Minister Gudivada Amarnath Open Challenge to Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు బహిరంగ సవాల్ విసిరారు మంత్రి గుడివాడ అమర్నాథ్.. నా దగ్గర 600 ఎకరాల భూమి ఉన్నట్టు ఆరోపిస్తున్నారు.. నా దగ్గర అంత భూమి ఉందని నిరూపిస్తే.. ఆ భూమిని జనసేన పార్టీకి విరాళంగా ఇచ్చేస్తానని ప్రకటించారు.. నిరాధారమైన ఆరోపణలు చేయడం పవన్ కల్యాణ్ మానుకోవాలని హితవుపలికిన ఆయన.. కాపులను కట్టగట్టి చంద్రబాబుకు అమ్మే ప్రయత్నం పవన్ చేస్తున్నారని విమర్శించారు. ఒక కాపు వాడిగా సలహా ఇస్తున్నా.. సీట్ల కోసం ఆరాటం కంటే పార్టీని బలోపేతం చేసి ఎడిగితే మంచిదని సూచించారు.. తెలుగుదేశం మూతబడితే ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశం జనసేనకు ఉందని వ్యాఖ్యానించారు మంత్రి గుడివాడ. ఇక, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రపై స్పందించిన మంత్రి అమర్నాథ్.. యువగళం పాదయాత్ర చూస్తే జాలేస్తోందన్నారు.. చంద్రబాబుకు ఇంటి పోరు ఎక్కువైంది.. టీడీపీ భవిష్యత్ యువనాయకుడి చేతుల్లో పెట్టాలని ఒత్తిడి ఎక్కువైందని చెప్పుకొచ్చారు.. చంద్రబాబు మాత్రం తన మీదే ఫోకస్ ఉండాలని కోరుకుంటున్నారని సెటైర్లు వేశారు.. అందుకే యువగళం పాదయాత్ర ప్రారంభమైన ఇప్పటి వరకు వెళ్లలేదన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్.
Read Also: Modi on Union Budget: కేంద్ర బడ్జెట్ గురించి ప్రధాని మోడీ ఏమన్నారంటే!