అమరావతి అనేది ఓ మాయ.. అదో భ్రమ.. అమరావతి అంటే అంతులేని అవినీతి.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే వికేంద్రీకరణ.. మూడు రాజధానులు ముద్దు అంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. గతంలో కేంద్రీకరణ ధోరణులను ప్రజలు వ్యతిరేకించారని, మరోసారి హైదరాబాద్ లాంటి సూపర్ క్యాపిటల్ మోడల్ వద్దని.. అలాంటి చారిత్రక తప్పిదానికి ప్రభుత్వం పాల్పడకూడదని ప్రజలు తీర్పు ఇచ్చారని పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. అన్ని ప్రాంతాలు, కులాలు, వారి ఆశలు, ఆంకాంక్షలను…
Botsa satyanarayana: ఏపీలో మూడు రాజధానుల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రజలు తమను ఆశీర్వదిస్తున్నారని వ్యాఖ్యానించారు. శాసనసభ చట్టాలు చేసేందుకే ఉందని.. శాసనసభ సాక్షిగా సీఎం జగన్ రైతులతో జరిగిన ఒప్పందాలను అంగీకరిస్తున్నట్లు ప్రకటించారని మంత్రి బొత్స తెలిపారు. మరి చంద్రబాబు ఒప్పంద పత్రంలో ఎందుకు రాయలేదని ప్రశ్నించారు. సీఎం జగన్ యూటర్న్ తీసుకోలేదని.. ఏపీలోని అన్ని…
Gudivada Amarnath: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి గుడివాడ అమర్నాథ్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ 175 నియోజకవర్గాల పేర్లు చెప్పగలిగితే తాను అన్నీ వదులుకుని ఎక్కడికైనా వెళ్లిపోయేందుకు సిద్ధంగా ఉన్నట్లు సవాల్ విసిరారు. జగన్ సీఎం కాడని గత ఎన్నికల ముందు చెప్పాడని.. కానీ ఏమైందో అందరూ చూశారని.. ఇప్పుడు కూడా వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలవదని చెప్తున్నాడని.. మళ్లీ వైసీపీ గెలిచి తీరుతుందని మంత్రి గుడివాడ అమర్నాథ్ జోస్యం చెప్పారు.…
Ambati Rambabu: అమరావతి రాజధాని అంశంపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించడాన్ని స్వాగతిస్తున్నట్లు మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు తీర్పు వికేంద్రీకరణకు బలాన్ని ఇస్తుందన్నారు. రాజధానుల నిర్ణయంలో న్యాయస్థానాల జోక్యం సరైంది కాదని దీన్ని బట్టి అర్థం అవుతోందని మంత్రి అంబటి అన్నారు. ఈ మధ్యంతర ఉత్తర్వుల తర్వాత అయినా చంద్రబాబుకు జ్ఞానోదయం అవుతుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అమరావతి రైతుల పాదయాత్రకు విరామం తాత్కాలికం కాదని శాశ్వతం అని తాను…
Sajjala Ramakrishna Reddy: మూడు రాజధానుల విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానులపై ప్రభుత్వ నిర్ణయం సహజ న్యాయానికి అనుగుణంగా, ప్రజల ఆకాంక్ష మేరకు ఉందన్నారు. మూడు రాజధానులపై గతంలో హైకోర్టు నిర్ణయాలు, ఆదేశాలు అందుకు భిన్నంగా వచ్చాయన్నారు. అయితే సుప్రీం కోర్టు స్టే ఇచ్చిందని.. ప్రభుత్వానికి ప్రజల తీర్పు ద్వారా సంక్రమించిన అధికారం ఉందని సజ్జల చెప్పారు. దానికి భిన్నంగా హైకోర్టు తీర్పు ఉందని…
Rapthadu Heat: శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడులో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. తాజాగా రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరులు తోపుదుర్తి చందు, రాజశేఖర్ రెడ్డిలపై సీకే పల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సీకే పల్లికి చెందిన మరికొందరు వైసీపీ నాయకులపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీ కార్యకర్త గంటాపురం జగ్గుపై దాడి చేసిన వైసీపీ నాయకులపై బెయిలబుల్ కేసులు, అక్రమ అరెస్ట్ బాధితుడు జగ్గుపై నాన్ బెయిలబుల్ కేసు పెట్టి సీకే పల్లి…
Jogi Ramesh: ఆదివారం నాడు వైసీపీపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి జోగి రమేష్ స్పందించారు. రాష్ట్రంలో అన్ని పార్టీలు కలిసివచ్చినా వైసీపీ కంచుకోటను ఇంచుకూడ కదలించలేరని ఆయన వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ అజ్ఞాని అని ఎద్దేవా చేశారు. జనసేనను సైకో సేనగా మంత్రి జోగి రమేష్ అభివర్ణించారు. పవన్ లాంటి సైకోగాళ్లు నెలకోసారి వచ్చి ప్రజలను రెచ్చగొట్టి వెళ్తుంటారని మండిపడ్డారు. ఈ సైకోలు రాత్రిపూట సంచరించే రౌడీలు, గుండాలు,…