టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ సమావేశంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా సమావేశం అవసరం లేదు.. ఎందుకంటే.. ఇద్దరు కలిసే సంసారం చేస్తున్నారు.. కథ, స్టోరీ, స్క్రీన్ ప్లే అన్నీ చంద్రబాబేనంటూ ఆరోపణలు గుప్పించారు.ర. తమ అపవిత్ర కలయికకు పవిత్రత తీసుకువచ్చేందుకు నిన్న సమావేశం అయ్యారని సెటైర్లు వేసిన ఆయన.. చంద్రబాబు చేసిన పనులను పవన్ ఖండించాలి.. కానీ, ఆ పని ఎప్పుడూ జరగదని విమర్శించారు. పవన్, చంద్రబాబు మీటింగ్ కోసం వీళ్లే అన్ రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు.. చంద్రబాబు సిద్ధాంతాలు ఏవి నచ్చి మద్దతు ఇస్తున్నారో పవన్ చెప్పాలని డిమాండ్ చేశారు.
Read Also: Sri Krishnarjuna Yuddhamu: ఆరు పదుల ‘శ్రీకృష్ణార్జున యుద్ధము’
ఇక, పవన్, చంద్రబాబు ఏం చర్చించారో ఎందుకు బయట పెట్టరు.. ? అని నిలదీశారు సజ్జల రామకృష్ణారెడ్డి.. సీట్లు, ఓట్లు గురించి మాట్లాడుకున్నారా? ప్యాకేజ్ గురించి చర్చించారా? అంటూ సంచలన అనుమానాలు వ్యక్తం చేశారు. ఎవరెవరు కలిసి పోటీ చేస్తారో, కన్ఫ్యూజన్ త్వరగా తొలగిపోవాలనే మేం కోరుకుంటున్నామన్న సజ్జల.. ఇంతమంది కలిసి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని దింపి.. చంద్రబాబుని అధికారంలోకి కూర్చోబెట్టాలి అనేదే అజెండా పెట్టుకున్నారని ఆరోపించారు. పగటి వేషగాళ్లు వస్తున్నారు.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రజలకు ఈ విషయాలన్ని అర్ధం అవ్వాలనే పవన్-బాబు మీటింగ్ పై ఇంత మంది నాయకులు స్పందించారని చెప్పుకొచ్చారు. మరోవైపు.. టీడీపీ, జనసేన పొత్తు పై సజ్జల కీలక వ్యాఖ్యలు చేశారు.. వైఎస్ జగన్‌కు ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఉద్దేశం లేదని స్పష్టం చేసిన ఆయన.. ప్రజలు ఐదేళ్ల కాలానికి తీర్పు ఇచ్చారు.. ప్రతిపక్షాలు తాము సజీవంగా ఉన్నామని చెప్పటానికి ముందస్తు ప్రకటనలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రహస్యంగా ఎందుకు సమావేశాలు అవుతున్నారు? తమ అక్రమ సంబంధాలను సక్రమం అని చెప్పటానికి ప్రయత్నిస్తున్నారా? అని ఎద్దేవా చేశారు.. చంపినవాళ్లను పరామర్శించటం ప్రపంచంలో ఎక్కడైనా జరుగుతుందా? 11 మంది ప్రాణాలు తీసిన వ్యక్తిని పవన్ కల్యాణ్ పరామర్శించటం ఏంటి అని విమర్శలు గుప్పించారు సజ్జల రామకృష్ణారెడ్డి.