సింహపురి రాజకీయాలు నిత్యం రసవత్తరంగా మారుతున్నాయి. ఒకవైపు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎపిసోడ్ హాట్ హాట్ గా నడుస్తోంది. అధిష్టానంపై గుర్రుగా వున్నారు కోటంరెడ్డి. ఇది చాలదన్నట్టుగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ని వైసిపి అధిష్టానం పక్కన పెట్టింది.ఈ పరిణామాల అనంతరం ఆయన నేతలతో మొదటిసారి సమావేశమవుతున్నారు. సైదాపురం మండలానికి చెందిన నేతలతో నిర్వహించే ఈ సమావేశం ఆసక్తికరంగా మారింది. వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని నియమించిన తర్వాత ప్రభుత్వంపై విమర్శలు చేయడాన్ని మానేసి.. ఆనం మౌనంగా ఉన్నారు.
Read Also: Group4 Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. గ్రూప్ 4 అప్లికేషన్ గడువు పెంపు
ఆయన ఇంతవరకూ ఈ పరిణామాలపై ప్రతిస్పందించలేదు. దీంతో ఈరోజు ఆనం ఏం మాట్లాడతారనే విషయంపై నాయకులు.. కార్యకర్తల్లో ఆసక్తి నెలకొంది. ఆనం సమావేశం నిర్వహిస్తున్నారనే సమాచారం రావడంతో నేదురుమల్లి వర్గీయులు అప్రమత్తమయ్యారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించే వారిపై వేటు తప్పదని హెచ్చరించారు. ఆనం నిర్వహించే సమావేశానికి వెళ్లవద్దని కూడా పరోక్షంగా పలువురు నేతలకు సూచించారు.
ఇప్పటికే సైదాపురానికి చెందిన జెడ్.పి.మాజీ వైస్ చైర్మన్ శిరీష వర్గం నేదురుమల్లికి మద్దతు ఇస్తున్నారు. మరో వైపు రాపూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారెడ్డితో పాటు పలువురు సర్పంచ్ లు..ఇతర నేతలు ఆనం సమావేశాలకు హాజరయ్యే అవకాశం ఉంది. దీంతో మండలం నుంచి ఎవరెవరు హాజరవుతారనే విషయం చర్చనీయాంశంగా మారింది. ఈసమావేశం అనంతరం ఆనం భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.
Read Also: Teachers Transfer : టీచర్ల బదిలీలకు దరఖాస్తు గడువు పొడగింపు