Peddireddy Ramachandra Reddy: చంద్రబాబుపై పెద్దిరెడ్డి ఫైర్.. నమ్మి మోసపోవద్దు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Peddireddy Ramachandra Reddy: చిత్తూరు పర్యటనలో టీడీపీ అధినేత చంద్రబాబుపై విరుచుకుపడ్డారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. పుంగనూరులో ఏరియా ఆసుపత్రి ప్రారంభించిన మంత్రి పెద్దిరెడ్డి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు పై ఫైర్ అయ్యారు.. చంద్రబాబు మేనిఫెస్టోలో ఇంటికి ఒక బంగారు ముద్ద ఇస్తానని చెప్తాడు.. ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క ట్రాక్టర్ ఇస్తానంటాడు.. యువకులకు మోటార్ సైకిల్ ఇస్తాను అంటాడు.. చంద్రబాబు నాయుడు ఇచ్చే హామీలు నమ్మి మోసపోవద్దు అంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు..
ఇక, సదుంలో నూతనంగా నిర్మించిన 50 పడకల ఆసుపత్రిని ప్రారంభించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. ఇసుక పాలసీపై మాట్లాడారు.. ఇసుక సీఎం వైఎస్ జగన్ తమ్ముడికి ఇస్తున్నాం అని విష ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఇప్పటికే టెండర్లు పిలిచాం, నాలుగు కంపెనీలు ముందుకు వచ్చాయి.. టెండర్లకు ఇంకా సమయం ఉంది… ఇంకా ఏమి కాకముందే సీఎం సోదరుడి పేరు చెప్పి విమర్శిస్తున్నారని మండిపడ్డారు.. కనీసం ఒక్కసారి కూడా సచివాలయం మొహం చూడని వైఎస్ జగన్ ను 16 నెలలు జైలు లో పెట్టారు.. కానీ, ఆధారాలతో దొరికిపోయిన కూడా చంద్రబాబు తప్పు ఏం చేయలేదు అంటున్నారని దుయ్యబట్టారు.. కొంత మంది ఏదో అన్యాయం జరిగింది అని రాద్ధాంతం చేస్తున్నారంటూ టీడీపీ ఆందోళనలు, నిరసన కార్యక్రమాలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
Also Read
- Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
- YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
- Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
- OTR: బీజేపీలో 25 మందికి షాక్? ఎమ్మెల్సీ టికెట్‌పై బిగ్ ట్విస్ట్!
ఇక, పుంగనూరులో ఏరియా ఆసుపత్రిని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కలిసి ప్రారంభించిన డిప్యూటీ సీఎం నారాయణస్వామి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు పై మండిపడ్డారు.. తెలుగుదేశం పార్టీని టెర్రరిస్టులతో పోల్చిన నారాయణస్వామి. వెన్నుపోటు దారుడు చంద్రబాబు.. ఎన్టీఆర్ పార్టీని లాక్కున్న వ్యక్తి చంద్రబాబు అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
తాజావార్తలు
-
Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
-
Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!