Play 11C, Play 11T, Play 11 Plus, Play 11 Pro వంటి మోడళ్లను విడుదల చేసింది. తాజాగా ఈ సిరీస్‌లో స్టాండర్డ్ మోడల్‌గా Honor Play 11ను తీసుకొచ్చింది.
Honor Play 11 ధర ఎంత?
Honor Play 11ను మూడు స్టోరేజ్ వేరియంట్లలో విడుదల చేశారు.
Also Read
- Microsoft Buyout Plan: మైక్రోసాఫ్ట్ సంచలన నిర్ణయం.. 60 వేల మంది ఉద్యోగులపై ప్రభావం?
- Ethanol Cars: ఇండియాలో ఇక పెట్రోల్ కార్లకు స్వస్తి.. E100 ఇథనాల్ ఫ్యూయల్ వాహనాలకు గ్రీన్‌సిగ్నల్..
- AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
- itel VistaTab 32: ఐటెల్ VistaTab 32 టాబ్లెట్ లాంచ్.. 8200mAh బ్యాటరీ, 11 ఇంచెస్ డిస్ప్లే, 8MP కెమెరా ఫీచర్లు ఇవే!
6GB RAM + 128GB: CNY 1,399 (సుమారు రూ.20,000)
8GB RAM + 128GB: CNY 1,599 (సుమారు రూ.22,800)
8GB RAM + 256GB: CNY 1,899 (సుమారు రూ.27,000)
ఈ స్మార్ట్‌ఫోన్ Desert Gold, Mist Purple, Meteor Silver, Phantom Black కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
Honor Play 11 ఫీచర్లు
Honor Play 11లో 6.88 అంగుళాల LCD డిస్ప్లే అందించారు. ఇది 1592 × 720 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో పాటు 120Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే గరిష్ఠంగా 1020 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అందిస్తుంది. పెర్ఫార్మెన్స్ కోసం ఇందులో Qualcomm Snapdragon 4 Gen 4 చిప్‌సెట్‌ను ఉపయోగించారు. గరిష్ఠంగా 8GB RAM, 256GB స్టోరేజ్ ఆప్షన్ లభిస్తుంది. సాఫ్ట్వేర్ విషయానికి వస్తే ఈ ఫోన్ Android 16 ఆధారిత MagicOS 10పై పనిచేస్తుంది. యూజర్ల కోసం ఇందులో పలు AI ఫీచర్లను కూడా అందించారు.
8,300mAh భారీ బ్యాటరీ
Honor Play 11లో 8,300mAh బ్యాటరీ అందించడం ఈ ఫోన్లో ప్రధాన ఆకర్షణ. దీనికి 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. ఎక్కువసేపు ఫోన్ ఉపయోగించే వారికి భారీ బ్యాటరీ ఉపయోగకరంగా ఉంటుంది.
కెమెరా సెటప్ ఎలా ఉంది?
ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ఇచ్చారు. ఇందులో 50MP మెయిన్ కెమెరాతో పాటు మరో సెకండరీ కెమెరా ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 5MP కెమెరా అందించారు.
IP69K రేటింగ్‌తో వాటర్‌ప్రూఫ్ ఫోన్
Honor Play 11కు IP69K రేటింగ్ ఉండటం మరో ప్రత్యేకత. ఈ రేటింగ్ కారణంగా నీరు, దుమ్ము వంటి వాటి నుంచి ఫోన్‌కు మెరుగైన రక్షణ లభిస్తుంది. అయితే IP రేటింగ్ ఉన్నప్పటికీ ఫోన్‌ను ఉద్దేశపూర్వకంగా ఎక్కువసేపు నీటిలో ఉంచడం మంచిది కాదు. కనెక్టివిటీ విషయానికి వస్తే Wi-Fi 5, Bluetooth 4.2, NFC వంటి ఫీచర్లు ఉన్నాయి.
Honor Play 20A కూడా ఇటీవలే లాంచ్
Honor గత నెలలో Honor Play 20A స్మార్ట్‌ఫోన్‌ను కూడా తన దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. ఇందులో 6.9 అంగుళాల LCD IPS డిస్ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. ఫోన్ వెనుక భాగంలో నోటిఫికేషన్లు, సెల్ఫీ ప్రివ్యూ కోసం సెకండరీ కవర్ డిస్ప్లేను అందించారు. Honor Play 20Aలో MediaTek G81 చిప్సెట్, 128GB స్టోరేజ్ ఉన్నాయి. స్టోరేజ్‌ను 1TB వరకు విస్తరించుకునే అవకాశం ఉంది. ఈ ఫోన్లో 6,000mAh బ్యాటరీ, USB Type-C ఛార్జింగ్, సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉన్నాయి. కెమెరాల విషయానికి వస్తే వెనుక భాగంలో 13MP మెయిన్ కెమెరా అందించారు. ముందు భాగంలో వాటర్‌డ్రాప్ నాచ్‌లో సెల్ఫీ కెమెరాను అమర్చారు. అవసరమైతే వెనుక మెయిన్ కెమెరాతో సెల్ఫీలు తీసుకునే విధంగా సెకండరీ డిస్ప్లేను కూడా ఉపయోగించుకోవచ్చు.
తాజావార్తలు
-
AR Rahman: “ఆ ఓపిక, సమయం నాకు లేదు”.. రామాయణం సాంగ్ ట్రోలింగ్‌పై ఏఆర్ రెహమాన్ రియాక్షన్..
-
Arnab Cyclone Alert: ‘అర్నబ్’ తుపాన్ పంజా.. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, పాఠశాలలకు సెలవులు!
-
Jio Platforms IPO: జియో ఐపీఓ అలాట్మెంట్ వచ్చేసింది.. షేర్లు అలాట్ అయ్యాయో.. లేదో.. చెక్ చేసుకోండి ఇలా..!
-
Israel Elections: ఇజ్రాయెల్‌లో నేడు సార్వత్రిక ఎన్నికల పోలింగ్.. నెతన్యాహు పీఠానికి ముప్పు?
-
AP Local Body Elections: నేడు సుప్రీంకోర్టులో స్థానిక సంస్థల ఎన్నికల కేసుపై విచారణ.. కీలక ఆదేశాలపై ఉత్కంఠ!
ట్రెండింగ్
-
Sabarimala Virtual Queue Booking: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. అక్టోబర్ 29 నుంచే శబరిమల వర్చువల్ క్యూ బుకింగ్స్ షురూ..!
-
IND vs NZ: సిరీస్‌పై భారత్ కన్ను.. కివీస్‌కు డూ ఆర్ డై..! నేడే మూడో టీ20.. భారత్ ప్లేయింగ్ XI ఇలా..
-
Tilak Varma: ఎంఎస్ ధోనిని వెనక్కి నెట్టిన తిలక్ వర్మ.. విరాట్ కోహ్లీ తర్వాతి స్థానంలో స్టార్ బాయ్..!
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త