Nara Bhuvaneshwari: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్నారు.. అయితే, చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు వివిధ రూపాల్లో ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.. కొన్ని ప్రాంతాల్లో అవి జరుగుతోన్నా.. మరికొన్ని ప్రాంతాల్లో పోలీసులు ఆంక్షలు పెడుతున్నారు.. టీడీపీ నేతలను నిర్బంధిస్తున్నారు.. దీనిపై సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి.. తల్లి వర్ధంతి కార్యక్రమానికీ నేతలను వెళ్లనీయరా..? ఇదెక్కడి న్యాయం? అని నిలదీశారు.. తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలపై పోలీసు నిర్భంధం తీవ్ర ఆవేదన కలిగిస్తోంది.. తల్లి వర్ధంతి కార్యక్రమాలకు కూడా వెళ్లనీయకుండా ఒక మాజీ మంత్రిని అడ్డుకోవడం దేశంలో మరెక్కడైనా ఉంటుందా..? అని మండిపడ్డారు.
Read Also: Ritu Varma: చీరకట్టులో సిగ్గులొలికిస్తున్న రీతు వర్మ..
ఇదేమి చట్టం.. ఇదెక్కడి న్యాయం? అని ప్రశ్నించారు భువనేశ్వరి.. కొల్లు రవీంద్ర పట్ల ప్రభుత్వం అనుసరించిన వైఖరి ఎంతో బాధించింది అని పేర్కొన్నారు. వ్యవస్థల నిర్వీర్యమని చంద్రబాబు ఎందుకు ఆందోళన వ్యక్తం చేసేవారో ఈ ఘటన చూస్తే అర్థం అవుతుందన్నారు. కుటుంబ వ్యవహారాలను, వ్యక్తిగత హక్కులను, సంప్రదాయాలను రాజకీయాలతో ముడి పెట్టవద్దని ఉన్నతాధికారులను కోరుతున్నాను అంటూ తన ట్వీట్‌లో పేర్కొన్నారు నారా భువనేశ్వరి. కాగా, ఏపీ స్కిల్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు రిమాండ్ ఇవాళ్టితో 40వ రోజుకు చేరింది.. ఈ నెల 19వ తేదీ వరకు కోర్టు రిమాండ్ విధించిన విషయం విదితమే.