పార్టీ ప్రతినిధుల సభతో గేర్ మారింది.. స్పీడ్ పెరిగింది అని మంత్రి పేర్కొన్నారు. ఇక పాత సైకిల్, కొత్త గ్లాసు కొట్టుకుపోవాల్సిందేనంటూ టీడీపీ, జనసేన పార్టీలపై పరోక్షంగా ఈ వ్యాఖ్యలను ఆయన చేశారు. అంతేకాదు.. చంద్రబాబు, లోకేశ్, పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలను మంత్రి అంబటి రాంబాబు తన పోస్టుకు ట్యాగ్ చేశారు.
బండారు సత్యనారాయణమూర్తి తనపై చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టుకు వెళ్తానని, న్యాయపరంగా పోరాడతానని మంత్రి ఆర్కే రోజా వెల్లడించారు. బండారు లాంటి చీడపురుగులను ఏరిపారేయాలంటూ తీవ్రంగా మండిపడ్డారు. మహిళలను ఒకమాట అనాలంటే భయపడే పరిస్థితి రావాలని ఆమె అన్నారు.