Anil Kumar Yadav: ఏపీలోని బీజేపీ నేతలపై నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యప్ప మాలలో ఉండి తానేదో నేరం, పాపం చేసినట్లు బీజేవైఎం నేతలు ఓవరాక్షన్ చేస్తున్నారని మండిపడ్డారు. తాను ముస్లిం కండువా కప్పుకోవడాన్ని తప్పుబడుతున్న బీజేపీ నేతలకు.. శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులందరూ ఎరుమేలిలో వావర్ స్వామిని దర్శించుకునే విషయం తెలియదా అని ప్రశ్నించారు. వావర్ స్వామి ముస్లిం కాదా అని నిలదీశారు. కన్నెస్వాములందరూ వావర్ స్వామి…
Ambati Rambabu: ఏపీలో వికేంద్రీకరణపై మంత్రి అంబటి రాంబాబు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకణ చేసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. ఎంతో మంది ముఖ్యమంత్రులను తాను దగ్గరగా చూశానని.. సీఎం జగన్ తీసుకువచ్చిన మార్పులు ఎవ్వరి వల్ల సాధ్యం కాలేదన్నారు. ఆఖరి ఛాన్స్ అని చంద్రబాబు ప్రజలను బెదిరిస్తున్నారని.. ఆఖరి ఛాన్స్ అంటే అధికారం రాదని.. ప్రజల మెప్పు పొందితేనే…
బీసీలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కార్.. ఇవాళ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం వేదికగా.. బీసీ మంత్రులు, నేతలు కీలక సమావేశం అయ్యారు.. ఈ సందర్భంగా మీడియతో మాట్లాడిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల్.. విజయవాడలో డిసెంబర్ 8న భారీ ఎత్తున బీసీ సదస్సు నిర్వహిస్తామని తెలిపారు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సైతం హాజరయ్యే అవకాశం ఉందన్నారు.. ఇక, బీసీల గురించి ఎన్నికల ముందు నుంచే ఆలోచించిన వ్యక్తి వైఎస్ జగన్…
ఈ మధ్యే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.. వైసీపీ రీజినల్ కో-ఆర్డినేటర్లలో మార్పులు, చేర్పులతో పాటు.. జిల్లా అధ్యక్షుల్లోనూ ఇదే జరిగింది.. అయితే, పార్టీలో నాయకత్వ మార్పుపై విశాఖ ఉమ్మడి జిల్లాల సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.. విశాఖ వైసీపీ కార్యాలయంలో రాజ్యాంగ అమలు దినోత్సవం నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి మంత్రి అమర్నాథ్, వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే లు, ఎంపీలు హాజరయ్యారు.. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ..…
ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి.. సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి.. పార్టీలో కీలకంగా పనిచేసిన నేతలు టీడీపీకి గుడ్బై చెబుతూనే ఉన్నారు.. ఎమ్మెల్యేలుగా ఉన్న వ్యక్తులు కూడా టీడీపీకి రాజీనామా చేసి.. స్వతంత్ర ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే, పార్టీ సీనియర్ నేత, చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించిన గంటా శ్రీనివాసరావు కూడా టీడీపీని వీడేందుకు సిద్ధమైనట్టుగా తెలుస్తోంది..…
ఆంధ్రప్రదేశ్లో అప్పుడే ఎన్నికల ఫీవర్ మొదలైంది.. సాధారణ ఎన్నికలకు ఇంకా దాదాపు 16 నెలల సమయం ఉన్నా.. అన్ని పార్టీలు.. ఎన్నికలే లక్ష్యంగా తమ పని మొదలు పెట్టాయి.. మొన్నటికి మొన్న పార్టీలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. గతంలో పని విధానాన్ని మార్చుకోవాలంటూ నేతలకు వార్నింగ్ ఇచ్చారు.. అయినా పని విధానాన్ని మెరెగుపర్చుకోనివారికి షాక్ ఇచ్చారు. ఈ సారి, వైసీపీ రీజినల్ కో-ఆర్డినేటర్లతో పాటు.. పలు జిల్లాల అధ్యక్షులను…