Minister RK Roja: మగాడి విజయం వెనుక స్త్రీ ఉంటుంది.. కానీ, ఒక స్త్రీ విజయం వెనుక స్త్రీనే ఉంటుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister RK Roja: ఒక మగాడి విజయం వెనుక స్త్రీ ఉంటుంది.. కానీ, స్త్రీ విజయం వెనుక ఒక స్త్రీ నే ఉంటుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మంత్రి ఆర్కే రోజా.. పద్మావతి మహిళా యూనివర్సిటీ మహిళ సాధికారత సమావేశంలో పాల్గొన్న ఆమె… ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహిళా పక్షపాతి సీఎం వైఎస్ జగన్ అన్నారు. చరిత్రలో ఎవరు చేయని విధంగా మహిళల కోసం కృషి చేస్తున్నారని.. లక్షలాది మహిళల అకౌంట్స్‌లో నేరుగా కోట్లాది రూపాయల డబ్బులు వేస్తున్నారని ప్రశంసలు కురిపించారు. పాలు ఇచ్చే స్థాయి నుండి పాలించే స్ధాయికి దేశంలో మహిళలు ఎదిగారు.. 33 శాతం రిజర్వేషన్ల ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. రిజర్వేషన్ల ఇవ్వకుండానే ప్రపంచంలో ఎన్నో విజయాలు సాధించిన ఘనత మహిళలది.. విద్యా, సినిమా, రాజకీయాలు ఎక్కడైనా సరే.. మహిళలను వెనక్కి తరిమేసిలా ప్రయత్నం చేస్తుంటారని.. మనం చేస్తున్న పని తప్పా, ఒప్పా అని మనకు తెలుస్తే చాలు.. మహిళలు విమర్శలకు భయపడి పారిపోకూడదు.. పోరాటం మాత్రమే చేయాలని పిలుపునిచ్చారు.
Read Also: Bengaluru Bus Shelter: షాకింగ్.. అసెంబ్లీకి కిలోమీటర్ దగ్గర్లోని బస్టాప్ చోరీ
Also Read
- Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
లింగ వివక్షత అనేది సమాజంలో ఉండకూడదు.. కొత్త జనరేషన్, యువతరం దానిని మార్చాలని కోరారు మంత్రి రోజా.. సినిమా వాళ్లు బ్లూ ఫిలింలు చేస్తారని ఒక పనికి మాలిన యదవ మాట్లాడు.. మనం చేస్తున్న పని తప్పా? కాదా? అని మనకు తెలిస్తే చాలు.. మన మనసాక్షికి తెలిస్తే చాలు.. ఎవరో ఎదో తిట్టారని భయపడి వెనక్కి అడుగు వేయకుండా ముందుకే వెళ్లాలన్నారు. మహిళల కోసం ఎంతో పోరాటం చేశాను.. ఉద్యమాలు చేశానని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు మంత్రి ఆర్కే రోజా.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!