Harirama Jogaiah Open Letter: ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్ హీట్ పెరుగుతూనే ఉంది.. ఓవైపు యాత్రలు, పాదయాత్రలు, సభలు, సమావేశాల వేదికగా సవాళ్ల పర్వం, ఆరోపణలు, విమర్శలు కొనసాగుతుండగా.. మరోవైపు లేఖల యుద్ధం కూడా సాగుతూనే ఉంది.. సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ హోంమంత్రి, కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామ జోగయ్య మరోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు.. గతంలో సీఎం వైఎస్ జగన్‌తో పాటు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంకి లేఖలు రాసిన ఆయన.. ఈ సారి సీఎం జగన్‌కు రాసిన లేఖలో సంచలన విషయాలు పేర్కొన్నారు..
Read Also: PM Modi: మధ్యప్రదేశ్‌లో 5 కొత్త వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్న ప్రధాని మోడీ
మీపై సీబీఐ, ఈడీ విచారణ చేసి క్విడ్‌ప్రోకో కింద, మనీ ల్యాండరింగ్ కింద సీబీఐ 11 కేసులు, ఈడీ ఆరు కేసులు బనాయించాయి.. 16 నెలలు జైలు శిక్ష అనుభవించి బెయిల్‌పై విడుదలయ్యారు.. కానీ, ముఖ్యమంత్రిపై ఉన్న కేసుల్లో సీబీఐ కోర్టులో ఇంకా విచారణలో ఉన్నాయి.. కోర్టులు ఏ కారణం చేతైనా మిమ్మలను దోషులుగా ప్రకటిస్తే.. సీఎం పదవికి రాజీనామా చేయాల్సి వస్తే.. మీ వారసులుగా రెడ్డి కులస్తులను ముఖ్యమంత్రిగా ప్రకటిస్తారా..? లేక కాపు బడుగు బలహీన వర్గాల వారిని వారసులుగా ప్రకటిస్తారా? ఈ విషయాన్ని చెప్పాలని డిమాండ్ చేశారు.. దీని ద్వారా బడుగు బలహీన వర్గాలపై మీకున్న కమిట్‌మెంట్ చూసి గర్వపడతామని లేఖలో పేర్కొన్నారు. ఈ విషయాన్ని బహిరంగ ప్రకటన ద్వారా ప్రజలకు తెలియజేయాలని మిమ్మల్ని కోరుతున్నానంటూ.. సీఎం వైఎస్ జగన్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు హరిరామ జోగయ్య.