Botsa Satyanarayana: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొన్న సభల్లో కందుకూరులో 8 మంది మృతిచెందిన ఘటన మరువక ముందే, గుంటూరులో ముగ్గురు మృతిచెందారు.. ఇక, ఆ తర్వాత రోడ్లపై బహిరంగసభలు, ర్యాలీలను నిషేధిస్తూ వైఎస్ జగన్ సర్కార్ జీవో నంబర్ 1ని విడుదల చేసింది.. అయితే, దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.. అయితే, ఈ వ్యవహారంపై విపక్షాలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి బొత్స సత్యనారాయణ.. చంద్రబాబు పర్యటనలకు లక్షలాది మంది ప్రజలు వస్తుంటే ప్రభుత్వం అడ్డుకుంటున్నట్లు ప్రచారం చేస్తున్నారు.. జీవో నంబర్ 1 ద్వారా ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తున్నారని అంటున్నారు.. ఈ జీవోను ఒకసారి ప్రతిపక్షాలు చదువుకోవాలని హితవుపలికారు. జీవోలో ఎక్కడైనా సమావేశాలు, ర్యాలీలను నిషేధించినట్లు ఉందా? అని ప్రశ్నించారు.. రోడ్ల మీద బహిరంగ సభలు పెట్టవద్దు అని మాత్రమే ఉంది.. మరీ అవసరమైతే అనుమతి తీసుకుని పెట్టండి అని ఉందని చెప్పుకొచ్చారు.
Read Also: Kamareddy Collector: అపోహలొద్దు.. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై కలెక్టర్ క్లారిటీ..
చంద్రబాబు అబద్దాల కోరు అని ప్రజలకు తెలుసు అంటూ మండిపడ్డారు మంత్రి బొత్స సత్యనారాయణ.. కందుకూరు సభలో 8 మంది చనిపోతే చంద్రబాబు బహిరంగంగా క్షమాపణలు కూడా చెప్పలేదన్న ఆయన.. అమాయక ప్రజలను చంపేస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోవాలా..? ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత మాపై ఉంది.. అందుకే జీవో నంబర్ 1ని తీసుకొచ్చాం… అనుమతులు తీసుకొని.. ప్రజలకు ఇబ్బందులు లేని చోట సభలు నిర్వహించుకోవచ్చు అన్నారు.. ఇక, వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పాదయాత్రలు, సభల సమయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకునే వాళ్లం అని వెల్లడించారు. ప్రతిపక్షాలు ఇప్పటికైనా మైండ్ సెట్ మార్చుకోవాలి.. అధికార పక్షం, ప్రతిపక్షాలు ప్రజలకు బాధ్యతగా ఉండాలని సూచించారు మంత్రి బొత్స సత్యనారాయణ.