వారాహి యాత్రలో రెండు చెప్పులు పోయాయి అంటున్న పవన్.. ప్యాకేజీ స్టార్ అని అందరికీ తెలుసు.. చంద్రబాబు ఇంటికి వీధి గుమ్మంలో వెళ్లిన పవన్.. ప్యాకేజీ తీసుకుని దొడ్డి దారిన వెళ్లిపోయారు. అక్కడే రెండు చెప్పులు వదిలేశారు.. చంద్రబాబు ఇంటికి వెళ్లి వెతికితే ఆ రెండు చెప్పులు దొరుకుతాయి అంటూ ఎద్దేవా చేశారు గ్రంధి శ్రీనివాస్.
నసేన అధినేత పవన్ కల్యాణ్ పై దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ హాట్ కామెంట్స్ చేశారు. మాకు తొడలు కొట్టి మీసాలు తిప్పడం రాదు. నాయకుడంటే ఆదర్శం కావాలి, జగన్ మీద వ్యక్తిగత విమర్శలు చేయడం కాదని మంత్రి కొట్టు సత్యనారాయణ ఆరోపించారు. యువతకు పవన్ కల్యాణ్ చెడు సందేశం ఇస్తున్నాడని.. పవన్ కల్యాణ్ నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడని.. మీరు కూడా 40 పెళ్లిళ్లు చేసుకోండనే సందేశంతో ఆడపిల్లల తల్లిదండ్రులు బాగోద్వేగానికి గురవుతున్నారని తెలిపారు.
వారిలా ఊగుతూ మనం మాట్లాడలేం.. వారిలా మనం రౌడీల్లా మీసాలు మెలేయలేం.. వారిలా మనం రౌడీల్లా తొడలు కొట్టలేం.. బూతులు మాట్లాడలేం.. వారిలా నాలుగేసి పెళ్లిళ్లు చేసుకోలేం.. నాలుగేళ్లకు ఒకసారి భార్యను మార్చలేం.. పెళ్లి అనే పవిత్ర వ్యవస్థలను నాశనం చేయలేం.. రోడ్డుపైకి తీసుకురాలేం.. వారిలా అలాంటి పనులు మనం చేయలేం.. అవన్నీ వారికే పేటెంట్ అంటూ హాట్ కామెంట్లు చేశారు సీఎం వైఎస్ జగన్.
భీమవరంలోని ఓటర్లు ఎంత మంది ఉంటారు, ఎన్నిక విధానం లాంటివి కూడా పవన్ కల్యాణ్‌కు తెలియదని విమర్శించారు.. ఇక, సినిమా వాళ్లకి ప్రజల్లో ఆదరణ ఉంటుంది.. యాంకర్ అనసూయ రాజమండ్రి వచ్చినా జనం కిక్కిరిసిపోతారంటూ కామెంట్ చేశారు.
నెల్లూరు సిటీలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, సీనియర్ వైసీపీ నేత రూప్ కుమార్ యాదవ్ మధ్య గత కొంతకాలంగా విభేదాల నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ (సోమవారం) సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో తాడేపల్లిలో క్యాంప్ కార్యాలయంలో అనిల్ కుమార్ యాదవ్ భేటీ సమావేశం అయ్యారు. దాదాపు 45 నిమిషాల పాటు అనిల్ కుమార్ తో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుకున్నారు.