Andhra Pradesh: కొత్త ఏడాదిలో ఏపీ సీఎం జగన్ దూకుడు పెంచారు. దీంతో పార్టీ ప్రక్షాళనకు నడుం బిగించారు. తొలుత నెల్లూరు జిల్లా రాజకీయాలపై సీఎం జగన్ దృష్టి సారించారు. ఈ మేరకు సోమవారం నాడు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని పిలిపించి క్లాస్ తీసుకున్నారు. ఆయన ఇటీవల పార్టీ కార్యక్రమాలపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయం సీఎం జగన్ వద్దకు వెళ్లింది. దీంతో కోటంరెడ్డితో ప్రత్యేకంగా సమావేశమై పలు సూచనలు చేశారు. అయితే తాను పార్టీపై…
Anam Ramnarayana Reddy: ఏపీలో జగన్ ప్రభుత్వంపై నెల్లూరు జిల్లా వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి మరోసారి విమర్శలు చేశారు. ఏపీలో జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్తే.. ఏడాది ముందే వైసీపీ ఇంటికి వెళ్లడం ఖాయమన్నారు. వైసీపీకి ప్రజలు అధికారం ఇచ్చి నాలుగేళ్లు పూర్తికావొస్తోందని, ఇప్పటికీ సచివాలయ నిర్మాణాలు పూర్తి కాలేదని ఆనం ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి కారణం సాంకేతిక కారణాలా లేదా బిల్లుల చెల్లింపు జాప్యమా అనేది తెలియడంలేదన్నారు. కాంట్రాక్టర్లు ఎందుకు ముందుకు…
Gorantla Buchaiah Chowdary: ఏపీలో వైసీపీ సర్కారు తెచ్చిన జీవోపై టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గోరంట్ల సుబ్బయ్య చౌదరి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నూతన సంవత్సర కానుకగా వైసీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కుల్ని హరిస్తూ చీకటి జీవో తెచ్చిందని వ్యంగ్యంగా అన్నారు. బ్రిటీష్ పాలకులు అమలుచేసిన 1861 పోలీస్ యాక్ట్‌ను ఆధారం చేసుకుని ప్రభుత్వం జీవో నెం.1 తీసుకొచ్చిందని వివరించారు. జగన్ రెడ్డి తీసుకొచ్చింది ముమ్మాటికీ రాజ్యాంగ వ్యతిరేక జీవో అని పేర్కొన్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన…
Gudivada Amarnath: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సెటైర్లు వేశారు మంత్రి గుడివాడ అమర్నాత్.. అనకాపల్లిజిల్లాలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ సీఎం కావాలని ఆయన ఫ్యాన్స్ కలలు కంటున్నారు.. అయితే, ‘సీఎం పవన్ కళ్యాణ్’ పేరుతో సినిమా తీస్తే నేనే ప్రొడక్షన్ చేస్తానన్నారు.. అంటే, పవన్ కల్యాణ్‌ను తెరపై సీఎంగా చూసుకోవచ్చు.. నిజ జీవితంలో ఆయన సీఎం కాలేరనే తరహాలో ఎద్దేవా చేశారు..…
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ప్రశంసలు కురిపించారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్.. రోడ్లపై బహిరంగసభలు, ర్యాలీలు నిర్వహించడంపై నిషేధాన్ని విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.. చంద్రబాబు సభలపై నేను డీజీపీకి ఫిర్యాదు చేసి.. కోర్టుకు వెళ్లాక వైఎస్ జగన్ ఇప్పుడు జీవో జారీ చేశారు.. అందుకు సీఎం జగన్‌కు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నారు. చంద్రబాబు కంటే వైఎస్ జగన్ వేయి రెట్లు బెటర్ అంటూ ఆకాశానికి…
Minister RK Roja: ఆంధ్రప్రదేశ్‌లో కూడా పాగా వేసేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు మొదలు పెట్టింది.. అయితే, ఏపీలోని అధికార, విపక్ష నేతలు.. రాష్ట్రంలో బీఆర్ఎస్కు స్థానం లేదంటున్నారు.. తాజాగా ఈ వ్యవహారంపై స్పందించిన మంత్రి ఆర్కే రోజా.. తిరుమలలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని ముక్కలు చేసిన పార్టీని (బీఆర్ఎస్) ప్రజలు ఆదరించబోరన్నారు.. విభజన చట్టంలో హమీలను నేరవేర్చని పార్టీ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.. Read Also: Rajamahendravaram: సీఎం జగన్ సభలో అపశృతి ఇక,…
KotamReddy Sridhar Reddy: తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌తో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇటీవల కాలంలో ప్రభుత్వం, అధికారులపై కోటంరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో కోటంరెడ్డిని సీఎం జగన్ పిలిపించగా.. ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. అనంతరం వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉన్న సమస్యలనే తాను మాట్లాడానని.. తాను ప్రస్తావించిన సమస్యలను పరిష్కరించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారన్నారు. తన నియోజకవర్గంలో గడప గడపకు…