అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది… తాజాగా, ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి చేసిన కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు తిరుపతి జిల్లా వైసీపీ అధ్యక్షుడు నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి.. ఎవరైనా ఏమైనా మాట్లాడితే వెంటనే స్పందించడం, దాని జోలికి పోవడం నాకు అలవాటు లేదన్న ఆయన.. కానీ, ప్రస్తుతం జిల్లా పార్టీ అధ్యక్షుడుగా ఉన్నాను.. స్పందించాల్సిన బాధ్యత నాపై ఉందంటూ ఆనం కామెంట్లకు కౌంటర్ ఇస్తూ.. ఆనం రాంనారాయణరెడ్డి కూడా వైసీపీ బీ…
నారా లోకేష్ పాదయాత్రపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం నారాయణస్వామి.. చిత్తూరు జిల్లా ఎస్ఆర్ పురం మండలం ఎన్ఆర్ పురం గ్రామంలో గడపగడపకి మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాజకీయ పరిజ్ఞానం లేని లోకేష్ నీకెందుకు ఈ పాదయాత్ర..? అని ప్రశ్నించారు.. ఎవరిని ఉద్ధరించడానికి చేస్తావ్ ఈ పాదయాత్ర..? అని నిలదీసిన ఆయన.. వార్డ్ మెంబర్‌గా కూడా గెలవలేని నువ్వు ముఖ్యమంత్రి అయిపోవాలని పగటి కలలు కంటున్నావు అంటూ…
Bhuma Akhila Priya: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియ.. నంద్యాలలో మీడియాతో మాట్లాడిన ఆమె.. ఏపీలో బతకడం కన్నా పక్క రాష్ట్రాల్లో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని బతకోచ్చు అనే స్థాయికి ప్రభుత్వం తీసుకొచ్చిందని ఆరోపణలు గుప్పించారు.. వైసీపీ నాయకులు ఎన్నో హామీలు ఇచ్చి మభ్యపెట్టి, అధికారంలోకి వచ్చారు.. తీరా, అధికారం వచ్చిన తర్వాత ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని విమర్శించారు. ఉద్యోగాలు ఇస్తామని హామీలు ఇచ్చిన వైఎస్…
మూడు రాజధానుల వ్యవహారం ఆంధ్రప్రదేశ్‌లో కాక రేపుతూనే ఉంది.. మూడు రాజధానుల ఏర్పాటు వైపు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుండగా.. విపక్షాలు మాత్రం.. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ వస్తున్నాయి.. అయితే, ఈ నేపథ్యంలో సంచలన వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ మంత్రి ధర్మాన ప్రసాదరావు.. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం బొంతలకోడూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బాదుడే బాదుడు పేరుతో నిర్వహిస్తోన్న కార్యక్రమాలపై మండిపడ్డారు.. జన్మభూమి కార్యకర్తలు…
YSRCP: నెల్లూరు జిల్లా వైసీపీలో వర్గపోరు ముదిరింది. గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావుపై పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో జెడ్పీటీసీ ఊటుకూరు యామిని రాజీనామాకు సిద్ధమయ్యారు. ఇదేబాటలో మరికొంతమంది ఎంపీటీసీలు కూడా ఉన్నారు. సచివాలయ కన్వీనర్ల నియామకంలో ఎమ్మెల్యే వరప్రసాదరావు వైఖరిపై పలువురు వైసీపీ నేతలు మండిపడుతున్నారు. తమను సంప్రదించకుండానే పదవుల నియామకం చేపట్టారని ఆరోపిస్తున్నారు. పదవి లేకుండా అయినా ఉండగలమేమో కానీ విలువ లేని చోట ఉండలేమని జెడ్పీటీసీ, ఎంపీటీసీలు అంటున్నారు. Read Also:…
ఆంధ్రప్రదేశ్‌లో అప్పుల విషయంపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది.. ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమర్శలు.. ఇలా దుమ్మెత్తిపోసుకుంటున్నారు.. తాజాగా, రాష్ట్రంలో అర్థిక ఇబ్బందులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి.. అసలు, టీడీపీ చేసిన తప్పులు, అప్పుల వల్లే నేటికీ ఆంధ్రప్రదేశ్‌కు తిప్పలు అని పేర్కొన్నారు.. యనమలది కునుకు పాటా?’ఉనికి పాట్లా? అంటూ మాజీ ఆర్థికశాఖ మంత్రి, టీడీపీ సీనియర్ నేత…
పల్నాడు జిల్లా నరసరావుపేట పార్లమెంటు వైసీపీ సీటు వ్యవహారం ఉత్కంఠగా మారుతోంది. గడిచిన ఎన్నికల్లో నరసరావుపేట ఎంపీగా వైసీపీ నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు గెలిచారు. నియోజకవర్గంలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లు వైసీపీ ఖాతాలో పడటం.. భారీగా ఎమ్మెల్యేలకు మెజార్టీ రావడంతో ఎంపీగా కృష్ణదేవరాయలు విజయం నల్లేరు మీద నడకలా సాగింది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంపీకి అక్కడ ఇబ్బందికర పరిస్థితులు రావచ్చట. దీంతో అధిష్టానం విషయాన్నీ గ్రహించి ఆయన్ను నరసరావుపేట నుంచి మారాలని చెబుతోందట. సిట్టింగ్ సీటును…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో హస్తినకు చేరుకున్నారు. రేపు మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్నారు. పోలవరం నిధులు, విభజన హామీల అమలు, ప్రత్యేక హోదా తదితర అంశాలపై ప్రధానికి వినతిపత్రం ఇవ్వనున్నారు. పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పోలవరం నిర్మాణ పనుల కోసం 2 వేల…