Rachamallu Sivaprasad Reddy: దొంగనోట్ల కేసులో అరెస్ట్ అయిన బొందిలి కార్పొరేషన్ డైరెక్టర్ రజనీ విషయంపై ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్‌రెడ్డి స్పందించారు. రసపుత్ర రజనీ వైఎస్ఆర్సీపీకి చెందిన మనిషేనని ఆయన స్పష్టం చేశారు. దొంగనోట్ల చలామణి కేసులో రజనీ బెంగళూరులో పోలీసులకు దొరికిందని తమకు సమాచారం అందిందని.. తమ కుమార్తెను బెంగుళూరులోని ఓ కాలేజీలో చేర్పించడానికి తన అన్న చరణ్ సింగ్ ఇంటికి రజనీ వెళ్లిందని.. చరణ్ సింగ్ ఇంట్లో దొంగ నోట్ల కేసులో…
టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణపై మంత్రి రోజా మండిపడ్డారు. అక్కినేనిపై బాలయ్య వ్యాఖ్యలను ఆమె తప్పుబట్టారు. బాలయ్యకు వయసు పెరిగినా, ఎమ్మెల్యేగా రెండు సార్లు గెలిచినా ఆయన తీరు మారడం లేదని మంత్రి రోజా ఆరోపించారు. బాలయ్య వ్యాఖ్యల వల్ల అక్కినేని అభిమానులు బాధపడ్డారని రోజా అన్నారు. ఇవే వ్యాఖ్యలు ఎన్టీఆర్‌పై చేస్తే ఎలా ఉంటుందో బాలయ్య ఆలోచన చేయాలని సూచించారు. అటు లోకేష్ దశ దిశా లేకుండా పాదయాత్ర అంటున్నాడని.. ప్రజలకు ఏం చేశారో చెప్పలేని వాళ్లు…
Anilkumara Yadav: వచ్చే ఎన్నికల్లో నెల్లూరు నగరం నుంచి తానే పోటీ చేస్తానని వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. వచ్చే దఫా తన నియోజకవర్గం మారుస్తారని పుకార్లు షికార్లు చేస్తుండటంతో ఆయన ఈ ప్రకటన చేశారు. అనిల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి జగన్ గీసిన గీత దాటడు అని మరొకసారి మళ్ళీ చెప్తున్నానని వివరించారు. తాను రాష్ట్రంలో తలవంచేది ఒకే ఒక్క జగన్‌కు మాత్రమే అని తెలిపారు. టీ…
MP Avinash Reddy: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు ఇచ్చింది.. అయితే, సీబీఐ నోటీసులపై ఘాటుగా స్పందించారు ఎంపీ అవినాష్‌రెడ్డి.. నిన్న మధ్యాహ్నం నోటీసులు ఇచ్చి ఇవాళ మధ్యాహ్నం విచారణకు రమ్మంటే ఎలా అని ప్రశ్నించారు.. ఇక, ఐదు రోజులపాటు ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం పులివెందుల నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉందని వెల్లడించారు.. చక్రాయపేట…
Andhra Pradesh: మాజీ హోంమంత్రి, ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత డ్రైవర్ ఏఆర్ కానిస్టేబుల్ పూజల చెన్నకేశవులు(45) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గుంటూరు బ్రాడీపేటలోని సుచరిత ఇంటి సమీపంలోనే ఓ బిల్డింగ్‌లో గది అద్దెకు తీసుకుని గన్మెన్లు విశ్రాంతి తీసుకుంటుంటారు. సోమవారం రాత్రి సుచరిత సెక్యూరిటీ అధికారి రామయ్యతో కలిసి చెన్నకేశవులు విశ్రాంతి గదికి వచ్చాడు. రామయ్య స్నానం చేసేందుకు తన 9 ఎంఎం పిస్టల్‌ను బయట ఉంచి బాత్రూంలోకి వెళ్లాడు. దీంతో చెన్నకేశవులు ఆ తుపాకీ తీసుకుని…
GO Number 1: ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఇవాళ జీవో నంబర్ 1పై విచారణ జరగనుంది.. హైకోర్టు డివిజన్ బెంచ్ లో విచారణ జరపాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇవాళ విచారణ జరగబోతోంది.. హైకోర్టులో సీపీఐ రామకృష్ణ, జర్నలిస్ట్ బాలగంగాధర తిలక్ లు వేసిన పిటిషన్లను కలిపి ఇవాళ విచారించనుంది హైకోర్టు.. జీవో నంబర్ వన్‌పై ఇరు వర్గాల వాదనలు విననుంది హైకోర్టు.. కాగా.. జీవో నెంబర్ 1 పై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ…
Naga Babu: జనసేన పీఏసీ సభ్యుడు నాగబాబు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జనసేన కార్యకర్తలను ప్రభుత్వం అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతోందని ఆరోపించారు. కార్యకర్తలు వలసలు పోకుండా ఆపాల్సిన బాధ్యత తమపై ఉందని నాగబాబు అన్నారు. వచ్చే ఎన్నికల్లో పొత్తుల విషయాన్ని పార్టీ అధినేత ప్రకటిస్తారని.. పొత్తుల విషయాన్ని పార్టీ అధినేత ప్రకటిస్తారని తెలిపారు. అన్ని విషయాలు సమయం వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ చెప్తారని వివరించారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ…
Minister Roja: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి రోజా మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. చిత్తూరు జిల్లాలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కుప్పంలో జరిగిన గత ఎన్నికల్లో చంద్రబాబు దొంగ ఓట్లతో ఎమ్మెల్యేగా గెలిచాడని ఆరోపించారు. కర్ణాటక, తమిళనాడుకు చెందిన దొంగ ఓట్లతో ఇన్నాళ్ళూ గెలిచాడని.. ఇప్పుడు ఆ ఓట్లు పోవడంతో మున్సిపల్ ఎన్నికల్లో కుప్పం ప్రజలు తరిమికొట్టారని మంత్రి రోజా విమర్శలు చేశారు. దొంగ ఓట్లతోనే చిత్తూరు ఎంపీ సీటు గెలుస్తున్నాడని అన్నారు. నారా లోకేష్‌ది…