Anil Kumar Yadav: డొంక తిరుగుడు వద్దే వద్దు.. దమ్ముంటే నా సవాల్‌ను స్వీకరించాలంటూ నారా లోకేష్‌కు మరోసారి ఛాలెంజ్ విసిరారు నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్.. యువ గళంకు వస్తున్న స్పందనను చూసి సీఎం జగన్ జడుసుకుంటున్నాడని లోకేష్ మాట్లాడడం విచిత్రంగా ఉందన్న ఆయన.. వచ్చే ఎన్నికల్లో నన్ను అసెంబ్లీలో అడుగుపెట్టనీయకుండా ఆపే దమ్ముంటే వచ్చి పోటీ చేయాలి.. ఎన్నికల్లో నాపై పోటీ చేసి గెలవాలని లోకేష్ కు సవాల్ విసిరాను.. లేక నీ తరపున ఎవరినైనా పెట్టి గెలవాలని కూడా చెప్పా.. రాకపోయినా ఓడిపోయినట్లే నని భావిస్తా అన్నారు.. టికెట్ రాదంటున్నారు కదా అయితే ఎందుకు సవాల్ స్వీకరించడం లేదు.. దమ్ముంటే సవాల్ స్వీకరించాలి.. అంతేగానీ డొంక తిరుగుడు వద్దన్నారు.
Read Also: Bro: 12 గంటల్లో కోటి దాటేశారు.. అదిరింది ‘బ్రో’
లోకేష్ కు మాట్లాడేందుకు చేత కావడం లేదంటూ సెటైర్లు వేశారు అనిల్ కుమార్.. ఆయన ప్రసంగాన్ని చూసి టీడీపీ నేతలే నవ్వుకుంటున్నారు.. లోకేష్ వేసిన జోకులు అర్థం గాక ఎలా ప్రతిస్పందించాలో సతమతమవుతున్నారు.. ఇందుకోసం ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకుంటున్నారు అంటూ ఎద్దేవా చేశారు. కేంద్రంలో పనిచేసిన మంత్రులు, రాష్ట్ర మాజీ మంత్రులు, సీనియర్ నాయకులు ఈయన వెనకాల తిరుగుతూ.. ఆయన భాష అర్థం కాక తలవంచుకొని కూర్చుంటున్నారని విమర్శించారు. వెర్రి పుష్పం.. పులకేసి.. అని అందుకే అంటున్నారు.. నాకు టికెట్ రాదన్నారు.. ఇప్పుడు పోటీ చేస్తున్నాం.. దమ్ముంటే నాతో పోటీ చేసి గెలవాలన్నారు.. నా ఛాలెంజ్ తీసుకోకపోతే నువ్వు లోకేష్ కాదు పులకేసి అని ఒప్పుకోవాలి అని చెప్పా.. అందుకే నా సవాల్ తీసుకోవడం లేదు.. పులకేసి అని ఒప్పుకున్నావు అటూ ఎద్దేవా చేశారు. నిన్ననే సిటీ అభ్యర్థిగా నారాయణ పేరును ప్రకటించారు.. ఎన్నికల కోసం ఇప్పుడే నారాయణ దోపిడీ ప్రారంభించారని ఆరోపించారు. విద్యార్థుల నుంచి రిజిస్ట్రేషన్ తో పాటు దరఖాస్తు రుసుముతో వివిధ రకాల ఫీజులను వసూలు చేస్తున్నారు.. ఈ డబ్బులని ఎన్నికల్లో ఖర్చు పెడతారంటూ ఆరోపణలు గుప్పించారు మాజీ మంత్రి, నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్.