పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని వచ్చాడని మంత్రి మేరుగ నాగార్జున వ్యాఖ్యానించారు. పవన్ ఎవరి కోసం పార్టీ పెట్టాడు.. ఎవరి కోసం పనిచేస్తున్నాడని ఆయన ఎద్దేవా చేశారు.
కొన్ని రాజకీయ పార్టీలకు ఇష్టారాజ్యంగా మాట్లాడటం అలవాటుగా మారిందని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది దురదృష్టకరమన్నారు. ప్రజల కోసమో, రాజకీయం కోసమో ఆలోచించుకుని మాట్లాడాలని మంత్రి సూచించారు.
Jagananna Colony: రాష్ట్రంలో సొంత ఇల్లు లేని వారు ఉండకూడదనేది ఏపీ సీఎం వైఎస్ జగన్ సంకల్పం. ప్రతి అక్క చెల్లి తమ పిల్లలతో సొంత ఇంట్లోనే ఉండాలని ఆయన తలంచాడు. అందులో భాగంగా 30.75 లక్షల మందికి రూ.76,000 కోట్ల విలువైన ఇళ్ల స్థలాలు ఇప్పటికే అందజేశారు.
పురంధేశ్వరిపై సజ్జల రామకృష్ణారెడ్డి కామెంట్లకు బీజేపీ కౌంటర్ ఇచ్చింది. బీజేపీ జోలికి వస్తే సహించమని బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి బిట్ర శివన్నారాయణ హెచ్చరించారు. పురంధేశ్వరిపై విమర్శలు చేసే స్థాయి సజ్జలకు లేదని ఆయన తీవ్రంగా మండిపడ్డారు.
స్కిల్ స్కాంలో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయాడని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. నేరం జరగలేదగని చంద్రబాబు నిరూపించగలరా అంటూ ప్రశ్నించారు. ఊరు, పేరు లేకుండా అగ్రిమెంట్ తయారు చేశారని మండిపడ్డారు.