గుంటూరులోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వరి పంటపై తాము చేసిన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారని మండిపడ్డారు వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి.. నెల్లూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వర్షాలు బాగా కురిసి పంటల దిగబడి గననీయంగా పెరిగిందన్నారు. రైతులు పండించే వరి ధాన్యాన్ని కొనడానికి ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదని.. ఇది భారంగా మారకూడదని మాత్రమే తాను అన్నానన్నారు. దీనికి సంబంధించి ఆయన మాట్లాడిన వీడియోను సమావేశంలో ప్రదర్శించారు. రైతులకు లాభసాటిగా ఉండే ప్రత్యామ్నాయ పంటలవైపు దృష్టి సారించాలని తాను కోరానన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో రైతులకు బకాయిలు పడ్డారని.. వాటిని తాము చెల్లించామని కాకాని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు సంబంధించి చంద్రబాబు హయాంలో చేసిన పాపాలే రైతులకు శాపాలుగా మారాయన్న ఆయన.. ఈ విషయంపై దమ్ముంటే చంద్రబాబు తమతో చర్చకు రావాలని సవాల్ విసిరారు మంత్రి కాకాని. ఒక పథకం ప్రకారమే అసత్యాలు ప్రచారం చేస్తున్నారు.. ఇలాంటి తప్పుడు ప్రచారానికి భయపడేదిలేదన్న ఆయన.. టీడీపీ హయాంలో రైతులను అడ్డుపెట్టుకుని దోచుకున్నారు అని ఆరోపించారు..
Read Also: Minister KTR : హైదరాబాద్ వాసులకు శుభవార్త.. వచ్చే జనవరి చివరి నాటికి నాలా పనులు పూర్తి