Minister Jogi Ramesh: పేదల పక్షాన కష్ట పడే సీఎం వైఎస్ జగన్ జోలికి వచ్చే పెత్తాందార్ల సంగతి తేలుస్తాం అంటూ వార్నింగ్ ఇచ్చారు మంత్రి జోగి రమేష్.. కృష్ణా జిల్లా పామర్రులో 4వ విడత కృష్ణా జిల్లా స్థాయి అమ్మ ఒడి నగదు బదిలీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కృష్ణా జిల్లాలో లక్షా 29 వేల 533 మంది విద్యార్థుల తల్లుల ఖాతాలో 168.33 కోట్లు జమ చేసినట్టు వెల్లడించారు.. పాదయాత్రలో ప్రజల కష్టాలు, బాధలు మనస్సు పెట్టీ కళ్లారా చూసిన జగన్ మోహన్ రెడ్డి.. సీఎంగా వాటిని పరిష్కరిస్తున్నాడని తెలిపారు.. రోడ్ల వెంబడ తిరిగే చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్.. మనస్సున్న జగన్ మోహన్ రెడ్డిని ఓడిస్తామని పిచ్చి వాగుడు వాగుతున్నారు. 14 ఏళ్లు సీఎంగా పని చేసిన, ప్రజల కష్టాలను పరిష్కరించలేని దౌర్భాగ్యుడు చంద్రబాబు అంటూ ఫైర్ అయ్యారు.
ఇక, పేదల పక్షాన కష్ట పడే జగన్ జోలికి వచ్చే పెత్తాందార్ల సంగతి తెలుస్తాం అని వార్నింగ్ ఇచ్చారు మంత్రి జోగి రమేష్.. పెత్తాందార్ల కోటలు బద్దలు కొట్టే సత్తా పేద ప్రజలకు ఉందన్న ఆయన.. ప్రజల మద్దతుతో 20 ఏళ్ల పాటు సీఎంగా జగన్ ఉంటారనడం శిలా శాసనంగా పేర్కొన్నారు. పెత్తాందార్ల పిల్లలు విదేశాలకు వెళ్లి ఇంగ్లీష్ మీడియం చదువుకోవచ్చు.. కానీ, పేద వర్గాల పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువును అడ్డుకునేలా కుట్ర చేస్తున్నారని దుయ్యబట్టారు. పని చేసే జగనన్న ప్రభుత్వంలోనే ప్రజలకు కావాల్సినవన్నీ జరుగుతాయి.. సీఎం జగన్మోహన్ రెడ్డి మనస్సు పెట్టి రాష్ట్ర అభివృద్ధి చేస్తున్నారు.. గత ప్రభుత్వాలు త్రీడీ, రాజమౌళి సెట్టింగ్‌లకే పరిమితం అని ఆరోపణలు గుప్పించారు మంత్రి జోగి రమేష్.
మరోవైపు.. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చిన మహానుభావుడు సీఎం జగన్ మోహన్ రెడ్డి అని ప్రశంసలు కురిపించారు ఎమ్మెల్యే అనిల్ కుమార్.. కార్పోరేట్ విద్యా వ్యవస్థను తలదన్నే రీతిలో.. ప్రభుత్వ పాఠశాలలు తయారు చేశారని.. రాష్ట్రంలో పుట్టిన ప్రతి బిడ్డ సంక్షేమానికి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడించారు అనిల్ కుమార్.. ఇక, ప్రజలకు మేలు చేయడంలో తగ్గేదెలే అన్నట్లు సీఎం జగన్ మోహన్ రెడ్డి కృషి ఉందంటూ కొనియాడారు ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు.. సచివాలయల వ్యవస్తపై ప్రతి పక్షాల విష ప్రచారం చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల నమ్మకాన్ని పొందిన సీఎం జగన్ .. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డిని, వైసీపీ ఎమ్మెల్యేలను ప్రజలు మళ్లీ మళ్లీ దీవించాలని విజ్ఞప్తి చేశారు ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు.